India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే వారం ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో సెట్‌ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఇటీవల థాయ్‌లాండ్‌లో ఓ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
☞ కొండమోడు-పేరేచర్ల-రూ.1032 కోట్లు
☞ సంగమేశ్వరం-ఆత్మకూరు- రూ.776 కోట్లు
☞ గోరంట్ల-హిందూపురం- రూ.808 కోట్లు
☞ నంద్యాల-కర్నూలు, కడప బోర్డర్-రూ.691 కోట్లు
☞ వేంపల్లి-ప్రొద్దుటూరు-చాగలమర్రి- రూ.1321 కోట్లు
☞ విశాఖ-బౌధర- రూ.935 కోట్లు
☞ ముద్దనూరుపులివెందుల-బి.కొత్తపల్లి– రూ.108 కోట్లు
☞ పెడన-నూజివీడు-విస్సన్నపేట- రూ.1600 కోట్లు
ప్యాకేజ్డ్ ఫుడ్ వస్తువులపై పోషక సమాచారాన్ని పెద్ద అక్షరాలతో ముద్రించాలనే నిబంధనలను FSSAI తీసుకురానుంది. ఉప్పు, చక్కెర, కొవ్వు తదితర పదార్థాలు ఎంత మొత్తంలో ఉన్నాయనే వివరాలను పెద్దగా, బోల్డ్ ఫాంట్లో ఉంచాలని ప్రతిపాదించింది. దీనిపై ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసి వివిధ వర్గాల స్పందన కోరనుంది. ఇది అమల్లోకి వస్తే ఉత్పత్తుల్లోని పోషకాల గురించి యూజర్లు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల బాపట్ల, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, మన్యం, పార్వతీపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇక మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.
జింబాబ్వేతో తొలి T20లో ఓటమితో టీమ్ ఇండియా కుర్రాళ్లకు ఆదిలోనే భంగపాటు ఎదురైంది. స్వల్ప లక్ష్యమే అయినా అనుభవలేమితో వికెట్లు సమర్పించుకున్నారు. ఫలితంగా T20 WC-2024కు క్వాలిఫై కాని పసికూనపై పరాజయం పాలైంది. దీంతో మేనేజ్మెంట్ను నెటిజన్లు విమర్శిస్తున్నారు. జట్టులో సీనియర్ ఆటగాళ్లను ఉంచాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. సంజూ శాంసన్, అక్షర్ పటేల్ లాంటి సీనియర్ ఆటగాళ్లను ఆడించాల్సిందని వాపోతున్నారు.
AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పులు మొదలైనట్లు సమాచారం. పెనమలూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్‌ను సొంత సెగ్మెంట్ మైలవరానికి మార్చినట్లు తెలుస్తోంది. కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవభక్తుని చక్రవర్తిని పెనమలూరు ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ మార్పులపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నాయి.
‘అగ్నిపథ్’ వయోపరిమితి పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత కనీసం 50 శాతం మందిని సైన్యంలోనే కొనసాగించాలని కూడా కోరే అవకాశం ఉంది. 21 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని 23కు పెంచాలని ప్రతిపాదించనున్నారట. దీంతో సైన్యంలోని ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పొందే అవకాశం ఉంది. 50 శాతం మంది అగ్నివీరుల సర్వీస్ కొనసాగించడం వల్ల సిబ్బంది కొరతను అధిగమించవచ్చు.
అయోధ్య తరహాలోనే గుజరాత్‌లోనూ బీజేపీని ఓడించి తీరుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ‘గుజరాత్లో మోదీని, బీజేపీని కాంగ్రెస్ ఓడిస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి. ఇక్కడి నుంచే కాంగ్రెస్ కొత్త శకాన్ని మొదలుపెడుతుంది. గుజరాత్ వజ్రాల పరిశ్రమ కష్టాలే తెలుసుకోలేని మనిషి, రాష్ట్ర ప్రజలకు మాత్రం ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై CM రేవంత్‌తో భేటీలో చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, తలసరి ఆదాయం ఎలా పెరుగుతూ వచ్చింది? అనే అంశాలను తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 6 గ్యారంటీలపై ఎలా ముందుకెళ్తున్నారన్న విషయాలను బాబు ప్రస్తావించారు. APలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నందున తెలంగాణ అనుభవాలను CBN తెలుసుకున్నారు.
తానింకా దృఢంగానే ఉన్నానని, బోధనలు కొనసాగిస్తానని బౌద్ధగురువు దలైలామా అన్నారు. నిన్న ఆయన 89వ పుట్టినరోజు సందర్భంగా ఓ సందేశం విడుదల చేశారు. ‘90కి సమీపంలోకి వచ్చేశాను. కాళ్లలో చిన్న అసౌకర్యం తప్ప ఎలాంటి అనారోగ్యం లేదు. నా పుట్టినరోజున ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలు’ అని అందులో పేర్కొన్నారు. ఆయన మోకాలికి అమెరికాలో తాజాగా శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం అక్కడే ఉన్నారు.
Sorry, no posts matched your criteria.