India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్ర ప్రభుత్వం రెండు నీటిపారుదల ప్రాజెక్టుల పేర్లను మార్చింది. ఉమ్మడి MBNR జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరును పెట్టింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి అయిన రాజనర్సింహ పేరును ఖరారు చేసింది.

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి గొంతు కోస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. రైతుభరోసా ఒక విడతలో ఎకరానికి రూ.7,500 ఇస్తామని, ఇప్పుడు రూ.6,000కు కుదించడం దారుణమన్నారు. ‘రైతుభరోసాను రైతు గుండెకోతగా మార్చారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ఠ. దారుణంగా దగా చేసిన సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు. వానాకాలంలో ఎగ్గొట్టిన రైతుభరోసా కూడా చెల్లించాలి’ అని హరీశ్ డిమాండ్ చేశారు.

AP: బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. సినిమా రిలీజయ్యే జనవరి 12న ఉ.4 గంటలకు బెనిఫిట్ షో టికెట్ రేటును రూ.500గా నిర్ణయించింది. ఫస్ట్ డే నుంచి జనవరి 25 వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. వాటికి మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.135, సింగిల్ స్క్రీన్‌లపై రూ.110 హైక్ ఇచ్చింది.

AP: సీఎం చంద్రబాబు రేపటి నుంచి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. ఈ పర్యటనలో సీఎం పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, యువతతో సమావేశాలు నిర్వహిస్తారు. సీఎం రాకతో కుప్పంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకు 200 టార్గెట్ సరిపోదేమోనని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘బుమ్రా తిరిగి మైదానంలో అడుగు పెడితేనే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. ఆయన లేకపోతే 200 లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేం. ప్రస్తుతం బుమ్రా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు ఊహకు అందకుండా బుమ్రా హెల్త్ అప్డేట్‌ను సీక్రెట్‌గా ఉంచినట్లు తెలుస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

చైనాలో <<15048897>>వైరస్<<>> కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై ఆరోగ్యశాఖ జాయింట్ మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. చైనాలో ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామంది. దీనిపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు విజ్ఞప్తి చేసింది. ఈ శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటివరకు చైనాలో పరిస్థితి అసాధారణంగా లేదని వివరించింది.

AP: హీరోలు వచ్చి నమస్కారం పెట్టాలనే మనస్తత్వం తమది కాదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘తోటి హీరోని అన్యాయంగా అరెస్టు చేస్తే 27 రోజులు నోరు విప్పకపోవడం మీ స్వభావం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అల్లు అర్జున్ అరెస్టయి బయటికొచ్చిన 27 రోజుల తర్వాత పవన్ స్పందించడంపై పరోక్షంగా ఇలా రాసుకొచ్చారు.

తాము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం చిరంజీవి అని Dy.CM పవన్ తెలిపారు. ‘మీరు గేమ్ ఛేంజర్ అనొచ్చు. ఓజీ అనొచ్చు. కానీ దానికి ఆద్యులు చిరంజీవి. మొగల్తూరు అనే గ్రామం నుంచి వచ్చి ఆయన ఈస్థాయికి వచ్చారు. మేమెప్పుడూ మూలాలు మర్చిపోం. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టారే అవుతారు. రంగస్థలంలో నటన చూసి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని అనిపించింది. భవిష్యత్తులో కచ్చితంగా అందుకుంటారు’ అని చెప్పారు.

TG: సాగులో లేని భూములకు రైతుభరోసా డబ్బులు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతుభరోసా వర్తింపజేయం’ అని తేల్చి చెప్పారు. వ్యవసాయం చేసే భూమి ఎంత ఉన్నా ఈ స్కీం వర్తిస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
✒ జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ
✒ ఫిబ్రవరి నుంచి లబ్ధిదారులకు రేషన్ బియ్యం
✒ 200 కొత్త గ్రామ పంచాయతీలు, 11 నూతన మండలాలకు ఆమోదం
✒ పెండింగ్‌లో ఉన్న ములుగు మున్సిపాలిటీ ఏర్పాటుకు ఓకే.. త్వరలోనే గవర్నర్‌కు ప్రతిపాదనలు
✒ వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
Sorry, no posts matched your criteria.