News January 10, 2025

మహా కుంభమేళాలో ఈ బాబాలు స్పెషల్

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఈనెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. 12 పుష్కరాల తర్వాత జరగనుండటంతో అన్ని ప్రాంతాల నుంచి భక్తులు, సాధువులు, అఘోరాలు నదీ స్నానానికి వెళ్తున్నారు. అయితే, ఇందులో రోజుకు పది కప్పుల టీ తాగుతూ జీవనం సాగిస్తున్న ‘చాయ్ వాలే బాబా’, తలపై వరి, శనగ మొక్కలను పెంచుతున్న అనాజ్ వాలే బాబా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

News January 10, 2025

PHOTOS: వైకుంఠ ఏకాదశి స్పెషల్

image

TG: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి వైకుంఠ ద్వారం గుండా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. యాదగిరి గుట్ట, భద్రాచలం, నిజామాబాద్ వెంకటేశ్వర స్వామి, వేములవాడ రాజన్న, భువనగిరి స్వర్ణగిరి తదితర ఆలయాల్లో సందడి నెలకొంది.

News January 10, 2025

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్

image

AP: పోక్సో కేసుకు సంబంధించి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టివేసింది.

News January 10, 2025

సంక్రాంతి బస్సులపై ఇక్కడిలా.. అక్కడలా!

image

సంక్రాంతికి APSRTC 7,200, TGSRTC 6,432 బస్సులు నడుపుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని స్పష్టం చేసింది. ప్రైవేట్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉండేలా చర్యలు తీసుకుంటామంది. అటు, TGSRTC స్పెషల్ సర్వీసుల్లో 50% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్వీసుల వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది.

News January 10, 2025

ఇంటర్ విద్యార్థి.. స్కూళ్లకు 23 సార్లు బాంబు బెదిరింపులు

image

ఢిల్లీలోని ప‌లు పాఠ‌శాల‌ల‌కు ఇటీవ‌ల వ‌చ్చిన 23 బాంబు బెదిరింపుల‌ను ఓ క్లాస్ 12 విద్యార్థి పంపిన‌ట్టుగా పోలీసులు నిర్ధారించారు. గ‌తంలోనూ అనేక బెదిరింపు సందేశాలు పంపిన‌ట్టు సదరు విద్యార్థి అంగీక‌రించాడ‌ని డీసీపీ సౌత్ అంకిత్ చౌహాన్ తెలిపారు. ప‌రీక్ష‌లు రాయ‌కుండా త‌ప్పించుకోవ‌డానికే ఈ దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు పేర్కొన్నారు. స్కూళ్లకు సెలవు ప్రకటించి పరీక్షలు రద్దు చేస్తారని భావించినట్లు చెప్పారు.

News January 10, 2025

ఈ ముగ్గురిలో కీపర్‌గా ఎవరైతే బాగుంటుంది?

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాలో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. KL రాహుల్, పంత్‌, శాంసన్‌లు పోటీలో ఉన్నారు. వీరిలో ఇద్దరికి స్క్వాడ్‌లో చోటు దక్కే ఛాన్సుంది. ODIల్లో KL 77 మ్యాచుల్లో 49.15 avgతో 2,851 రన్స్ చేయగా, పంత్ 31 మ్యాచుల్లో 871 (33.50), శాంసన్ 16 మ్యాచుల్లో 510 (56.66) పరుగులు చేశారు. వీరిలో ఎవరిని తుది జట్టులో ఆడిస్తే బాగుంటుంది?

News January 10, 2025

BGTలో రికార్డులే రికార్డులు!

image

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన BGTలో గ్రౌండ్‌లోనే కాకుండా బయట కూడా పలు రికార్డులు నమోదయ్యాయి. ఈ సిరీస్‌ FOX స్పోర్ట్స్‌లో 1.4బిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవడంతో పాటు 7కు పైగా ఛానళ్లలో 13.4M నేషనల్ ఆడియన్స్‌ను చేరుకుందని ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు తెలిపాయి. అలాగే క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో 2బిలియన్ వీడియో వ్యూస్ వచ్చినట్లు వెల్లడించాయి. ఈ సిరీస్‌లో IND 1-3తో ఓడిపోయిన విషయం తెలిసిందే.

News January 10, 2025

లేఔట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం GOలు తెచ్చింది. లేఔట్లలో రోడ్లను 12M బదులు 9Mలకు కుదిస్తూ, 500చ.మీ. పైబడిన స్థలాల్లోని నిర్మాణాల్లో సెల్లార్‌కు అనుమతి, TDR బాండ్ల జారీ కమిటీలో సబ్ రిజిస్ట్రార్లను తొలగిస్తూ నిర్ణయించింది. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా జీవోలు తెచ్చామని.. దీంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని మంత్రి నారాయణ చెప్పారు.

News January 10, 2025

కాంగ్రెస్, BRS మధ్య ‘బ్లాక్ బ్యాగ్’ విమర్శలు!

image

TG: ‘పదేళ్ల నుంచి దుమ్ము పట్టిన ఒక నల్ల బ్యాగు ACB ఆఫీసులో ఉంది. ఈ బ్యాగ్ ఎవరిదో చెప్పుకోండి’ అంటూ BRS ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన T కాంగ్రెస్ ‘ఆ నల్ల బ్యాగులో 2014 నుంచి మీరు చేసిన పాపాల చిట్టా ఉంది. ఆ బ్యాగును చూసి తెల్లమొహం వేసుకున్నాడా KTR? BRS దోపిడీ దొంగల అవినీతి వివరాలను నింపడానికి ఆ బ్యాగు సరిపోదు. KTR విచారణకు వెళ్లిన ప్రతిసారి బ్యాగులను లెక్కించమని చెప్పండి’ అని కౌంటర్ ఇచ్చింది.

News January 10, 2025

లిక్కర్ కంపెనీలకు, ప్రభుత్వానికి సంబంధమేంటి?

image

TG: పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో UB కంపెనీ మద్యం సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. లిక్కర్ కంపెనీలు తమ బ్రాండ్లను నేరుగా దుకాణాలకు సరఫరా చేయలేవు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిపోలకు మాత్రమే పంపాలి. డిపోల నుంచి రిటైల్ వ్యాపారులకు మద్యం చేరుతుంది. కంపెనీలు డబ్బుల కోసం పూర్తిగా ప్రభుత్వంపైనే ఆధారపడాలి. అటు వినియోగదారుడు కొనే బీరు ధరలో 16% తయారీ ఖర్చు ఉండగా 70% ప్రభుత్వ పన్నులే ఉంటాయి.