News July 7, 2024

నార్త్ అమెరికాలో ప్రభాస్ ‘కల్కి’ ప్రభంజనం

image

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898ఏడీ’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. విడుదలైన 9రోజులకే 800కోట్ల గ్రాస్ దాటిన ఈ మూవీ నార్త్ అమెరికాలో మరింతగా దూసుకెళ్తోంది. అక్కడ 15మిలియన్ డాలర్ల మార్కును దాటేసి, ఇంత వేగంగా ఆ మార్కును అందుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచింది. అక్కడి మొత్తం వసూళ్లలో బాహుబలి2 అగ్రస్థానంలో ఉండగా.. లాంగ్‌రన్‌లో కల్కి దాటేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు.

News July 7, 2024

అందుకే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్

image

జింబాబ్వేపై ఘోర ఓటమి అనంతరం టీం ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందుకు గల కారణాలను వివరించారు. ‘బౌలింగ్ చాలా బాగా చేశాం. కానీ ఫీల్డింగ్, బ్యాటింగ్ పరంగా తేలిపోయాం. జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలామంది ఐపీఎల్ తర్వాత పెద్దగా ఆడింది లేదు. అది కూడా ఓ కారణం. ఓడిన విధానం నిరాశను కలిగించింది. చాలా మెరుగుపడాలి’ అని తెలిపారు. 5 మ్యాచుల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ నేడే జరగనుంది.

News July 7, 2024

ఉక్రెయిన్‌లో లక్షకు పైగా ఇళ్లు అంధకారంలోకి

image

విద్యుత్‌ సరఫరాను లక్ష్యంగా చేసుకుని రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా సరిహద్దులోని సుమీ ప్రాంతం తీవ్ర అంధకారంలో కూరుకుపోయింది. లక్షకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ శాఖ తెలిపింది. అటు డొనెట్స్క్‌ ప్రాంతంలో యుద్ధం భీకరంగా జరుగుతోంది. రష్యా దాడిలో 11మంది పౌరులు చనిపోగా 43మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

News July 7, 2024

5-10 ఏళ్లలో ₹2.5లక్షల కోట్లకు జెప్టో ఆదాయం: CEO

image

2023 FYలో ₹2,000కోట్లుగా ఉన్న జెప్టో ఆదాయం ఏడాదిలోనే 5 రెట్లు పెరిగిందని ఆ కంపెనీ CEO ఆదిత్ పలిచా తెలిపారు. సరిగా వ్యాపారం చేస్తే ఇప్పుడున్న ₹10వేల కోట్ల ఆదాయాన్ని రాబోయే 5-10 ఏళ్లలో ₹2.5లక్షల కోట్లకు చేర్చగలమని పేర్కొన్నారు. ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలో ప్రస్తుతం టాప్‌లో ఉన్న డీమార్ట్‌ను తాము 18-24 నెలల్లో అధిగమించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో JIIF ఫౌండేషన్ డే ప్రొగ్రామ్‌లో ఆయన మాట్లాడారు.

News July 7, 2024

కుటుంబ సభ్యులతో WC విజేతల సెలబ్రేషన్స్

image

టీ20 వరల్డ్ కప్ విజయాన్ని టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ ఇళ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీవర్మకు, జస్ప్రీత్ బుమ్రా తన తల్లి దల్జీత్ కౌర్‌కు, కుల్దీప్ యాదవ్ తన తల్లి ఉషా యాదవ్‌కు గోల్డ్ మెడల్స్ వేసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి.

News July 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 7, 2024

జులై 7: చరిత్రలో ఈరోజు

image

1896: భారత్‌లో తొలిసారిగా బొంబాయిలో చలనచిత్ర ప్రదర్శన
1900: స్వాతంత్ర్య సమరయోధుడు కళా వెంకటరావు జననం
1915: సినీ నటుడు మిక్కిలినేని జననం
1929: పోప్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు
1930: ‘Sherlock Holmes’ రచయిత ఆర్థర్ కోనన్ మరణం
1959: రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు జననం
1973: గాయకుడు కైలాశ్ ఖేర్ జననం
1981: భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జననం
* ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

News July 7, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 07, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:26 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:47 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 7, 2024

శుభ ముహూర్తం

image

తేది: జులై 07, ఆదివారం
విదియ: తెల్లవారుజామున 04:25 గంటలకు
పుష్యమి: పూర్తిగా
వర్జ్యం: మధ్యాహ్నం 1.29-3.09 గంటల వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4:50 -5:42 గంటల వరకు
రాహుకాలం: సాయంత్రం 4.30- 6.00 గంటల వరకు

News July 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.