News April 5, 2024

‘పుష్ప2’ పోస్టర్ షేర్ చేసిన వార్నర్

image

ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ‘పుష్ప2’ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా వార్నర్‌ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఆయన పుష్ప పోస్టర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే అల్లు అర్జున్ నటించిన సినిమాల్లోని పాటలకు డాన్స్ చేసిన వీడియోలనూ షేర్ చేశారు.

News April 5, 2024

కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

image

ఎండల తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ తాగొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి శరీరంలో ద్రవాలను కోల్పోయేలా చేస్తాయని, అందుకే ఎండపూట తాగవద్దని చెబుతున్నారు. అలాగే మద్యం, టీ, కాఫీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News April 5, 2024

ఇక ఓట్ల రాజకీయాలు చేయను: జగ్గారెడ్డి

image

TG: ఇక నుంచి తాను ఓట్ల కోసం రాజకీయాలు చేయనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ‘MLAగా గెలిచిన వారికి గౌరవం ఇవ్వాలి. నిధులు తెచ్చేది నేనే అయినప్పటికీ ప్రొటోకాల్ గెలిచిన ఎమ్మెల్యేకే ఉంటుంది. సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ గొడవలు ఉండొద్దు. రాష్ట్రంలో పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో నీలం మధును గెలిపించాలి’ అని కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

News April 5, 2024

IPL SCAM: ఫేక్ ఐడీలతో జాగ్రత్త

image

ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా వేదికల్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల RCB, RR మ్యాచ్ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఓ మహిళ FBలో ఐపీఎల్ టికెట్స్ అనే పేజ్ చూసి అందులో ఓ వ్యక్తిని కాంటాక్ట్ అయ్యారు. అడ్వాన్స్ పంపితే టికెట్లు ఇస్తానని చెప్పడంతో ఆమె ఏకంగా రూ.86 వేలు పంపారు. చివరికి మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించారు.

News April 5, 2024

భార్య నిత్యం అత్తారింటిని వదలడం క్రూరత్వమే: హైకోర్టు

image

భర్త తప్పు లేకున్నా భార్య చీటికిమాటికీ అత్తారింటిని వదిలి వెళ్లడం మానసిక క్రూరత్వమేనని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. పరస్పర సహకారం, విధేయత ఉన్నప్పుడే వివాహ బంధం కలకాలం నిలబడుతుందని పేర్కొంది. 19 ఏళ్ల కాలంలో 7 సార్లు భార్య తనను విడిచిపెట్టిందని, వెళ్లిన ప్రతిసారీ 3 నుంచి 10 నెలలు వచ్చేది కాదని భర్త తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. భర్త విడాకులు తీసుకోవడం సబబేనని స్పష్టం చేసింది.

News April 5, 2024

AI వీడియోలపై మెటా కీలక నిర్ణయం

image

డీప్‌ఫేక్ వీడియోలు పెరిగిన నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా మాతృసంస్థ మెటా తన పాలసీలలో కీలక మార్పులను ప్రకటించింది. త్వరలో US ఎన్నికలు జరగనుండటంతో AI జెనరేటెడ్ కంటెంట్‌పై నియంత్రణకు సిద్ధమైంది. ఇలాంటి వీడియోలను FB, ఇన్‌స్టాలో పోస్టు చేస్తే ‘Made with AI’ అనే లేబుల్ వచ్చేలా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. మే నుంచి ఇది అమల్లోకి రానుంది. మోసపూరిత కంటెంట్‌ నుంచి యూజర్లను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

News April 5, 2024

ఇన్‌స్టా కలిపింది ఇద్దరినీ.. 80 వెడ్స్ 34!

image

మధ్యప్రదేశ్‌లోని సుస్నేర్‌లో బాలూరామ్ (80) అనే వృద్ధుడు మహారాష్ట్రకు చెందిన షీలా (34)ను వివాహమాడారు. బాలూరామ్‌తో ఫన్నీ రీల్స్‌ చేసి స్నేహితుడు విష్ణుగుజ్జార్‌ ఇన్‌స్టాలో షేర్ చేసేవారు. ఇవి చూసి షీలా బాలూరామ్‌తో పరిచయం పెంచుకున్నారు. ప్రేమ చిగురించడంతో ఈనెల 1న పెళ్లి చేసుకున్నారు. భార్యను కోల్పోవడం, ఆర్థిక సమస్యలతో డిప్రెషన్‌కు గురైన బాలూరామ్‌ కోలుకునేందుకు విష్ణు ఈ రీల్స్ చేయడం స్టార్ట్ చేశారట.

News April 5, 2024

జగన్‌పై వైఎస్ వివేకా భార్య పోటీ?

image

AP: పులివెందులలో సీఎం వైఎస్ జగన్‌పై దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా వైఎస్ వివేకా హత్యలో జగన్ హస్తం ఉందని వివేకా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయనను గద్దె దించేందుకు పోటీకి సిద్ధమైనట్లు సమాచారం.

News April 5, 2024

ఫ్యాన్స్ మధ్య బ్రహ్మి సందడి

image

హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సందడి చేశారు. హైదరాబాద్ – చెన్నై మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బ్రహ్మానందంను చూసిన క్రికెట్ అభిమానులు బ్రహ్మి.. బ్రహ్మి అంటూ కేరింతలు కొడుతున్నారు. అలాగే, సీఎం రేవంత్, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మ్యాచ్‌ను తిలకిస్తున్నారు.

News April 5, 2024

YCPని తుంగలో తొక్కుతాం: నాగబాబు

image

AP: వైసీపీ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలను నిర్లక్ష్యం చేసిందని జనసేన నేత నాగబాబు విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి లేదని CM జగన్ చెప్పడం అతి పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. సానుభూతితో ప్రజలు ఒక్కసారి ఓటు వేసినందుకు సుసంపన్నమైన ఏపీని నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజలను పీడిస్తోన్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో తుంగలో తొక్కుతామని, కూటమి గెలవబోతోందని జోస్యం చెప్పారు.