India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాను ప్రభాస్‌తో ఓ సినిమాలో నటించానని, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించడంతో బాధేసిందని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఓ మూవీ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘ప్రభాస్ సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్ చిత్రీకరించారు. తర్వాత ఫోన్ చేయలేదు. తర్వాత నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తెలిసింది. హిట్ జోడీ కాబట్టి మేకర్స్ కాజల్‌ను తీసుకున్నారట’ అని చెప్పుకొచ్చారు.
Jul-Sep క్వార్టర్లీ రిజల్ట్స్ ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో డీమార్ట్ షేరు ధర 8% పతనమై రూ.4186 వద్ద కదులుతోంది. గత ఫలితాల కంటే 5% అధిక లాభంతో ₹659 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినా మెప్పించలేకపోయింది. కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.27 వేల కోట్ల మేర ఆవిరైంది. బడా ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు. క్విక్ కామర్స్ పోటీ కూడా డీమార్ట్ షేర్లు పడిపోవడానికి ఓ కారణమని చెబుతున్నారు.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్, స్పెషల్ సీఎస్ సిసోడియా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోలీసు, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, R&B శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్ట్ చేసి విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాతే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెప్పాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై వెలుపల ఉన్న 5 టోల్‌ప్లాజాల వద్ద లైట్ మోటార్ వెహికల్స్‌కు టోల్ మినహాయించింది. వీటి మీదుగా రోజూ 2.8 లక్షల LMVలు ముంబైలోకి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఎన్నికల కోసం కాదని, ఎంట్రీ పాయింట్ల వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించి సమయం& ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం షిండే తెలిపారు.
TG: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు నలుగురు సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్‌మెంట్లను కోర్టు రికార్డు చేయనుంది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది.
AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, MLC లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. YCP విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చైతన్య ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే కేసులో అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ ఇవాళ మంగళగిరి PSలో విచారణకు హాజరయ్యారు.
స్టేజ్-3 బ్రెస్ట్ క్యాన్స్‌ర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి హీనా ఖాన్‌కు కీమో థెరపీ కొనసాగుతోంది. అత్యంత కఠినమైన ఈ చికిత్స సందర్భంగా ఆమె ఇప్పటికే తన జుట్టును కోల్పోయారు. తాజాగా ట్రీట్‌మెంట్ ఫైనల్ స్టేజ్‌లో తన కనురెప్పలు కూడా పోయాయంటూ ఆమె అందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. దీంతో ‘మీరొక వారియర్. త్వరలోనే కోలుకుంటారు’ అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
TG: బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని హరీశ్ రావు మండిపడ్డారు. ‘సిద్దిపేట-జేబీఎస్ ఛార్జీ రూ.140 ఉంటే రూ.200 చేశారు. హన్మకొండ-హైదరాబాద్ సూపర్ లగ్జరీ టికెట్ రూ.300 ఉంటే రూ.420కు పెంచారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు..?’ అని ట్వీట్ చేశారు.
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి, లోన్ హిస్టరీ లేని వారికి బ్యాంకులు ఈ క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంటాయి. నగదు పూచీకత్తుగా చెల్లించి ఈ కార్డు తీసుకోవాలి. ఉదాహరణకు కార్డు లిమిట్ రూ.50 వేలు కావాలి అనుకుంటే అంతే మొత్తం పూచీకత్తుగా చెల్లించాలి. రుణ చరిత్ర లేని వారికి దీంతో క్రెడిట్ స్కోర్ వస్తుంది. టైంకి బిల్లులు చెల్లిస్తే స్కోర్ పెరుగుతుంది. దీంతో రెగ్యులర్ అన్‌సెక్యూర్డ్ కార్డులను పొందొచ్చు.
Sorry, no posts matched your criteria.