India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యుద్ధం కారణంగా గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా మహిళల కష్టాలు వర్ణనాతీతం. పిల్లల కడుపు నింపడానికి ఒళ్లు అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వారి దుస్థితిని ఆసరాగా చేసుకుని స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తమ కోరిక తీరిస్తేనే ఆహారం అందిస్తామని చెప్పి మహిళలను లోబర్చుకుంటున్నారు. మానవతా సాయం ముసుగులో అకృత్యాలకు తెరతీస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది.

అంటువ్యాధుల భయంతో పేరెంట్స్ పిల్లలకు యాంటీమైక్రోబియల్ సోప్‌లు, డిటర్జెంట్లు, శానిటైజర్, టూత్‌పేస్ట్, క్రీమ్స్ వాడతారు. అయితే వాటిల్లో ఉండే ట్రైక్లోశాన్‌తో చిన్నారుల్లో అలర్జీలు, హైఫీవర్, ఎగ్జిమా, శ్వాసలో గురక ముప్పు పెరుగుతుందంటున్నారు బ్రౌన్ వర్సిటీ పరిశోధకులు. వివిధ ఉత్పత్తుల్లో దీని వాడకాన్ని అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. కాబట్టి ట్రైక్లోశాన్ ఫ్రీ ప్రొడక్ట్స్ మాత్రమే కొనండి.
<<-se>>#ChlidCare<<>>

భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. Star Sportsలో మ్యాచ్ లైవ్ చూడొచ్చు.
IND: జైస్వాల్, రాహుల్, సుదర్శన్, గిల్(C), జురెల్, జడేజా, సుందర్, నితీశ్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్
WI: చంద్రపాల్, కాంప్‌బెల్, అథనాజ్, బ్రాండన్, షాయ్ హోప్, రోస్టన్ ఛేజ్(c), గ్రీవ్స్, వారికన్, పియరీ, జోహన్ లేన్, జేడెన్ సీల్స్

హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్(HSCC)లిమిటెడ్ 27 అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 13వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీఏ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఫార్మసీ డిగ్రీ, పీజీ డిప్లొమా, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: http://hsccltd.co.in/

‘చైనా ఆస్టర్’ పువ్వులను కట్‌ఫ్లవర్‌గా, వేడుకల్లో డెకరేషన్ కోసం, పూజా కార్యక్రమాల్లో వాడుతుంటారు. ఈ పువ్వుల సాగుకు మంచి సూర్యరశ్మితో పాటు చల్లని వాతావరణం అవసరం. అందుకే వీటిని అక్టోబర్ నెలలో నాటుకోవాలని ఉద్యానశాఖ అధికారులు సూచిస్తారు. నీరు బాగా ఇంకే లోతైన ఎర్రగరప నేలలు వీటి సాగుకు అనుకూలం. IIHR బెంగళూరు రూపొందించిన కామిని, వయోలెట్, కుషన్, శశాంక్, అర్చనా, పూర్ణిమ రకాలు అధిక పూల దిగుబడిని అందిస్తాయి.

విజయదశమి రోజు కచ్చితంగా పాలపిట్టను చూడాలని పెద్దలు చెబుతారు. జమ్మి వృక్షాన్ని అర్చించి రావణాసురుడి సంహారానికి వెళ్తున్న శ్రీరాముడికి పాలపిట్ట ఎదురైందని పురాణాలు చెబుతున్నాయి. అరణ్యవాసం ముగించుకుని జమ్మి వృక్షంపై ఉన్న ఆయుధాలను తీసుకుని కురుక్షేత్రానికి బయల్దేరిన పాండవులకూ పాలపిట్ట తారసపడిందని పురాణాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే విజయదశమిరోజు పాలపిట్టను దర్శించాలని, అది విజయానికి సంకేతమని చెబుతారు.

నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న దుర్గాదేవికి దసరా రోజున నిమజ్జనం చేసి వీడ్కోలు పలుకుతారు. దశమి తిథి రోజున అమ్మవారి విగ్రహంతో పాటు పూజ ఆరంభంలో పెట్టిన కలశాన్ని(ఘటస్థాపన) కూడా నదీజలాల్లో నిమజ్జనం చేస్తారు. వచ్చే ఏడాది మళ్లీ తమ వద్దకు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. దుర్గా నిమజ్జనానికి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్తమ సమయమని పండితులు సూచిస్తున్నారు.

AP: కాకినాడ జిల్లా పనసపాడులో 17 ఏళ్ల బాలిక దారుణ హత్య, 19 ఏళ్ల కొమ్మూరి అశోక్ గూడపర్తి వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అమ్మాయిని అశోక్ బ్లేడుతో గొంతు కోసి చంపి, తర్వాత సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చనిపోయే ముందు అశోక్ తన తండ్రికి ‘ఐయాం సారీ.. ఐలవ్‌యూ సోమచ్ నాన్నా’ అని మెసేజ్ చేశాడు.

దశమి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసంతో పూజ చేయాలి. ఘటస్థాపన ముందు దీపం వెలిగించి చివరి హారతి ఇవ్వాలి. పూలు, పసుపు, కుంకుమ, అక్షత, ధూపద్రవ్యాలు, నైవేద్యాలు సమర్పించాలి. పూజ సమయంలో తెలియక చేసిన తప్పుల్ని క్షమించమని వేడుకోవాలి. వచ్చే ఏడాది మళ్లీ రమ్మని కోరుతూ, శుభ్రమైన నీటి వనరులలో నిమజ్జనం చేయాలి. ఇలా చేస్తే నవరాత్రి పూజల ఫలితంతో పాటు సానుకూల శక్తి, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి.

OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై ఎలాన్ మస్క్ ఫైరవుతున్నారు. “Netflix పిల్లల్లో ట్రాన్స్‌జెండరిజాన్ని ప్రోత్సహిస్తోంది. ‘ది బేబి సిస్టర్స్ క్లబ్’ అనే వెబ్‌సిరీస్‌లో ఓ పిల్లాడిని బాలికగా భావించి వైద్యం చేయాలని అడిగే సన్నివేశం దారుణం” అని ఓ యూజర్ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ మస్క్ ‘క్యాన్సిల్ నెట్‌ఫ్లిక్స్’ అంటూ పిలుపునిచ్చారు. చాలామంది ఇప్పటికే క్యాన్సిల్ చేశామని కామెంట్స్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.