News January 6, 2025

టైమ్‌పాస్‌కు తినండి.. పోషకాలు పొందండి

image

వేయించిన శనగల్లో పుష్కలంగా ప్రొటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడి మలబద్ధకాన్ని నివారిస్తాయి. క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగకుండా దోహదపడతాయి. కండరాలు, ఎముకల పనితీరును మెరుగుపరిచే కాల్షియం, మెగ్నీషియం శనగల్లో లభిస్తుంది. వీటిలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే నిత్యం టైమ్‌పాస్‌గా గుప్పెడు నోట్లో వేసుకొని పోషకాలను పొందండి.

News January 6, 2025

రైతుభరోసాపై నేడు బీఆర్ఎస్ నిరసనలు

image

TG: రైతు భరోసాపై ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించేందుకు BRS సిద్ధమైంది. అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపునిచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి రూ.15వేల ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12వేలే ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహమని మండిపడ్డారు.

News January 6, 2025

9న ఓటీటీలోకి ‘బచ్చలమల్లి’?

image

అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 9న అమెజాన్ ప్రైమ్‌లో చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించారు.

News January 6, 2025

ఒక్క ‘సిరీస్’ ఎంత పని చేసింది

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో తుఫాన్ సృష్టించింది. ఆటగాళ్లపై ఎన్నో విమర్శలకు కారణమైంది. రోహిత్ ఫామ్ కోల్పోవడంతో కెప్టెన్సీ వదిలేయాలని వార్నింగ్‌లొచ్చాయి. పదేపదే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటైన కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని, ఓటములకు బాధ్యత వహిస్తూ గంభీర్ కోచ్‌గా దిగిపోవాలని కామెంట్స్ వినిపించాయి. పలువురు మినహా పెద్దగా ఎవరూ రాణించకపోవడంతో ఫ్యాన్స్, మాజీల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.

News January 6, 2025

రిటైర్మెంట్ ప్రకటించిన రిషి ధావన్

image

భారత క్రికెటర్ రిషి ధావన్ రిటైర్మెంట్ ప్రకటించారు. విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు నిన్న ఆంధ్రాతో మ్యాచ్ అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 397 రన్స్ చేసి, 11 వికెట్లు పడగొట్టారు. రిషి IND తరఫున 3వన్డేలు, ఒక T20 ఆడారు. IPLలో పంజాబ్, ముంబై, కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించారు.

News January 6, 2025

నిప్పు లేనిదే పొగ రాదు: ఏబీ డివిలియర్స్

image

భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో జరుగుతోందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అనుమానం వ్యక్తం చేశారు. నిప్పు లేనిదే పొగ రాదని ఆయన చెప్పారు. ‘విదేశాల్లో ఆడేటప్పుడు ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కుటుంబాన్ని వదిలేసి వారాల తరబడి ఉండటం వారిని కుంగదీస్తుంది. BGTలో వరుస ఓటములు భారత ఆటగాళ్లలో విభేదాలు సృష్టించి ఉండొచ్చు. క్రికెటర్లు అత్యుత్తమ ఆట ఆడనప్పుడు ఇలాంటి రూమర్లు వస్తాయి’ అని పేర్కొన్నారు.

News January 6, 2025

కమిన్స్.. ఈజీగా కప్పులు కొట్టేస్తున్నాడు!

image

ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఐసీసీ ట్రోఫీల్లో అదరగొడుతున్నారు. తన నాయకత్వంలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్, యాషెస్, BGT సిరీస్‌లు గెలుచుకుంది. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్, బౌలింగుల్లో కమిన్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రమే కాదు గతేడాది IPLలో SRHను ఫైనల్‌కు తీసుకొచ్చిందీ ఈ ఆస్ట్రేలియా స్టారే.

News January 6, 2025

జనవరి 06: చరిత్రలో ఈరోజు

image

* 1847: వాగ్గేయకారుడు త్యాగయ్య మరణం
* 1852: అంధులకు బ్రెయిలీ లిపి రూపొందించిన లూయీ బ్రెయిలీ మరణం
* 1929: కోల్‌కతాలో పేదలకు, రోగులకు సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మదర్ థెరిసా
* 1959: భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ పుట్టినరోజు
* 1966: మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ బర్త్‌డే

News January 6, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 6, 2025

సౌతాఫ్రికాతో టెస్ట్.. ఎదురొడ్డుతున్న పాక్

image

పాక్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 615 పరుగుల భారీ స్కోర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన PAK తొలి ఇన్నింగ్స్‌లో 194 రన్స్‌కే పరిమితమైంది. ఫాలో ఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగా ఆ జట్టు బ్యాటర్లు రాణించారు. ఓపెనర్లు మసూద్ సెంచరీ(102*) చేయగా బాబర్ 81 రన్స్‌తో రాణించారు. తొలి వికెట్‌కు 205 రన్స్ జోడించారు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి PAK ఇంకా 208 రన్స్ వెనుకంజలో ఉంది.