India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ నేతలకు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు మీడియాతో పేర్కొన్నారు. దీనిపై ఆయన స్పందించాలని కోరారు. ఆరు గ్యారంటీల ఊసెత్తకుండా ఇలాగే పాలన కొనసాగితే ప్రజలు ఉపేక్షించరని దుయ్యబట్టారు.
ప్రశాంత్ వర్మ, తేజా సజ్జ కాంబినేషన్లో తెరకెక్కిన ‘హనుమాన్’ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్’ మూవీ రిలీజ్‌కు రెండేళ్ల సమయం పట్టవచ్చని నిర్మాత చైతన్య రెడ్డి అన్నారు. వచ్చే ఏడాదే ఈ సినిమాను విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించడంతో తాజాగా నిర్మాత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా వీరి నిర్మాణంలో తెరకెక్కిన ‘డార్లింగ్’ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది.
TG: కే.కేశవరావును రాష్ట్ర సలహాదారుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ ఎఫైర్స్‌కు (ప్రజాసంబంధాల)కు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తారని, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కేకే కాంగ్రెస్‌లో చేరారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రస్తుతం 270.7KM పొడవైన 4 లైన్ల హైవేను 6 లైన్లకు విస్తరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇదే సమయంలో అమరావతి-HYD మధ్య దూరం తగ్గించేలా కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని AP ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇది సాకారమైతే అమరావతి-HYD మధ్య 60-70KM వరకూ దూరం తగ్గుతుంది. 201-220KM పొడవైన ఈ హైవేను APలోని చందర్లపాడు, నేరేడుచర్ల, తిప్పర్తి మీదుగా నిర్మించాలని సూచించింది.
అభిమాన ప్లేయర్ల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఫ్యాన్స్ వెనకడుగు వేయట్లేదు. రేపు మాజీ క్రికెటర్ ధోనీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏపీలోని నందిగామలో ఫ్యాన్స్ 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని ఐదేళ్లు గడుస్తున్నా ఆయనపై అభిమానం ఏ మాత్రం తగ్గలేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
ఇజ్రాయెల్‌పై పోరులో హమాస్‌కు మద్దతు, USతో సంబంధాలు క్షీణించిన వేళ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో <<13575769>>మసూద్<<>> పెజెష్కియన్ గెలుపొందడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వంలో ఇస్లామిస్ట్ వాదుల మెజార్టీ, సుప్రీంలీడర్‌గా ఆయతొల్లా ఖోమైనీ ఉండటం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ మసూద్ పాలన సాగించాలి. సంస్కరణవాది అయిన మసూద్ హిజాబ్‌పై చట్టాల సడలింపు సహా అంతర్జాతీయ పాలసీల్లో మార్పు తెస్తారని ఆయన మద్దతుదారులు ఆశిస్తున్నారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురంలోని భోగాపురం, ఇల్లింద్రాడ పరిధిలో 3.52 ఎకరాలు కొనడంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయట. గతంలో ఎకరం రూ.15-16లక్షలు, NH216కు దగ్గరలో అయితే రూ.50 లక్షల వరకు ఉండేది. పవన్ రాకతో ఇప్పుడు ఎకరం విలువ రూ.కోటి దాటిందని, కొన్నిచోట్ల రూ.2-3 కోట్ల వరకు రేటు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. రియల్టర్లు ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనేందుకు రైతుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.
AP: ఎన్నికల్లో కింది స్థాయిలో ఏ నాయకుడు ఎలా పనిచేశారనే దానిపై కేడర్ నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని TDP నిర్ణయించింది. 35 లక్షల మంది పార్టీ సభ్యుల ద్వారా ఈ మేరకు సమాచారం సేకరిస్తోంది. గ్రామ, యూనిట్, క్లస్టర్, మండల స్థాయి నాయకుల్లో ఎవరు బాగా పనిచేశారు? ఎవరు పార్టీ కోసం పనిచేయలేదు? అనే వివరాలను ఇప్పటికే తెప్పించిన నివేదికతో సరిపోల్చుకోనుంది. ఫీడ్ బ్యాక్ బాగున్న నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వనుంది.
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్‌ను వినియోగించుకున్న ఓ 9 ఏళ్ల బాలిక చెస్‌లో అద్భుతాలను సృష్టిస్తోంది. లండన్‌లోని హారోకు చెందిన భారత సంతతి చెస్ ప్రాడిజీ బోధనా శివనందన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగే చెస్ ఒలింపియాడ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టులో చోటు దక్కించుకుంది. దీంతో చెస్ ఒలింపియాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అతి పిన్న చెస్ ప్రాడిజీగా రికార్డులకెక్కనుంది.
TG: విపక్ష బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కృష్ణమోహన్‌తో కలిపి ఇప్పటి వరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు.
Sorry, no posts matched your criteria.