News April 4, 2024

హార్దిక్ పాండ్యకు లాస్ట్ ఛాన్స్?

image

IPL: ప్రస్తుత సీజన్‌లోనే హార్దిక్ పాండ్యను ముంబై కెప్టెన్సీ నుంచి తొలగించవచ్చని వార్తలు వస్తున్నాయి. పాండ్యకు రెండు అవకాశాలు ఇవ్వాలని ముంబై ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు ‘NEWS 24’ తెలిపింది. తర్వాత జరిగే 2 మ్యాచుల్లో ముంబై నెగ్గడంతో పాటు వ్యక్తిగతంగానూ రాణించాలని హార్దిక్‌కు షరతు విధించిందట. లేదంటే నాయకత్వంలో మార్పులు చేస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా, తొలి 3 మ్యాచుల్లో ముంబై ఓడిపోయింది.

News April 4, 2024

ట్రాక్టర్‌కు సీట్ బెల్ట్ లేదని చలాన్

image

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ట్రాక్టర్‌పై వెళ్తుండగా సీటు బెల్ట్ లేదని పాల్వంచ పోలీసులు ట్రాఫిక్ చలాన్ విధించారు. ట్రాక్టర్‌కు సీటు బెల్ట్ ఉంటుందా? లేదా? అని షోరూంకు కాల్ చేశానని, వాళ్లు ఉండదని చెప్పారని ఆయన తెలిపారు. మరి ట్రాఫిక్ పోలీసులు దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

News April 4, 2024

వాట్సాప్ డౌన్ అంటూ పోస్టులు

image

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ డౌన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మెసేజ్‌లు పోవడం లేదంటూ పలువురు ట్విటర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. #whatsappdown ట్రెండ్ అవుతోంది. అయితే తమకు ఎలాంటి సమస్యలు లేవని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

News April 4, 2024

అవినాశ్ బెయిల్ రద్దు చేయాలి: సీబీఐ

image

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న MP అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు విధించిన షరతులను అవినాశ్ ఉల్లంఘించారని, సాక్షులను ప్రభావితం చేశారని తెలిపింది. అందువల్ల ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

News April 4, 2024

టార్గెట్‌ విజయ్

image

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ భారీ అంచనాల మధ్య రేపు విడుదల కానుంది. ఈ చిత్రం హిట్, ఫట్ అంటూ అప్పుడే నెట్టింట చర్చ మొదలైంది. USA రివ్యూ అంటూ విజయ్ టార్గెట్‌గా కొందరు నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. ‘టాక్ తేడా కొడుతోంది. 150 బొక్క’ వంటి థంబ్‌నెయిల్స్‌తో యూట్యూబ్‌లో వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి ప్రచారం విజయ్‌కి కొత్త కాదని, మూవీ హిట్ అంటూ అతడి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News April 4, 2024

BREAKING: చంద్రబాబుకు ఈసీ నోటీసులు

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో ఆయన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఫిర్యాదు చేసింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు కంప్లైంట్ చేశారు. దీంతో బాబుకు నోటీసులు ఇచ్చిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

News April 4, 2024

నాన్ లోకల్ అభ్యర్థుల అడ్డా ‘వైజాగ్’(1/3)

image

ఎన్నికల్లో కుల, మతాలే కాదు.. లోకల్, నాన్ లోకల్ అంశాలు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఎక్కువగా స్థానిక అభ్యర్థులనే ఓటర్లు ఎన్నుకోవడం సహజం. అయితే విశాఖ పార్లమెంట్ స్థానం దీనికి విరుద్ధం. 33 ఏళ్లుగా స్థానికేతరులే గెలుస్తున్నారు. 1952 నుంచి 1989 వరకు లోకల్ అభ్యర్థుల హవా కొనసాగగా, ఆ తర్వాతి నుంచి అన్ని పార్టీలూ నాన్ లోకల్స్‌కే సీట్లు ఇస్తున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 4, 2024

నాన్ లోకల్ అభ్యర్థుల అడ్డా ‘వైజాగ్’(2/3)

image

విశాఖ ఎంపీ స్థానంలో తొలిసారి 1991లో నాన్ లోకల్ MVVS మూర్తి(తూర్పుగోదావరి) టీడీపీ నుంచి గెలిచారు. 1996, 1998లో కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బరామిరెడ్డి(నెల్లూరు), 1999లో మళ్లీ MVVS మూర్తి, 2004లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి-INC(నెల్లూరు), 2009లో దగ్గుబాటి పురందీశ్వరి-INC(ప్రకాశం), 2014లో కంభంపాటి హరిబాబు-BJP(ప్రకాశం), 2019లో MVV సత్యనారాయణ-YCP(వెస్ట్ గోదావరి) విజయం సాధించారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 4, 2024

నాన్ లోకల్ అభ్యర్థుల అడ్డా ‘వైజాగ్’(3/3)

image

విశాఖ పార్లమెంట్ స్థానంలో ఈసారి వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ, కూటమి నుంచి TDP అభ్యర్థిగా M.భరత్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా స్థానిక అంశంతోనే బరిలో దిగుతున్నారు. తాను విజయనగరం కోడలు అయినప్పటికీ పుట్టినిల్లు విశాఖేనని ఝాన్సీ చెబుతున్నారు. గీతం వర్సిటీ సహా అనేక విద్యాసంస్థలను నెలకొల్పిన తాము కూడా విశాఖ వాసులమేనని భరత్ అంటున్నారు. దీంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 4, 2024

BREAKING: ఫైనల్ ‘కీ’ విడుదల

image

TSPSC కీలక ప్రకటన చేసింది. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పరీక్షల ఫైనల్ కీ రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. 2023 అక్టోబర్ 20, 26 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. గత ఏడాది NOVలో ప్రైమరీ కీ విడుదల చేసింది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ సైట్ చూడాలని పేర్కొంది.