India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి <<13434917>>హత్య<<>> కేసులో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతడికి కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించారని తెలిసింది. బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా, 8 చోట్ల కాలిన గుర్తులున్నాయట. రేణుకా స్వామిపై మొదట పవిత్రా గౌడనే దాడి చేసినట్లు తేలింది.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరిట ట్విటర్‌లో చెలామణి అవుతున్న అకౌంట్లు ఫేక్ అని ఆమె టీమ్ ప్రకటించింది. ఆమెకు ట్విటర్‌లో అకౌంట్ లేదని స్పష్టం చేసింది. కొందరు జాన్వీ పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి, బ్లూటిక్ కూడా పొందారంది. వాటితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆయా అకౌంట్ల నుంచి వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని కోరింది. కాగా జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అప్డేట్స్ ఇస్తుంటారు.
లోక్‌సభ స్పీకర్ పదవిని తమ పార్టీ వారికే కేటాయించాలని బీజేపీ నిర్ణయించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. NDA కూటమిలోని మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందట. ఈ విషయంలో మిత్రపక్షాలను ఒప్పించే టాస్క్ కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ పోస్టు టీడీపీ, జనతా దళ్ పార్టీల్లో ఎవరికి ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
టికెటింగ్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు వస్తున్న వార్తలను ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కన్ఫామ్ చేసింది. పేటీఎంకు చెందిన మూవీ & ఈవెంట్ టికెటింగ్ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. దీనిపై స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో స్పష్టత ఇచ్చింది. అయితే ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు జొమాటోతో పాటు పేటీఎం సైతం ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.1500కోట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ నుంచి 7 మండలాలు వచ్చినందునే పోలవరం మొదలుపెట్టామని CM చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం మాట్లాడుతూ.. ‘పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు. TDP హయాంలోనే 72% పూర్తి చేశాం. 15లక్షల క్యూసెక్కులు స్పిల్ వేపై డిశ్చార్జ్ అవుతాయి. చైనాలో త్రీగోర్జెస్ డ్యామ్ కంటే ఎక్కువ ప్రవాహం ఉన్న ప్రాజెక్టు ఇది. రాయలసీమకూ గోదావరి జలాలు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది’ అని పేర్కొన్నారు.
TG: కరీంనగర్ బస్టాండ్‌లో గర్భిణీకి కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. చీరలు అడ్డుగా కట్టి ప్రసవానికి సహాయం చేశారన్న వార్తలు చూసిన సీఎం.. సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. విధి నిర్వహణలోనూ ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.
ODIWC, T20WCలో గ్రూప్ దశలోనే ఎలిమినేట్ కావడంతో తనపై వస్తున్న విమర్శలపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఘాటుగా స్పందించారు. ‘మేం ఒక్క ఆటగాడి వల్ల ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం.. జట్టుగానే ఓడిపోయాం. అందరూ కెప్టెన్‌వైపు వేలు చూపిస్తున్నారు. కానీ నేను 11 మంది స్థానాల్లోనూ ఆడలేను. టీమ్‌లో ఎవరి పాత్ర వారికి ఉంటుంది. ఒకవేళ నేను సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలనుకుంటే అందరి ముందూ ప్రకటిస్తా’ అని పేర్కొన్నారు.
AP: నెల్లూరు-ముంబై హైవేపై ప్రయాణిస్తున్న కారును పెద్ద పులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన ఐదుగురు కారులో వెళ్తుండగా నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో ఈ ఘటన జరిగింది. కారు ముందుభాగం ధ్వంసంకాగా, పులి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాసేపటికి అది అడవిలోకి వెళ్లిపోయింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. పులి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
హీరోయిన్‌గానే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్స్‌ని సైతం రూపొందిస్తూ మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నారు శ్రుతిహాసన్. తన తండ్రి కమల్ హాసన్ బయోపిక్‌ను డైరెక్ట్ చేయడంపై తాజాగా ఆమె స్పందించారు. ఆయన జీవిత చరిత్రను తీయడానికి తాను సరైన వ్యక్తి కాదని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో గొప్ప దర్శకులున్నారని.. వారైతే అద్భుతంగా తెరకెక్కించగలరని చెప్పారు. తాను తీస్తే ఒక వైపు నుంచి పక్షపాతంగా తీసినట్లు అనిపిస్తుందన్నారు.
AP: కొంతమంది పోలీసుల్లో ఇంకా వైసీపీ రక్తమే ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ఆయా అధికారులు వారి వ్యవహారశైలిని మార్చుకోవాలని ఆమె సూచించారు. అయినా వైసీపీపై ప్రేమ తగ్గకపోతే ఉద్యోగాల్ని వదిలేసి ఆ పార్టీకోసం పనిచేసుకోవచ్చని సూచించారు. ఈరోజు సింహాచలం అప్పన్నను ఆమె దర్శించుకున్నారు. దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
Sorry, no posts matched your criteria.