India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. US ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా ప్రొడక్ట్స్‌పై 100% టారిఫ్స్ విధించనున్నట్లు ప్రకటించడంతో ఫార్మా కంపెనీల షేర్లు దాదాపు 4% మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 381 పాయింట్ల నష్టంతో 80,778, నిఫ్టీ 111 పాయింట్లు కోల్పోయి 24,779 వద్ద ట్రేడవుతున్నాయి. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, HCL టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

శిలీంధ్రం ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పొలం నుంచి పీకి దూరంగా కాల్చేయాలి. పంటకు సరిపడినంత నీటి తడులు అందించాలి. ఎక్కువగా నీరు పెట్టకూడదు. తెగులు సోకిన మొక్కలను తొలగించిన నేలను.. లీటరు నీటికి మాంకోజెబ్ 3గ్రాములు కలిపి బాగా తడపాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ ఉన్న మొక్కల వద్ద కూడా ఈ ద్రావణంతో నేలను బాగా తడపాలి. ట్రైకోడెర్మావిరిడేని వేపపిండి, పశువుల ఎరువుతో కలిపి నాటేముందు పొలంలో చల్లుకోవాలి.

ప్రస్తుతకాలంలో ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య పెరిగింది. అయితే వృత్తి ఉద్యోగాల్లో రాణించాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. మీ రంగంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. అలాగే ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయడం నేర్చుకోవాలి. టార్గెట్లు పెట్టుకోండి. వాటిని చేరే విధంగా ఆలోచనలు, పనులు ఉండాలి. సహోద్యోగులతో ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా చూసుకోవాలి.

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి రత్నకుమారి (88) నిన్న రాత్రి 8.31గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా తల్లితో తనకు ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ YVS సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, అన్నగారిని కలవడానికి అమ్మ వెళ్లిపోయారు’ అంటూ రాసుకొచ్చారు.

IPL: రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్‌గా మరోసారి శ్రీలంక క్రికెట్ దిగ్గజం సంగక్కర బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో జట్టు యాజమాన్యం సంగక్కర వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ఆయన 2021 నుంచి 2024 వరకు కోచ్‌గా, గతేడాది నుంచి టీమ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్(కాంట్రాక్ట్) పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. 60% మార్కులతో B.Tech/B.E, M.A, CA, MBA పూర్తిచేసిన వారు అర్హులు. వయసు 29 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cbtexam.bemlindia.in/

ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు నేడు ‘శ్రీ రాజరాజేశ్వరీ లలితా మహా త్రిపుర సుందరీ దేవి’ అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. వేడుకల్లో భాగంగా చతు:స్థానార్చన, స్కందమాతా దుర్గార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు పల్లకి సేవ జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు ధూమ్రహాదుర్గార్చనతో పాటు శేషవాహన సేవ నిర్వహించనున్నారు.

వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ KG వెండిపై రూ.3000 పెరిగి రూ.1,53,000తో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరిగి రూ.1,14,880కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.400 ఎగబాకి రూ.1,05,300 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు 7 గేట్ల నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం 6 గంటల వరకు వివరాలు..
* ఇన్ ఫ్లో: 2,41,873 క్యూసెక్కులు
* అవుట్ ఫ్లో: 1,94,044 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
* ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 882.20 అడుగులు
* నీటి నిల్వ: 200.1971 టీఎంసీలు

ట్రంప్ పలు దిగుమతులపై భారీగా టారిఫ్స్ విధించారు. ఫార్మా ప్రొడక్ట్స్‌పై 100%, కిచెన్ క్యాబినెట్స్, బాత్రూమ్ వస్తువులపై 50%, హోమ్ ఫర్నీచర్‌పై 30%, భారీ ట్రక్స్‌పై 25% టారిఫ్స్ OCT 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ‘బయటి దేశాల నుంచి ఈ ఉత్పత్తులు ప్రవాహంలా వస్తున్నాయి. దేశ భద్రత కోసం వీటిని అరికట్టాలి. US జాబ్స్, ఫ్యాక్టరీలను కాపాడుతున్నాం. మీరు ఇక్కడ అమ్మాలంటే ఇక్కడే తయారు చేయండి’ అని అన్నారు.
Sorry, no posts matched your criteria.