India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆసియా కప్: భారత్-పాక్ మ్యాచ్‌లో దుర్భాషలాడాడని హారిస్ రవూఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30% ఫైన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ICC విధించిన ఈ జరిమానాని రవూఫ్‌కి బదులు PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చెల్లిస్తానని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘సమా టీవీ’ కథనాల్లో వెల్లడించింది. BCCI పాక్ ప్లేయర్లు <<17821768>>హారిస్ రవూఫ్<<>>, ఫర్హాన్‌లపై ICC, మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ BRS వినూత్న ప్రచారానికి తెరతీసింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పేరిట పోస్టర్లు రిలీజ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

సరైన కారణం లేకుండా PF విత్‌డ్రా చేసే ఖాతాదారులను EPFO సంస్థ హెచ్చరించింది. తప్పుడు కారణాలతో సొమ్ము విత్‌డ్రా చేస్తే జరిమానా, వడ్డీతో కలిపి రికవరీ చేసే అధికారం తమకుందని ప్రకటించింది. రిటైర్మెంట్ తర్వాత/రిటైర్మెంట్ వయసుకు చేరుకున్నాకే PF విత్‌డ్రా చేసుకోవాలి. హెల్త్ ఎమర్జెన్సీ, వివాహం, పిల్లల చదువు, ఇంటి నిర్మాణం కోసం పార్షియల్‌గా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. దానికి తగిన పేపర్స్ సమర్పించాలి.

AP: తూ.గో జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవంలో కొన్ని రోజులుగా సంభవిస్తున్న గేదెల మరణాలకు పరాన్నజీవి, వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాధులే కారణమని వెటర్నరీ అధికారులు నిర్ధారించారు. గేదెల్లో మరణానికి ముందు మెడ వద్ద వాపు, చర్మం ఊడిపోవడం, మేత తీసుకోకపోవడం, చొంగ ఎక్కువ కారడం, శ్వాస సమస్యలు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని, వీటి వల్లే గేదెలు చనిపోయినట్లు VJAకు చెందిన VBR, KKDకు చెందిన RADDL నిపుణులు నిర్ధారించారు.

కొన్నిరకాల హెయిర్‌స్టైల్స్‌తో కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గి హెయిర్‌ఫాల్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోనీటెయిల్స్, కార్న్‌రోస్, బన్స్, హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అలోపేషియాకు కారణమవుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ పేర్కొంది. గట్టిగా బిగిస్తే కుదుళ్లు బలహీనమై జుట్టు ఊడిపోతుందని చెబుతున్నారు. కాబట్టి జుట్టుకు హాని కలిగించని హెయిర్‌స్టైల్స్ ప్రయత్నించాలని సూచించారు.

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. సినిమా ఎండ్ కార్డ్స్‌లో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. కానీ తర్వాత ఎప్పుడూ ఆ ప్రస్తావన రాలేదు. తాజాగా దేవర చిత్రం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా NTR ఆర్ట్స్ సీక్వెల్‌పై స్పందించింది. ‘దేవర తాండవానికి ఏడాది పూర్తైంది. దేవర 2 కోసం సిద్ధంకండి’ అని ట్వీట్ చేసింది.

ప్రధాని మోదీ ఏపీ టూర్ షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 16న ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో కర్నూలులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకూ ప్రధాని శంకుస్థాపనలు చేసే అవకాశం ఉంది.

AP: ఆత్మనిర్భరతతో దేశం స్వయం సమృద్ధి సాధిస్తోందని, ముందుకు వెళ్లకుండా ఇక మనల్ని ఎవరూ ఆపలేరని CM CBN స్వదేశీ 4G ప్రారంభంలో పేర్కొన్నారు. ‘ప్రధాని మోదీ విజన్‌తో ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌తో మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా 100 దేశాలకు అందించి రక్షించగలిగాం’ అని చెప్పారు. మనం అభివృద్ధి చేసిన UPI టెక్నాలజీని సింగపూర్, ఫ్రాన్స్ వంటి దేశాలూ అడాప్ట్ చేసుకుంటున్నాయని వివరించారు.

నేటి నుంచి ఢిల్లీ వేదికగా జరగనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ నుంచి పాక్ తప్పుకుంది. అందుకు భారత్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని సాకులు చెప్పడం గమనార్హం. ఇక వచ్చేనెల 5వరకు జరిగే ఈ పోటీల్లో 100 దేశాల నుంచి 1500 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. IND నుంచి 76 మంది పోటీలో ఉన్నారు. 400M రేసులో TG నుంచి దీప్తి జీవాంజి, బానోతు అకీరానందన్, షాట్‌పుట్‌లో AP నుంచి రొంగలి రవి బరిలో ఉన్నారు.

AP: తన సూచనలతో వచ్చిన సంస్కరణల కారణంగానే నేడు BSNL శక్తిమంతమైన వ్యవస్థగా మారిందని CM చంద్రబాబు అన్నారు. ‘ఒకప్పుడు ఫోన్ కాల్ చేయాలంటే ఎన్నో వ్యయప్రయాసలు. నేను సీఎం అయ్యాక టెలికాం రంగంలో సంస్కరణల గురించి అప్పటి PMలు దేవెగౌడ, గుజ్రాల్‌తో చెప్పాను. వారు అర్థం చేసుకోలేదు. తరువాత వాజ్‌పేయికి వివరిస్తే ఓకే చేశారు. ఐటీలో ఇండియన్స్ అగ్రగామిగా ఉన్నారంటే నాటి సంస్కరణలే పునాది’ అని CM పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.