India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సోషల్ మీడియాలో కొందరు తనను <<15073430>>వేధింపులకు గురిచేస్తున్నారని<<>> హీరోయిన్ హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 30 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు ఓ బిజినెస్‌మన్ తనను వేధిస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు అభ్యంతరకర కామెంట్లు చేయడంతో ఆమె ఎర్నాకులం పోలీసులను ఆశ్రయించారు. వారి కామెంట్లు మానసిక వేధింపులకు కారణమయ్యాయని ఆమె పేర్కొన్నారు.

HMPV వైరస్ కొత్తదేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో ఉందని HYD అపోలో ఆస్పత్రి వైద్యుడు సుధీర్ కుమార్ తెలిపారు. ఇది కరోనా లాంటిది కాదని, మహమ్మారి అయ్యే అవకాశాలు లేవంటున్నారు. సాధారణంగా 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో, వృద్ధుల్లో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో HMPV సంక్రమిస్తుందని పేర్కొన్నారు. ఈ వైరస్ సోకిన 4-7 రోజుల్లో కోలుకుంటారని వివరించారు.

AP: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ మరణించిన అభిమానులకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పరిహారం ప్రకటించడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘పుష్పకేమో నీతులు చెప్తారా.. ‘గేమ్ ఛేంజర్’కి పాటించరా!’ అని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

దేశంలో <<15078134>>కొత్త వైరస్<<>> కేసులతో మదుపర్లు భయాందోళనలకు గురవడంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఆస్పత్రుల షేర్లు మాత్రం లాభాల్లో పరిగెడుతున్నాయి. అపోలో, రెయిన్‌బో, KIMS, ఆస్టర్, నారాయణ హృదయాలయ తదితర హాస్పిటళ్ల షేర్లు 2-4% లాభాలు ఆర్జిస్తున్నాయి. మరోసారి వైరస్ వ్యాప్తి చెంది ఆస్పత్రులకు తాకిడి పెరుగుతుందనే ఊహాగానాలే దీనికి కారణాలుగా మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇవాళ వాదనలు కొనసాగాల్సి ఉండగా ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులోకి రాలేదు. దీంతో మరో న్యాయవాది పాస్ ఓవర్ కోరగా ధర్మాసనం అంగీకరించలేదు. గురువారానికి వాయిదా వేసింది. కాసేపటికి ముకుల్ రోహత్గీ వచ్చి విజ్ఞప్తి చేసినప్పటికీ న్యాయమూర్తులు అంగీకరించలేదు.

ఇద్దరూ ఒకేసారి ప్రారంభించినప్పటికీ నీ స్నేహితుడు ముద్దాడిన విజయం మీ దరిచేరలేదని ఆందోళన పడుతున్నారా? ఓసారి పైనున్న ఈ ఫొటో చూడండి. రెండు జామకాయలు ఒకేసారి పక్కపక్కనే పెరిగినా, ఒకటి మాత్రం పండుగా మారింది. అచ్చం ఇలానే విజయం కోసం మీ సమయం వచ్చేవరకూ వేచి ఉండాలి. నిరాశతో మీరు ఫెయిల్ అయ్యారని అనుకోకుండా మీరోజు కోసం వేచి ఉండండి. విజయంలో ఉన్న స్వీట్‌నెస్‌ను రుచిచూడండి.

TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ <<15069986>>పోలీసులు మరోసారి<<>> నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన వెళ్తే గంటలోగా పర్యటన పూర్తి చేసుకోవాలన్నారు. దీనిని రహస్యంగా ఉంచాలని, ఎస్కార్ట్ భద్రత కల్పిస్తామన్నారు.

TG: మెట్రో రైలు విస్తరణకు, ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభోత్సవంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని అన్నారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వాలని కోరారు.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకి <<15076593>>రాజీనామా చేస్తారని<<>> వార్తలు రావడంతో భారతీయులు ఖుషీ అవుతున్నారు. ఖలిస్థానీలకు మద్దతు తెలిపి, ఇండియాపై నిరాధార ఆరోపణలు చేసినందుకు తగిన శాస్తి జరిగిందని పోస్టులు చేస్తున్నారు. ఇండియాకు హాని చేసే శక్తులు కెనడాలో ఉన్నా.. వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి సపోర్ట్ చేశారని ఫైరవుతున్నారు. భారత్‌తో పెట్టుకుంటే ఇలాగే అవుతుందని ఎద్దేవా చేస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు తమిళనాడులోని ‘లైకా ప్రొడక్షన్స్’ షాక్ ఇచ్చింది. డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్-3’ని పూర్తి చేయకుండా దిల్ రాజు తన ‘గేమ్ ఛేంజర్’ను TNలో విడుదల చేయొద్దని సూచించినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ తర్వాత ఇండియన్-3 మిగిలిన షూటింగ్ పూర్తిచేస్తామని శంకర్ లైకాకు తెలిపారని టాక్. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి.
Sorry, no posts matched your criteria.