News October 11, 2024

Hello నిద్రరావడం లేదు.. ఏం చేయమంటారు!

image

మెంటల్ హెల్త్ హెల్ప్‌లైన్ టెలీ మానస్‌కు స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ గురించే ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి. 2022 అక్టోబర్ నుంచి ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు 3.5 లక్షల కాల్స్ వచ్చాయి. వీటిని విశ్లేషిస్తే నిద్రా భంగం 14%, మూడ్ బాగాలేకపోవడం 14%, స్ట్రెస్ 11%, యాంగ్జైటీ 9% టాప్4లో ఉన్నాయి. సూసైడ్ కాల్స్ 3% కన్నా తక్కువే రావడం గమనార్హం. హెల్ప్‌లైన్‌కు పురుషులు 56%, 18-45 వయస్కులు 72% కాల్ చేశారు.

News October 11, 2024

భార్య సూచన.. రూ.25 కోట్లు తెచ్చిపెట్టింది

image

మైసూరుకు చెందిన మెకానిక్ అల్తాఫ్‌కు ₹25 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని కుటుంబం సంతోషంలో తేలిపోతోంది. అతను 15 ఏళ్లుగా కేరళ తిరుఓనమ్ బంపర్ లాటరీ కొంటున్నారు. ఈ ఏడాదీ ఫ్రెండ్ ద్వారా రెండు టికెట్లు(ఒక్కోటి ₹500) కొనుగోలు చేశారు. తర్వాత ఓ టికెట్‌ను స్నేహితునికి ఇవ్వాలనుకోగా భార్య అతడిని ఆపింది. అదే టికెట్‌కు అదృష్టం వరిస్తుందేమో అని చెప్పడంతో ఆగిపోయాడు. ఆ టికెట్‌కే ₹25 కోట్ల బహుమతి దక్కింది.

News October 11, 2024

రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది: నారా లోకేశ్

image

AP: రాష్ట్రంలో ఇప్పటికే రెడ్ బుక్ యాక్షన్ స్టార్ట్ చేశామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ బుక్‌లో పేర్లు ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ‘విజయవాడ వరదలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోకి ఇండస్ట్రీలు రాకుండా అడ్డుకునే వారిని వదలం. వైసీపీ తరిమేసిన పరిశ్రమలను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

News October 11, 2024

కొన్నిసార్లు హార్దిక్ పాండ్య… : SKY

image

బంగ్లా‌తో రెండో టీ20లో కుర్రాళ్ల ఆటతీరుతో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. ‘మా మిడిలార్డర్ బ్యాటర్లు ప్రెజర్లో ఆడాలని, తమను తాము ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలని కోరుకుంటా. రింకూ, నితీశ్, పరాగ్ మేం ఆశించినట్టే ఆడారు. వేర్వేరు సందర్భాల్లో బౌలర్లు భిన్నంగా ఎలా బౌలింగ్ చేస్తారో పరీక్షిస్తుంటాం. అందుకే కొన్నిసార్లు పాండ్య, సుందర్ బౌలింగ్ చేయరు’ అని అన్నారు.

News October 11, 2024

నందిగం సురేశ్‌కు అస్వస్థత

image

AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురయ్యారు. లో బీపీ, భుజం, ఛాతీలో నొప్పి వస్తున్నట్లు ఆయన చెప్పడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్‌‌కు న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

News October 11, 2024

డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన కేజ్రీవాల్‌

image

అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీల‌ను స‌గానికి త‌గ్గిస్తాన‌న్న డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై EX CM కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వ‌ర‌కు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, NDA పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమ‌లు చేస్తే BJP తరఫున ప్ర‌చారం చేస్తాన‌ని కేజ్రీవాల్ ఇటీవల స‌వాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన BJPని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

News October 11, 2024

జపాన్‌ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం

image

2024 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బ‌హుమ‌తి జపనీస్ సంస్థ నిహాన్ హిడాంక్యోను వ‌రించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 111 మంది స‌భ్యులు, 31 సంస్థ‌ల‌ను నోబెల్ శాంతి బ‌హుమ‌తి వ‌రించింది. ఈ ఏడాది పుర‌స్కారానికి 286 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించిన క‌మిటీ నిహాన్ హిడాంక్యోను పుర‌స్కారానికి ఎంపిక చేసింది.

News October 11, 2024

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతి హాసన్ ఆగ్రహం

image

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ఆలస్యం కావడం పట్ల నటి శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ‘నేను సాధారణంగా ఫిర్యాదులు చేయను. ఇండిగో.. మీరు సేవల్లో ఎప్పటికప్పుడు దిగజారుతున్నారు. నాలుగు గంటలుగా ఎయిర్‌పోర్టులోనే మగ్గుతున్నాం. దీనిపై మీ నుంచి కనీస సమాచారం లేదు. మీ పాసింజర్ల కోసం మెరుగైన మార్గాల్ని అన్వేషించండి. ప్లీజ్’ అని కోరారు.

News October 11, 2024

గ్రూప్-3 ఉద్యోగాల భర్తీపై BIG UPDATE

image

తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల తేదీలను TGPSC ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో OMR విధానంలో పేపర్-1,2,3 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందవచ్చని వెల్లడించింది. ఇప్పటికే శాంపిల్ OMR ఆన్సర్ షీటును వెబ్‌సైటులో అందుబాటులో ఉంచామంది.

News October 11, 2024

ఆరోగ్యశ్రీలో చికిత్సలను తొలగించట్లేదు: ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్

image

AP: ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ)లో ప్రస్తుతం ఉన్న 3,257 చికిత్సలను 1,949కి తగ్గిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ‘ఆరోగ్యశ్రీపై విష ప్రచారం చేస్తున్నారు. ఈ పథకంలో ఎలాంటి మార్పులను ప్రభుత్వం చేయట్లేదు. చికిత్సలు తొలగించలేదు. మార్ఫింగ్ చేసిన ప్రకటనలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తప్పవు’ అని ట్వీట్ చేసింది.