India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడటంతో నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్’ రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి లేఖ అందించారు. షోకాజు నోటీసు ఇవ్వకుండా తనని మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం అని వాపోయారు. డ్రగ్స్ టెస్ట్ రిపోర్టులో తనకు నెగటివ్ వచ్చిందని, మళ్లీ ‘మా’లో తన సభ్యత్వాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు. తనకి సపోర్ట్ చేయాలని కోరారు.
ఎనర్జిటిక్ హీరో మంచు మనోజ్ భార్య మౌనిక రెండు నెలల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ గారాలపట్టికి దేవసేన శోభాగా నామకరణం చేసినట్లు మనోజ్ ట్వీట్ చేశారు. పరమశివుడి ఆశీస్సులతో పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కుటుంబంతో దిగిన ఫొటోను ఆయన పంచుకున్నారు.
AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు సెంట్రల్ జైలులో విచారిస్తున్నారు. సీఐపై దాడి, ఈవీఎం ధ్వంసంతో పాటు దాడుల్లో ఎవరెవరు పాల్గొన్నారనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
AP: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. కొన్ని జిల్లాల్లో స్టాక్ పాయింట్ల వద్ద మంత్రులు ఇసుక సరఫరాను ప్రారంభించారు. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. దీనిపై మార్గదర్శకాలను పేర్కొంటూ ఈరోజు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
హిట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌పై నిర్మాత కరణ్ జోహర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘రూ.35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే నటులు రూ.3.5 కోట్ల ఓపెనింగ్ కూడా తీసుకురావట్లేదు. ఇండస్ట్రీలోని 10 మంది స్టార్స్ భారీగా రుసుం తీసుకొని నిర్మాతలకు భారమవుతున్నారు. నటులకు, మేకింగ్, మార్కెటింగ్‌కోసం మీరే డబ్బు చెల్లించాలి. సినిమా నడవకపోతే నష్టపోయేది కూడా మీరే’ అని నిర్మాతలకు సపోర్ట్‌గా నిలిచారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ MP రాహుల్ గాంధీని విమర్శించడంలో BJP కొత్త పంథాను ఎంచుకుంది. గతంలో పప్పు అని విమర్శిస్తూ వచ్చిన BJP ఇప్పుడు కొత్తగా బాలక్ బుద్ధి అనే ట్యాగ్ ఇచ్చింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని మోదీ ‘రాహుల్ పిల్ల చేష్టలు చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా రాహుల్‌పై ఆ ట్యాగ్‌లైన్‌తో BJPతో పాటు NDA కూటమి నేతలు సెటైర్లు వేస్తున్నారు.
TG: రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని దివంగత సీఎం YSR అనేవారని సీఎం రేవంత్ అన్నారు. ఈరోజు ప్రధాని పదవికి రాహుల్ అడుగుదూరంలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. YSR జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఆయనకు నివాళులర్పించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు ప్రయత్నించేవారే అసలైన YSR వారసులని సీఎం చెప్పుకొచ్చారు.
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’ ఈ నెల 12న ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ తెలిపింది. కాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 16 టీమ్స్ పాల్గొనగా నాలుగు జట్లు సెమీస్ చేరాయి. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో బ్రెజిల్‌పై పెనాల్టీ షూటౌట్లో 4-2 గోల్స్ తేడాతో ఉరుగ్వే నెగ్గింది. అర్జెంటీనా, కెనడా, ఉరుగ్వే, కొలంబియా సెమీస్ చేరాయి. విజేతగా నిలిచిన జట్లు ఈ నెల 15న ఫైనల్ ఆడనున్నాయి. ఓడిన జట్లు ఈ నెల 14న మూడో స్థానం కోసం పోటీ పడతాయి.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అసంతృప్తితో చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రతి తిరస్కరణ ఓ ఆశీర్వాదం అని మీరు ఒక రోజు తెలుసుకుంటారు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది కచ్చితంగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌ను ఉద్దేశించే చేశారంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ తన తదుపరి చిత్రం ‘రాక్షసుడు’ను రణ్వీర్తో తీయాలనుకోగా.. విభేదాలు రావడంతో తాజాగా క్యాన్సల్ అయిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.