News April 7, 2024

దేశంలో ఎక్కడికెళ్లినా మాపై ప్రేమ కురిపించారు: రోహిత్

image

వరల్డ్‌కప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత దేశ ప్రజలు మాపై కోపంతో ఉంటారనుకున్నామని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ‘ఫైనల్లో ఓటమి అనంతరం ప్రజలు నిరాశ పడి ఉంటారు. దీంతో మాపై కోపంగా ఉంటారని అనుకున్నాం. కానీ దేశంలో ఎక్కడికి వెళ్లినా మాపై ప్రేమ కురిపించారు. మా ఆట తీరును ప్రశంసించారు’ అని ఆయన పేర్కొన్నారు.

News April 7, 2024

ఏనుగుకు స్నానం చేయించిన రామ్ చరణ్

image

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఏనుగు రెస్క్యూ క్యాంపులో సందడి చేశారు. క్లీంకారతో కలిసి వారు చిన్న ఏనుగుకు స్నానం చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఉపాసన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘అద్భుతమైన అనుభవాన్ని అందించినందుకు చరణ్‌కు ధన్యవాదాలు’ అని ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.

News April 7, 2024

దూకుడుగా ఆడలేకపోయా: కోహ్లీ

image

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో దూకుడుగా ఆడలేకపోయానని.. ఆ విషయం తనకు తెలుసని ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నారు. ‘వికెట్ కాస్త ఫ్లాట్‌గా ఉండడంతో చివరి వరకు ఆడాలని భావించా. పరిస్థితులకు అనుగుణంగా పరిణతితో ఆడా. ఇక్కడ అంత ఈజీగా పరుగులు రాబట్టలేం. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రన్స్ రాబట్టలేకపోయా. ఈ పిచ్‌పై 183 రన్స్ నయమేననిపించింది’ అని ఆయన పేర్కొన్నారు.

News April 7, 2024

మాధవీ లతపై మోదీ ప్రశంసలు

image

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై ప్రధాని మోదీ X వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె పాల్గొన్న ‘ఆప్ కీ అదాలత్’ <>ఎపిసోడ్<<>> అసాధారణమైందని కొనియాడారు. ఎంతో ప్యాషన్‌తో ఆ ఎపిసోడ్‌లో బలమైన పాయింట్లు మాట్లాడారని పేర్కొన్నారు. ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

News April 7, 2024

BREAKING: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్

image

TG: మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. రద్దీ పెరగడంతో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.59 హాలిడే కార్డుతో పాటు మెట్రో కార్డుపై ఇచ్చే 10శాతం రాయితీని రద్దు చేశారు. మరోవైపు ఎండల తీవ్రతతో మెట్రో ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. రాయితీలను రద్దు చేయడంతో ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే కోచ్‌ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

News April 7, 2024

ప్రచారానికి దూరంగా టాలీవుడ్ హీరోలు?

image

ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరోలు సందడి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కొంతమంది బహిరంగంగా తమ మద్దతు తెలియజేయడానికి జంకుతున్నారు. వారు సపోర్ట్ చేసిన పార్టీ కాకుండా వేరే పార్టీ అధికారంలోకి వస్తే తమ సినిమాలపై ప్రభావం పడుతుందని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వచ్చిన తర్వాత కొందరు గెలిచిన పార్టీకి మద్దతిచ్చే ఛాన్స్ ఉంది.

News April 7, 2024

హీరోయిన్‌కు హత్యా బెదిరింపులు

image

తెలుగులో తేజ దర్శకత్వంలో ‘ధైర్యం’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రైమా సేన్.. ప్రస్తుతం ‘మా కాళి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 1946 ఆగస్టు 16న కోల్‌కతాలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావని కొందరు వ్యక్తులు తనకు కాల్స్ చేసి బెదిరిస్తున్నారని రైమా సేన్ వాపోయారు. హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.

News April 7, 2024

టిల్లన్నకు రామ్ చరణ్ అభినందనలు

image

తాజా సెన్సేషన్ ‘టిల్లు స్క్వేర్’ మూవీ యూనిట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. ‘సిద్ధూ.. నీ అద్భుత విజయం పట్ల గర్వంగా ఉంది. హీరోయిన్ అనుపమ, దర్శకుడు మల్లిక్ రామ్, మ్యూజిక్ డైరెక్టర్లకు, నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్‌కు హృదయపూర్వక అభినందనలు’ అని పేర్కొన్నారు. అంతకుముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ టీమ్‌ను అభినందించిన సంగతి తెలిసిందే.

News April 7, 2024

అది జనజాతర కాదు.. అబద్ధాల జాతర: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది జనజాతర కాదని.. అబద్ధాల జాతర అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘6 గ్యారంటీల పేరుతో గారడీ చేశారు. నమ్మి ఓట్లేసిన 4 కోట్ల ప్రజలను నట్టేట ముంచారు. రైతుల ఆత్మహత్యలు, నేతన్నల బలవన్మరణాలకు కాంగ్రెస్ కారణమవుతోంది. అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. రుణమాఫీ, తాగు, సాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. వీళ్ల ఆర్తనాదాలు వినిపించట్లేదా రాహుల్ గాంధీ’ అని ఆయన ట్వీట్ చేశారు.

News April 7, 2024

భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో కేజీ రూ.310, హైదరాబాద్‌లో కేజీ రూ.300 ధర పలుకుతోంది. వారం క్రితం రూ.200 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.100 పెరిగి రూ.300కు చేరుకుంది. దీంతో చాలా మంది చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. ఈ ధరలు చూసి మాంసాహార ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. ఎండలు ముదురుతుండటంతో కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో వాటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో ధరలు పెరిగిపోతున్నాయి.