News January 9, 2025

బాబాయ్-అబ్బాయ్: ఫిర్ ఏక్ బార్ ఏక్ సాథ్?

image

శ‌ర‌ద్ ప‌వార్‌-అజిత్ ప‌వార్ వ‌ర్గాలు తిరిగి ఏక‌మవుతాయ‌న్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒక‌వైపు కేంద్ర మంత్రి ప‌ద‌వులు ఆశ‌చూపి శ‌ర‌ద్ వ‌ర్గం MPల‌ను అజిత్ వ‌ర్గం ఆక‌ర్షిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఇద్ద‌రూ క‌ల‌వాల‌ని దేవుణ్ని ప్రార్థించిన‌ట్టు అజిత్ త‌ల్లి ఆశాతాయి పేర్కొన్నారు. MPల ఫిరాయింపు, NDAలో చేరిక‌ను ఇరు వ‌ర్గాలు ఖండిస్తున్నాయి. అయితే కింది స్థాయి నేత‌లు బ‌లంగా కోరుకుంటున్నారు.

News January 9, 2025

అంతరిక్షం నుంచి లాస్ ఏంజెలిస్‌‌ వైల్డ్ ఫైర్ PHOTO

image

అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌‌లో కార్చిచ్చు వేలాది ఎకరాలను దహించివేస్తోంది. దావానలంలా వ్యాపిస్తున్న మంటల్లో గ్రామాలన్నీ బూడిదవుతున్నాయి. ఈ వైల్డ్ ఫైర్, పొగ ఏకంగా అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తున్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ESA ప్రయోగించిన కోపర్నికస్ సెంటినెల్-2 శాటిలైట్ ఈ అగ్నికీలల ఫొటో తీసింది.

News January 9, 2025

ఇజ్రాయెల్‌కూ పాకిన సొరోస్ విద్వేషం: మస్క్

image

రెజిమ్ ఛేంజర్ జార్జ్ సొరోస్ మానవజాతి విద్వేషి అని బిలియనీర్ ఎలాన్ మస్క్ మండిపడ్డారు. ఆయన విద్వేషం ఇజ్రాయెల్‌కూ పాకిందన్నారు. హమాస్ మిలిటెంట్లకు మద్దతిచ్చే NGOకు ఆయన $15 మిలియన్లు డొనేట్ చేశారన్న ఇజ్రాయెలీ UN అంబాసిడర్ గిలాడ్ ఎర్డాన్ వ్యాఖ్యలపై స్పందించారు. సొరోస్‌కు బైడెన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును ప్రకటించడంతో ఇంతకన్నా అపహాస్యం ఉండదంటూ సెటైర్ వేయడం తెలిసిందే.

News January 9, 2025

తెలంగాణలో ఇష్టపడ్డ మందు, బీర్లు దొరకవా..!

image

తెలంగాణలో మద్యం ప్రియులకు మున్ముందు ఇక్కట్లు తప్పేలా లేవు! ఏం జరుగుతుందో తెలీదు గానీ జాతీయ, అంతర్జాతీయ ఆల్కహాల్ కంపెనీలకు బకాయిలు చెల్లించడం లేదని సమాచారం. రూ.900 కోట్లు చెల్లించాలని కింగ్‌ఫిషర్ మేకర్ <<15102445>>UBL<<>> సరఫరా నిలిపేసింది. Diageo, Pernod Ricard, Carlsberg, Heineken కంపెనీలకు ₹3,961CR చెల్లించాల్సి ఉంది. ఇవీ సప్లైని నిలిపేస్తే రుచికరమైన బీరు, విస్కీ దొరకడం ఇక కష్టమేనని మందుబాబులు బాధపడుతున్నారు!

News January 9, 2025

బయోపిక్ తీయాలనుకుంటే రజినీకాంత్‌పైనే: స్టార్ డైరెక్టర్

image

ఒకవేళ తాను గనుక బయోపిక్ తీస్తే రజినీకాంత్ సార్‌ది తెరకెక్కిస్తానని దర్శకుడు శంకర్ చెప్పారు. ఆయనొక గొప్ప వ్యక్తి అని, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పారు. శంకర్ వ్యాఖ్యలు రజినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శివాజీ, రోబో, రోబో 2.0 సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించాయి. ఒకవేళ ఈ బయోపిక్ వస్తే ఇందులో ఎవరు హీరో అయితే బాగుంటుందో కామెంట్ చేయండి?

News January 9, 2025

ఉచితాలా? సౌకర్యాలా? ఏవి కావాలో తేల్చుకోండి: అరవింద్

image

ఉచిత పథకాలపై 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ అరవింద్ పనగఢియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు కావాలో? మంచి రోడ్లు, మంచినీటి సరఫరా తదితర సౌకర్యాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మౌలిక సదుపాయాలకు కేటాయించిన నిధులను రాష్ట్రాలు ఉచితాలకు పంచుతున్నాయనే ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘ప్రాజెక్టులకు డబ్బులిస్తే వాటికే ఖర్చుచేయాలి. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే తుది నిర్ణయం’ అని పేర్కొన్నారు.

News January 9, 2025

భారత్ నా మనసు దోచింది: US అంబాసిడర్

image

భారత్ అద్భుతమైన దేశమని, తన మనసును దోచిందని US అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి చెప్పారు. త్వరలో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘ఇరు దేశాల మధ్య సంబంధాలు గొప్పగా ఉన్నాయి. యుద్ధాలకు అడ్డుకట్ట వేసి శాంతిని నెలకొల్పేందుకు పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు కష్ట కాలాలను ఎదుర్కొంటున్నా భారత్, అమెరికా మాత్రమే స్థిరంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

News January 9, 2025

ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ఘటన: జగన్

image

AP: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగిందని జగన్ ఆరోపించారు. TTD, పోలీసులు కౌంటర్ల వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదన్నారు. భక్తులను పట్టించుకోకుండా, క్యూ లైన్లలో నిలబెట్టకుండా, ఒకేచోట గుమిగూడేలా చేశారని విమర్శించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే BNS 105(ఉద్దేశపూర్వకంగా మృతికి కారకులు) బదులు తీవ్రత తక్కువగా ఉండే BNS 194(ప్రమాదవశాత్తూ దొమ్మీ) సెక్షన్లతో కేసులు పెట్టడం దారుణమన్నారు.

News January 9, 2025

మేం చేసిన కార్యక్రమాలు నేటికీ చెప్పుకుంటున్నారు: వైఎస్ జగన్

image

AP: తిరుపతి తొక్కిసలాటపై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘మేం అధికారంలో ఉండగా టీటీడీ తరఫున చేసిన పనుల్ని ప్రజలు ఈరోజుకీ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ నేడు కనీసం తిండి, నీరు కూడా లేని పరిస్థితి నెలకొంది. వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. చనిపోయిన వారికి కనీసం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచిత వైద్యంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.

News January 9, 2025

చంద్రబాబు సహా అందరూ బాధ్యులే: జగన్

image

AP:తిరుపతిలో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరమని YS జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని పేర్కొన్నారు. స్విమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఏటా జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా ఎందుకు సరైన ఏర్పాట్లు చేయలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనికి CM నుంచి TTD ఛైర్మన్, EO, SP, కలెక్టర్ అందరూ బాధ్యులేనని ధ్వజమెత్తారు.