India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం 8.30 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయంది.
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఈ ఏడాది అత్యుత్తమంగా రాణిస్తున్నారు. ఈ సంవత్సరంలో అభిషేక్ 18 టీ20 మ్యాచులు ఆడి 584 పరుగులు చేశారు. స్ట్రైక్ రేట్ ఏకంగా 200కుపైగా ఉండటం విశేషం. పొట్టి క్రికెట్‌లో మరే క్రికెటర్‌కూ ఇంత స్ట్రైక్ రేట్ లేదు. రస్సెల్ (199.47), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (194.13), ట్రావిస్ హెడ్ (176.24), ఫిలిప్ సాల్ట్ (172.67) కూడా అభిషేక్ ముందు దిగదుడుపుగా ఉన్నారు.
AP: ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుక ఇస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. దీనివల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, YCPలోని కొందరికి కడుపు నొప్పి వచ్చిందని ఎద్దేవా చేశారు. ‘వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఖజానాలో డబ్బుల్లేవు. నిధుల కోసం ఢిల్లీ వెళ్లి అందరినీ రిక్వెస్ట్ చేసి వచ్చా. ఒక పక్క రోజువారీ అప్పులున్నాయి. అప్పులు ఇచ్చినవాళ్లు రోజూ తిరుగుతున్నారు’ అని తెలిపారు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ ఫొటో మార్చారు. టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా నిలిచాక రోహిత్ భారత జాతీయ జెండాను మైదానంలో పాతారు. అందుకు సంబంధించిన ఫొటోనే డీపీగా పెట్టుకోగా ఆయన జాతీయ జెండాను అగౌరవపరిచారంటూ కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. జాతీయపతాక నియమావళి ప్రకారం జెండాను నేలపై తాకేలా ఉంచడం నేరమంటున్నారు. రోహిత్ అలా చేయకుండా ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.
AP: వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నష్టాల్లో ఉన్న విద్యుత్ రంగాన్ని సాధ్యమైనంత వరకు గాడిలో పెట్టేందుకు సాయం తీసుకుంటాం. టారిఫ్ నియంత్రణపై దృష్టి సారిస్తాం. వైసీపీ హయాంలో గృహ వినియోగదారులపై 45% ఛార్జీలు పెంచారు. 50 యూనిట్లు వాడిన పేదలపై 100% ఛార్జీలు పెరిగాయి’ అని విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా తెలిపారు.
టీమ్ఇండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ పరిసరాల్లో ఇంటి స్థలం ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ ఆయనను సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి భారత క్రికెట్ జట్టు జెర్సీని బహూకరించారు. భవిష్యత్తులో సిరాజ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, భారత క్రికెట్ జట్టుకు మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నట్లు రేవంత్ ట్వీట్ చేశారు.
TG: ఎన్నికల్లో మహిళలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాటిని విస్మరించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘మహిళలకు ప్రతి నెలా రూ.2,500, కళ్యాణ లక్ష్మి కింద రూ.లక్ష నగదుతోపాటు తులం బంగారం ఇవ్వలేదు. విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేయలేదు. రేవంత్ సర్కార్ ఒక్కో మహిళకు ప్రస్తుతం రూ.20వేలు బాకీ ఉంది. వారి తరఫున మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’ అని స్పష్టం చేశారు.
చైనాపై ఆధారపడాల్సిన అవసరం లేదని, తామూ ఉన్నామని రష్యాకు భరోసా ఇచ్చేందుకే మోదీ ఈ పర్యటన చేపడుతున్నట్లు రష్యన్ నిపుణులు పేర్కొన్నారు. 2020లో గల్వాన్ ఘటనతో చైనాతో సంబంధాలు క్షీణించాక రష్యాతో బంధం భారత్‌కు కీలకంగా మారిందని చెబుతున్నారు. ఒకవేళ చైనాతో రష్యా బంధం బలపడితే డ్రాగన్‌ను నియంత్రించడం కష్టమని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా రష్యాకు దగ్గరకాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.
పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలను ఎదుర్కొంటున్న వేళ మోదీ రష్యా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ పర్యటనకు ప్రధాన కారణం చైనానే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఉమ్మడి శత్రువు కావడంతో ఇటీవల కాలంలో రష్యా చైనాకు దగ్గరవుతోంది. దీని వల్ల డ్రాగన్ బలోపేతం అయ్యే ప్రమాదం ఉండటంతో భారత్ రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే మోదీ రష్యా పర్యటన చేపట్టారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. ఓ దశలో 80,397 చేరి ఆల్ టైమ్ హై నమోదు చేసిన సెన్సెక్స్ 391 పాయింట్ల లాభంతో 80,351 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 24,443కు చేరి సరికొత్త రికార్డుతో ట్రేడింగ్ ముగించింది. సూచీలు ఈ స్థాయిలో క్లోజ్ అవడం ఇదే తొలిసారి. ఆటో, FMCG, ఫార్మా రంగాల షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. మారుతీ, ITC, M&M, హీరో మోటార్ కార్ప్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
Sorry, no posts matched your criteria.