News June 17, 2024

కోడెలను వేధించిన కర్మ జగన్‌ను వెంటాడుతోంది: దేవినేని

image

AP: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను వేధించిన పాపం తాలూకు కర్మ మాజీ సీఎం జగన్‌ను వెంటాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రూ.కోట్ల విలువైన ఫర్నిచర్‌ను ఇంట్లో పెట్టుకోవడం దారుణమని మండిపడ్డారు. ‘ఒప్పుకొంటే తప్పు ఒప్పవుతుందా? దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం, రేటు కడతాం అంటే చట్టం ఎలా ఒప్పుకొంటుంది? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వైఎస్ జగన్ సమాధానమివ్వాలి’ అని డిమాండ్ చేశారు.

News June 17, 2024

T20WC సూపర్-8: గ్రూప్-1, గ్రూప్-2లో జట్లివే..

image

టీ20 WCలో కీలకమైన రెండో దశకు తెర లేవనుంది. రేపటి నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. ఇందులో జట్లు 2 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్-1లో భారత్, AUS, అఫ్గానిస్థాన్, బంగ్లా చోటు సంపాదించాయి. ఇక గ్రూప్-2లో USA, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడతాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు చేరుతాయి. భారత్ 20న ఆఫ్గానిస్థాన్, 22న బంగ్లా, 24న AUSతో ఆడనుంది.

News June 17, 2024

మోదీపై సెటైరికల్ ట్వీట్ డిలీట్ చేసిన కేరళ కాంగ్రెస్

image

ప్రధాని మోదీపై సెటైరికల్‌గా చేసిన <<13452857>>ట్వీట్‌ను<<>> కేరళ కాంగ్రెస్ డిలీట్ చేసింది. ఆ ట్వీట్‌తో కాంగ్రెస్ పార్టీ క్రైస్తవులను అవమానించిందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే.సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. పలువురు క్రైస్తవ నాయకులు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆ ట్వీట్ డిలీట్ చేసింది. ‘దీని వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నాం’ అని ప్రకటించింది.

News June 17, 2024

జగన్ అసెంబ్లీకి వెళ్తారా..?

image

AP: మరో రెండ్రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో తొలిరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో చరిత్ర సృష్టించిన వైసీపీ ఈసారి 11 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదానూ కోల్పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాని పక్షంలో సమావేశాల అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.

News June 17, 2024

APలో కర్మ ఫలించింది: సీమెన్స్ మాజీ ఎండీ

image

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ పరోక్ష విమర్శలు చేశారు. అక్కడ కర్మ ఫలితం కనిపించిందని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ‘న్యాయం గెలుస్తుందని నేను అన్నాను. ఇప్పుడు ప్రజాతీర్పు రూపంలో అదే జరిగింది. చంద్రబాబు, లోకేశ్‌ హయాంలో రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ చేశారు.

News June 17, 2024

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు: అశ్వినీ

image

పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు మెరుగైన ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైనవారికి రూ.2.5 లక్షలు, గాయాలైనవారికి రూ. 50వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000ను PMNRF నుంచి ఇస్తామని ప్రకటించారు.

News June 17, 2024

ఒక్క ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్‌నీ ఇవ్వని కాలేజీ!

image

ఆ హాస్పిటల్/మెడికల్ కాలేజీ స్థాపించి 13 ఏళ్లు. ఇంతవరకు ఒక్క సర్జరీ జరగలేదు. ఒక్క MBBS గ్రాడ్యుయేట్ కాలేజీ నుంచి బయటకు రాలేదు. ఇదీ పంజాబ్‌లోని వైట్ Pvt మెడికల్ కాలేజీ దుస్థితి. ఫ్యాకల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో దీనికి NMC అనుమతులు నిరాకరిస్తూ వస్తోంది. దీంతో విద్యార్థుల్ని వేరే కాలేజీలకు షిఫ్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కర్ణాటకలోని GRకాలేజీదీ ఇదే పరిస్థితి కాగా విద్యార్థుల్ని తరలించారు.

News June 17, 2024

‘కల్కి’లో విజయ్ దేవరకొండ, దుల్కర్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి’ సినిమాలో మరికొందరు స్టార్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్, దీపికా, దిశా పటానీ కన్ఫర్మ్ అయ్యారు. తాజాగా మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారట. అర్జునుడి పాత్రలో విజయ్ నటిస్తున్నారట. ఈనెల 27న కల్కి రిలీజవుతుంది.

News June 17, 2024

చంద్రబాబు చేయాల్సిందల్లా కేంద్రాన్ని అడగటమే: VSR

image

AP: సీఎం చంద్రబాబు తలచుకుంటే కేంద్రం నుంచి సులభంగా ప్రత్యేక హోదా సాధించవచ్చని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన చేయాల్సిందల్లా కేంద్రాన్ని అడగటమే అని అన్నారు. టీడీపీ మద్దతుపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడిన తరుణంలో చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసి ప్రత్యేక హోదాపై చర్చించాలని పేర్కొన్నారు.

News June 17, 2024

బాబాయ్, అబ్బాయ్‌కి ఘనస్వాగతం

image

AP: కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా, అచ్చెన్నాయుడు రాష్ట్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మంత్రులైన తర్వాత సొంత జిల్లా శ్రీకాకుళానికి ఇవాళ తొలిసారి వచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలు వేశారు. భోగాపురం నుంచి శ్రీకాకుళం ఆర్చి, 7రోడ్స్ జంక్షన్, అరసవల్లి జంక్షన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు.