India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నలుగురు BRS మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా వీరిపై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో అరెస్టైన రైతులను పరామర్శించేందుకు BRS నేతలు కొడంగల్ నియోజకవర్గానికి బయల్దేరారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలోని ఆ పార్టీ నేతలు అరెస్టైన వారికి సంఘీభావం తెలపనున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు వంద మంది దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
చిన్నప్పటి నుంచి కోహ్లీ ఆటతీరు చూస్తూ పెరిగానని యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. క్రికెట్లో తనకు కోహ్లీ ఆరాధ్య దైవమని చెప్పారు. విరాట్ స్టైల్ చూసి బ్యాటింగ్ నేర్చుకున్నానని.. అతడి గేమ్ ప్లే, ఆటిట్యూడ్ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. ఇండియన్ క్రికెట్ స్టైల్‌ను కింగ్ మార్చేశారని, అతడిలో ప్రతి క్వాలిటీని అభిమానిస్తానని నితీశ్ వివరించారు.
శంకర్‌దాదా MBBSలో హీరో చిరంజీవి చెప్పినట్లు కౌగిలింతతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రేమికులు, స్నేహితులు, పిల్లలు-పేరెంట్స్ ఇలా రిలేషన్ ఏదైనా హగ్ మంచిదే అంటున్నారు మానసిక నిపుణులు. కౌగిలింత వల్ల ఒత్తిడి తగ్గడం, మానసిక స్థితిని మెరుగుపరచడం, ఆక్సిటోసిన్‌ను పెంచడం, సంబంధాలను మెరుగుపరచడం, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం సాధ్యమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కౌగిలింత 5-10సెకన్ల వ్యవధి ఉండాలంటున్నాయి.
TG: కేంద్ర ప్రభుత్వ స్కీంలో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని KTR ప్రశ్నించారు. రూ.8,888కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని కోరారు. అడ్రస్, అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చారని, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని బీజేపీ అంటోందని, దీనిపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రేవంత్, పొంగులేటిల భరతం పట్టడం ఖాయమని KTR హెచ్చరించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. అక్కడి నుంచి ఆయన రేపు ఉదయం మహారాష్ట్రకు వెళ్లి, పార్టీ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ తరహాలో ఆ రాష్ట్రంలోనూ ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేయాలని అఘాడీ రేవంత్‌ను కోరింది. దానిపై ఆయన అక్కడి నేతలకు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
YS జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసింది. జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది. మరోవైపు ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు తమకు మరింత సమయం కావాలని సీబీఐ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అక్రమాస్తుల కేసు విచారణను HYD నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని RRR వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
వాలంటైన్స్ డేకి పోటీగా చైనాలో 1993లో సింగిల్స్ డే వేడుకలు మొదలయ్యాయి. బ్యాచిలర్స్‌గా ఉన్నవారు ఈ రోజున భారీగా షాపింగ్ చేస్తుంటారు. మొదలైనప్పటి నుంచి ఏటేటా ఈ రోజుకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది అక్టోబరు 14న ప్రారంభమై నిన్న ముగిసిన వేడుకలు చైనా చరిత్రలో సుదీర్ఘ సింగిల్స్ డే వేడుకలుగా నిలిచాయి. గత ఏడాది 156.4 బిలియన్ డాలర్ల షాపింగ్ జరగగా, ఈసారి వ్యాపారం దాన్ని మించిపోతుందని అంచనా.
బంగ్లాదేశ్‌పై మూడో వన్డేలో సెంచరీ చేసిన అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. వన్డేల్లో అతి తక్కువ వయసు(22Y 349D)లో 8 సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచారు. ఈ క్రమంలో సచిన్(22Y 357D), కోహ్లీ(23Y 27D)లను అధిగమించారు. సౌతాఫ్రికా క్రికెటర్ డికాక్ 22Y 312Dలోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉన్నారు. కాగా మూడో వన్డేలో గెలిచిన అఫ్గాన్ 2-1తో సిరీస్ గెలుచుకుంది.
సంజూ శాంసన్ వరుస సెంచరీల వెనక తన ఘనతేమీ లేదని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. అదంతా అతడి ప్రతిభేనని ప్రశంసించారు. ‘సంజూ ఫామ్ కోసం నేను చేసిందేమీ లేదు. అతడు సమర్థుడు. మనం చేయాల్సిందల్లా అతడిని సరైన స్థానంలో క్రీజులోకి పంపించి ఎంకరేజ్ చేయడమే. సంజూ చాలా శ్రమిస్తారు. ఇది అంతం కాదు ఆరంభం. భారత్ కోసం అతడిలాగే ఆడాలని కోరుకుంటున్నా. ప్రెజర్లోనూ యువ ఆటగాళ్లు రాణించడం శుభసూచకం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.