India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తనను మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై <<13570128>>ఫిర్యాదు<<>> చేసిన లావణ్యకే రివర్స్‌లో నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఆమెకు 91 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. అయితే ప్రస్తుతం ఆమె అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. అటు ఆమె ఆరోపణల్లో నిజం లేదని హీరో రాజ్‌తరుణ్ నిన్న స్పందించారు. ఆమె తనను చాలా టార్చర్ చేసిందని మీడియాతో చెప్పారు.
AP: తెలుగు రాష్ట్రాల మాజీ CMలు KCR, జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి Xలో విమర్శలు గుప్పించారు. ‘మొన్నటి వరకు ఒకరు ప్యాలెస్ సీఎంగా, మరొకరు ఫామ్ హౌస్ సీఎంగా వ్యవహరించి నియంతలుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత CMలు రేవంత్, చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ప్రజా భవన్లో నేడు చర్చించనున్నారు. తెలుగు ప్రజలకు ఇక మంచిరోజులు.. తెలుగు జాతికి నిండు వెలుగులు’ అని రాసుకొచ్చారు.
త్రిపురలో ఇప్పటివరకు హెచ్ఐవీతో 47 మంది విద్యార్థులు మరణించారు. 828 మంది విద్యార్థులకు HIV పాజిటివ్‌గా గుర్తించినట్లు TCACS అధికారి తెలిపారు. ప్రతి రోజూ 5-7 కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తంగా HIVతో బాధపడుతున్నవారి సంఖ్య 5,674గా ఉందన్నారు. సంపన్న కుటుంబాల పిల్లలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని, కేసుల పెరుగుదలకు మాదకద్రవ్యాల దుర్వినియోగమే కారణమని తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈ నెల 9న మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం కానుంది. అయోధ్య, కాశీ, గయ, ప్రయాగరాజ్ తదితర పుణ్యక్షేత్రాలను కలిపేలా ఈ రైలు నడవనుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కవచ్చు. స్లీపర్ టికెట్ ధర రూ.15,510, కంఫర్ట్ కేటగిరీ ధర రూ.31,500గా నిర్ణయించారు.
TG: నిమ్స్ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్ ఆత్మహత్య చేసుకున్నారు. HYDలోని బేగంపేటలోని తన నివాసంలో అధిక మోతాదులో మత్తుమందు తీసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాచీకర్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్తీషియా డిపార్ట్మెంట్లో అడిషినల్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరు వ్యక్తుల పంచాయితీని గేదె సులువుగా తీర్చేసిన ఘటన UPలోని ప్రతాప్‌గఢ్‌లో జరిగింది. నందలాల్‌కు చెందిన గేదె తప్పిపోగా, దాన్ని హనుమాన్ అనే వ్యక్తి తన ఇంట్లో కట్టేసి తిరిగిచ్చేందుకు నిరాకరించాడు. ఈ వివాదంపై పోలీసులు పంచాయితీ చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఇరువురూ రోడ్డుకు చెరో వైపు వెళ్లాలని, గేదె ఎవరిని అనుసరిస్తే వారికే సొంతమని SHO చెప్పారు. అది యజమాని నందలాల్‌కు వైపే వెళ్లడంతో కేసు క్లోజైంది.
AP: YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్పై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఇక్కడ 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని MLC రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం స్థలాలు మంజూరు చేసి, ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తిచేయలేదని తెలిపారు. రూ.84.70 కోట్ల బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు నిలిపినట్లు MLC పేర్కొనగా, సీఎం విచారణకు ఆదేశించారు.
పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల వివాహం ఈనెల 12న జరగనుంది. ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను హాట్‌స్టార్ దక్కించుకుంది. జులై 12న ‘శుభ్ వివాహ్’తో వేడుక ప్రారంభం కానుంది. 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్‌తో కార్యక్రమాలు ముగియనున్నాయి. ఈ సంబరాలను హాట్‌స్టార్‌లో లైవ్‌లో వీక్షించొచ్చని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే సంగీత్ కార్యక్రమం గ్రాండ్‌గా ముగిసింది.
గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ‘ఓలా మ్యాప్స్’ తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ CEO భావిశ్ అగర్వాల్ ప్రకటించారు. గతంలో మ్యాప్స్ కోసం ఏడాదికి ₹100కోట్లు వెచ్చించేవాళ్లమని, ఇక నుంచి ఆ ఖర్చు ఉండదని చెప్పుకొచ్చారు. ఓలా యాప్ యూజర్లు వెంటనే యాప్ అప్డేట్ చేసుకోవాలని కోరారు. ఈ మ్యాప్స్‌లో స్ట్రీట్ వ్యూ, ఇండోర్ ఇమేజ్‌లు, 3D మ్యాప్‌లు, డ్రోన్ మ్యాప్‌లు మొదలైన ఫీచర్స్ త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన టాప్-ర్యాంక్ చెస్ గ్రాండ్ మాస్టర్ జియావుర్ రహ్మాన్ (50) మృతి చెందారు. తోటి గ్రాండ్‌మాస్టర్ ఇనాముల్ హుస్సేన్‌తో జరిగిన ఛాంపియన్షిప్ గేమ్ 12వ రౌండ్లో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. ఢాకాలోని ఓ ఆసుపత్రికి రహ్మాన్‌ను తరలించగా వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. 2022లో ఇండియాలో జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్‌లో బంగ్లాదేశ్‌కు ఆయన ప్రాతినిధ్యం వహించారు.
Sorry, no posts matched your criteria.