News April 6, 2024

మహిళలకు ఏటా రూ.1,00,000: రాహుల్

image

TG: పేద మహిళలకు ఏటా రూ.లక్ష నేరుగా బ్యాంకులో వేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ హామీ ఇచ్చారు. ‘యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం. విద్యావంతులైన యువకులకు సంవత్సరం పాటు నెలకు రూ.8,500 ఇస్తూ, శిక్షణ ఇప్పిస్తాం. ఇకపై దేశంలో ఏ కుటుంబానికీ ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదు. మోదీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది. రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు’ అని అన్నారు.

News April 6, 2024

తెలంగాణలో మాట నిలబెట్టుకున్నాం: రాహుల్

image

తాము అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. ‘దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న తరుణంలో తెలంగాణలో ఇప్పటికే 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 50వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నట్లే జాతీయ స్థాయిలో మాట నిలబెట్టుకుంటాం’ అని తుక్కుగూడ సభలో హామీ ఇచ్చారు.

News April 6, 2024

కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రాహుల్

image

TG: కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేశారు. తుక్కుగూడలో జరుగుతున్న జనజాతర సభలో మేనిఫెస్టో తెలుగు ప్రతిని రిలీజ్ చేశారు. తెలంగాణకు ప్రత్యేకంగా 23 హామీలను కాంగ్రెస్ ప్రకటించనుంది.

News April 6, 2024

RCB బ్యాటింగ్.. కొత్త ప్లేయర్ వచ్చాడు

image

RCBతో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ తరఫున బ్యాటింగ్ ఆల్‌రౌండర్ సౌరవ్ చౌహాన్ అరంగేట్రం చేస్తున్నారు. జట్లు. RR: బట్లర్, జైస్వాల్, శాంసన్ (C), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మెయర్, అశ్విన్, చాహల్, బర్గర్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.
RCB: విరాట్, డుప్లెసిస్ (C), పాటీదార్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, సౌరవ్ చౌహాన్, దినేశ్ కార్తీక్(WK), దాగర్, టోప్లీ, సిరాజ్, యశ్ దయాల్.

News April 6, 2024

జగన్ పాలన ఓ పీడ కల: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ ఐదేళ్ల పాలన ఓ పీడ కల అని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అన్యాయం జరిగింది. ముస్లింలపై అనేక అరాచకాలు జరిగాయి. అధికారంలోకి రాగానే నదుల అనుసంధానం చేసి ప్రతీ ఎకరాకు నీళ్లందిస్తా. పేదలకు ఉచిత ఇసుక అందిస్తా. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. జనం భవిష్యత్ కోసమే మూడు పార్టీలు కలిశాయి. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే’ అని ఆయన పేర్కొన్నారు.

News April 6, 2024

జూన్‌లో ‘ఇండియన్-2’ రిలీజ్

image

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఇండియన్-2’ అప్‌డేట్ వచ్చింది. ఈ జూన్‌లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. 1996లో విడుదలై సంచలనం సృష్టించిన ‘భారతీయుడు’కు ఈ మూవీ సీక్వెల్‌గా వస్తోంది.

News April 6, 2024

హైదరాబాద్ చేరుకున్న రాహుల్

image

TG: తుక్కుగూడ జనజాతర సభ కోసం రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. మరోవైపు భారీగా కాంగ్రెస్ శ్రేణులు తుక్కుగూడకు చేరుకుంటున్నారు.

News April 6, 2024

BREAKING: కాంగ్రెస్ సభలో BRS MLA

image

TG: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ తుక్కుగూడలో నిర్వహిస్తోన్న జన జాతర సభకు భద్రాచలం BRS ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా పలువురు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

News April 6, 2024

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు

image

TG: కాంగ్రెస్ తుక్కుగూడ జనజాతర సభ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. రైతుభరోసా రూ.15వేలు, చేయూత రూ.4వేలు, మహాలక్ష్మి రూ.2,500 రూ.2,500 సహా ఆరు గ్యారంటీలు అమలు చేయట్లేదని, ‘కాంగ్రెస్ వచ్చింది, మోసం చేసింది’ అంటూ ముద్రించారు.

News April 6, 2024

ఏటా కనీసం $100 బిలియన్లు రాబట్టడమే టార్గెట్!

image

FDI కింద ఏటా $100 బిలియన్లకుపైగా పెట్టుబడులను రాబట్టాలని భారత్ ఆశిస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. మరో ఐదేళ్లలో ఈ టార్గెట్ చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశాయి. కాగా FY22లో గరిష్ఠంగా $80 బిలియన్లకుపైగా చేరిన FDI సగటు ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయింది. చైనాకు దీటుగా ప్రత్యామ్నాయంగా మార్చుకుని, ఆ దేశానికి తరలివెళ్లే పెట్టుబడులను ఇటువైపుకు తిప్పుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.