India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియాతో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముంగిట న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 16న బెంగళూరులో మొదలయ్యే టెస్టుకు కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండట్లేదని ఆ జట్టు సెలక్టర్లు ప్రకటించారు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అతడు అసౌకర్యానికి గురయ్యారు. కేన్ లేకపోవడం న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగానికి పెద్దలోటే.
TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వీరిని హైదరాబాద్ తీసుకురానున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపికైన టీచర్లకు దసరా సెలవులు ముగిసే లోపే పోస్టింగులు ఇచ్చేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
AP: గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.287.12 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వ పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు నిధులను కేటాయిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ జీవో ఇచ్చారు. ఇటు PM జన్‌మన్ పథకం కింద 332 గిరిజన గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటుకు రూ.29.93 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి నారాయణపేట, గద్వాల, కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
TG: అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తమ కుటుంబంపై మంత్రి సురేఖ ఆరోపణలను ఖండిస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఆరోజు మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని నాగ్ తరఫు లాయర్ అశోక్‌రెడ్డి తెలిపారు. అదే రోజు మంత్రికి నోటీసులు జారీ చేసే అవకాశముందన్నారు. అటు నాగార్జున పిటిషన్ నిలబడదని సురేఖ న్యాయవాది తిరుపతివర్మ అన్నారు. ఆయన పిటిషన్‌లో ఒకలా, కోర్టు వాంగ్మూలంలో మరోలా చెప్పారన్నారు.
AP: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ నేడు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో వారిద్దరికి సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వీరిద్దరూ వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో 2వ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈనెల 6న జరిగిన తొలి T20లో భారత్ గెలిచింది. ఈరోజు భారత్ గెలిస్తే సిరీస్ వశం కానుంది. బంగ్లా గెలిస్తే సిరీస్ 1-1గా మారి 3వ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈనేపథ్యంలోనే నేటి మ్యాచ్‌లో గెలవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి భారత్ గెలిచి సిరీస్ వశం చేసుకుంటుందా? లేక బంగ్లాకు ఛాన్స్ ఇస్తుందా? వేచి చూడాలి. రా.7గంటలకు మ్యాచ్ ప్రారంభం.
TG: మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలో దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
యాపిల్ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్ కాన్ తమిళనాడులో రూ.13,180 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సీఎం స్టాలిన్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాంచీపురంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా దాదాపు 14వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. యాపిల్ సప్లై చెయిన్‌లోని 14 యూనిట్లలో తమిళనాడులో ఏడు ఉండటం గమనార్హం. దీంతో పాటు రూ.38,699 కోట్ల పెట్టుబడులతో కూడిన మరో 13 ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Sorry, no posts matched your criteria.