India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారతరత్న అమర్త్య సేన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ‘నోబెల్’ ట్విటర్‌లో పంచుకుంది. సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో అవార్డు పొందడంలో ఆయన సైకిల్ కీలక పాత్ర పోషించిందని తెలిపింది. ‘మగ, ఆడపిల్లల మధ్య తేడాలపై పరిశోధన చేసేందుకు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్‌పైనే తిరిగేవారు. పిల్లల బరువును తానే స్వయంగా కొలిచేవారు. మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి చేయడంలో ఆయన సహాయం చేశారు’ అని నోబెల్ పేర్కొంది.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఇవాళ మ.3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్ నిర్వహించి రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.
బ్రిటన్ PM కీర్ స్టార్మర్‌కు ఫోన్ చేసినట్టు కెనడా PM జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. తమ పౌరులపై భారత ప్రభుత్వ ఏజెంట్ల టార్గెటెడ్ క్యాంపెయిన్‌ను వివరించానన్నారు. ప్రజల భద్రత, క్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంపై చర్చించామన్నారు. ఈ సీరియస్ మ్యాటర్ పరిష్కారానికి భారత్ సహకారం తీసుకొనేందుకు ఆసక్తిగా ఉన్నానన్నారు. జియోపాలిటిక్స్‌లో ప్రాధాన్యం తగ్గిన UKకు ఫోన్ చేస్తే లాభమేంటని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.
AP: లాసెట్ ప్రవేశాల షెడ్యూల్‌ను నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య గంగాధర్ విడుదల చేశారు. లాసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులంతా ఈ నెల 16 నుంచి 20 లోపు రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ చేయించుకోవాలన్నారు. 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 26న మార్పులు, 28న సీట్లు కేటాయిస్తామని చెప్పారు. సీట్లు పొందిన విద్యార్థులు 29, 30 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలన్నారు.
TG: సీఎం రేవంత్ రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) మీటింగ్‌లో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ అధిష్ఠానంతో సమావేశమై క్యాబినెట్ విస్తరణపై చర్చిస్తారని సమాచారం.
రాజకీయ లబ్ధి కోసం కెనడా PM జస్టిన్ ట్రూడో నీచ స్థాయికి దిగజారారని విశ్లేషకులు అంటున్నారు. ఖలిస్థానీలు సహా తమ పౌరుల్ని హతమార్చేందుకు భారత దౌత్యవేత్తలు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారన్న ఆయన ఆరోపణల్ని కొట్టిపారేశారు. హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకేసు ఆధారాలను భారత్‌కు ఇంకా ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడూ ఎవిడెన్స్‌లు ఇవ్వకుండా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. >>comment
AP: అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో నేటి నుంచి 17 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చిత్తూరులో ఇవాళ, రేపు, అనంతపురంలో బుధ, గురువారాలు సెలవులు ఇస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు.
AP: గతంలో అమలైన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీని కోసం తమిళనాడు, ఒడిశా, ఝార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఇలాంటి పథకాలను అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో 2016లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ కిట్‌లో దుప్పటి, దోమతెర, స్లీపింగ్ బెడ్, పౌడర్, లోషన్, న్యాప్‌కిన్, డైపర్స్ వంటివి ఉంచి బాలింతలకు అందించేవారు.
TG: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతోందంటూ KTR విమర్శించారు. ‘కరెంటు ఛార్జీల మోతకు సర్కార్ రెడీ. 300 యూనిట్లు దాటితే కిలో వాట్‌కు ఫిక్స్‌డ్ ఛార్జీ ₹50’ అనే వార్తను Xలో షేర్ చేశారు. ‘పవర్‌లోకి వచ్చి ఏడాది కాకముందే ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. వినియోగదారులు జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే మీరు కొత్త బాదుడు షురూ చేస్తారా?’ అని ప్రశ్నించారు.
AP: మద్యం దుకాణాదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. MRP కంటే ఎక్కువ అమ్మినా, ట్యాక్స్ చెల్లించని మద్యం, నాటుసారా విక్రయిస్తే జరిమానాలు విధిస్తామని, లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. అంతర్జాతీయ బ్రాండ్ల మద్యం వచ్చే నెలలో అందుబాటులోకి వస్తుందన్నారు. 15 రోజుల్లో కల్లుగీత కార్మికులకు 340 షాపులు కేటాయిస్తామని తెలిపారు. సిండికేట్ లేకుండా చూస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.