News April 6, 2024

విప్రో కొత్త సీఈవోగా శ్రీనివాస్ పల్లియా

image

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థెర్రీ డెలాపోర్టే తన పదవులకు రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శ్రీనివాస్ పల్లియాను సీఈవోగా సంస్థ నియమించింది. కాగా విప్రోలో డెలాపోర్టే 2020 జులై నుంచి పనిచేస్తున్నారు. సంస్థ ఎదుగుదలలో భాగస్వామిగా అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

News April 6, 2024

RCBvsRR: రాజస్థాన్‌ టార్గెట్ 184 రన్స్

image

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 రన్స్ చేసింది. కోహ్లీ సెంచరీ(113*)తో చెలరేగగా, డుప్లెసిస్ 44, మ్యాక్స్‌వెల్ 1, సౌరవ్ చౌహాన్ 9, కామెరూన్ గ్రీన్ 5* రన్స్ చేశారు. చాహల్ 2, బర్గర్ 1 వికెట్ తీశారు. విజయం కోసం రాజస్థాన్ 184 రన్స్ చేయాలి.

News April 6, 2024

BREAKING: విధ్వంసం.. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో తొలి సెంచరీ నమోదైంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో RCB ప్లేయర్ విరాట్ కోహ్లీ 67 బంతుల్లో శతకం బాదారు. ఇందులో 4 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.

News April 6, 2024

తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం: CBN

image

AP: తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. ‘కుమారుడికి ఏపీ, కూతురుకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పింది. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకే న్యాయం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేస్తారు? పిల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి కాంగ్రెస్ నాటకం ఆడుతోంది. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

News April 6, 2024

‘ఫ్యామిలీ స్టార్’ అలా కాక ఇంకేం అవుతుంది: నటి ఆశా

image

‘ఫ్యామిలీ స్టార్’ మూవీపై నటి ఆశా బొర్రా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మూవీలో తనను వాడుకుని వదిలేశారని.. ఒక్క సీన్‌లో కూడా తాను కనిపించలేదని.. ఇక ఆ సినిమా UTTER FLO.. కాకపోతే ఇంకేం అవుతుందని ఆమె రాసుకొచ్చారు. ‘ఆ పాత్ర నేనే చేయాలంటూ అందరూ ఫోన్లు చేసి హంగామా చేశారు. నా టైమ్ వేస్ట్ చేశారు. నా పనులన్నీ మానుకుని షూటింగ్‌లో పాల్గొన్నా. రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. నా కళ్లు తెరిపించారు’ అని ఆమె మండిపడ్డారు.

News April 6, 2024

కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య పాకిస్థానీ.. BJP MLA వివాదాస్పద వ్యాఖ్యలు

image

కర్ణాటక BJP MLA బసనగౌడ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్‌ కేసులో BJP కార్యకర్త <<12995195>>అరెస్టవడంపై<<>> ప్రశ్నించిన INC MLA దినేశ్ గుండురావ్‌పై మండిపడ్డారు. ‘దినేశ్ ముస్లిం మహిళ తబస్సుమ్‌ను పెళ్లాడారు. అతని ఇంట్లో సగం పాకిస్థాన్ ఉంది’ అని హేయంగా మాట్లాడారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘నేను ముస్లింనే. కానీ నా భారతీయతను ఎవరూ ప్రశ్నించలేరు. ఆయన వ్యాఖ్యలు అవమానకరం’ అని ఫైరయ్యారు.

News April 6, 2024

BREAKING: చరిత్ర సృష్టించిన కోహ్లీ

image

కింగ్ కోహ్లీ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. టోర్నీలో 7,500 రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో శిఖర్ ధవన్(6,755), డేవిడ్ వార్నర్(6,545), రోహిత్ శర్మ(6,280), సురేశ్ రైనా(5,528) ఉన్నారు. కాగా ఇవాళ రాజస్థాన్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లీ అర్ధసెంచరీ చేసి, సెంచరీ దిశగా సాగుతున్నారు.

News April 6, 2024

మతాల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారు: రేవంత్

image

TG: జూన్ 9న ఢిల్లీలో మువ్వన్నెల జెండా ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘BRSను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో.. బీజేపీని అలాగే ఓడించాలి. ఇదే పట్టుదలతో పని చేయాలి. గుజరాత్ మోడల్ మీద వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తుంది. మతాల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ మునిగినప్పుడు సిగ్గులేని కిషన్ రెడ్డి కేంద్రం నుంచి రూపాయి కూడా తేలేదు. అందుకే బీజేపీకి ఓటేయాలా?’ అని మండిపడ్డారు.

News April 6, 2024

చోడ‘వరం’ దక్కేదెవరికి?

image

AP: అనకాపల్లి జిల్లాలోని చోడవరం ప్రజలు ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు. ఇప్పటికి 6 పార్టీలను ఆదరించారు. 6సార్లు TDP, కాంగ్రెస్ 4సార్లు, కృషికార్, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, YCP ఒక్కోసారి గెలిచాయి. వైసీపీ నుంచి సిట్టింగ్ MLA కరణం ధర్మశ్రీ మరోసారి బరిలో దిగగా, టీడీపీ నుంచి కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు పోటీ చేస్తున్నారు. ఇరువురూ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 6, 2024

సహజీవనం చేసి విడిపోయినా మహిళకు భరణం ఇవ్వాల్సిందే: హైకోర్టు

image

సహజీవనంలో ఉండే మహిళకు హక్కులను కల్పించే దిశగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకోకుండా పురుషుడితో సహజీవనం చేసి, విడిపోయిన తర్వాత మహిళ భరణం పొందేందుకు అర్హురాలే అని తెలిపింది. వారి మధ్య బంధం రుజువైతే భరణాన్ని తిరస్కరించలేమని స్పష్టం చేసింది. ఓ మహిళకు నెలకు రూ.1,500 భరణం చెల్లించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.