India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.600 తగ్గి రూ.78,760కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గడంతో రూ.72,200 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,000 తగ్గడంతో రూ.1,02,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడటంపై ఇప్పటివరకు క్లారిటీ లేదని కోచ్ గంభీర్ చెప్పారు. అయితే హిట్‌మ్యాన్ ఆడతారనే ఆశిస్తున్నట్లు మీడియాతో తెలిపారు. సిరీస్ మొదలయ్యే ముందు దీనిపై క్లారిటీ ఇస్తామన్నారు. ఒకవేళ రోహిత్ తొలి టెస్టు ఆడకపోతే బుమ్రా సారథిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాహుల్, అభిమన్యు ఈశ్వరన్‌లలో ఒకరు యశస్వీతో కలిసి ఓపెనింగ్ చేస్తారని తెలిపారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశమైంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూపొందించిన 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అంతకుముందు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఉల్లిధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వారం రోజుల క్రితం కేజీ రూ.50లోపు ఉన్న ధర ప్రస్తుతం రూ.70-80కి చేరింది. దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోనూ ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఉల్లి రేట్లు పెరగడంతో ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.
ఈ సంవత్సరంలో ఇంకో 50 రోజులే ఉన్నాయి. కాసేపు వెనక్కి వెళ్తే ఈ ఏడాది ఇంత ఫాస్ట్‌గా అయిందేంటి అని చాలామందికి అన్పిస్తుంది. ఇంకొందరికేమో రోజులు మారుతున్నా, మన లైఫ్ మాత్రం మారడం లేదేంటి? అనే వెలితి కన్పిస్తుంది. పరిగెడుతున్న కాలంలో మీ బెస్ట్, వరెస్ట్ మెమొరీస్ ఏమిటి? మిగిలిన ఈ హాఫ్ సెంచరీ డేస్‌లో ఏం చేద్దామనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
ఏపీ ప్రభుత్వం తనకు ఇచ్చిన ‘<<14569063>>నైతిక విలువల సలహాదారు<<>>’ పదవిని స్వీకరిస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నానని, పదవుల కోసం కాదని చెప్పారు. నేటి యువత సన్మార్గంలో నడిస్తేనే దేశానికి మంచిపేరు వస్తుందని పేర్కొన్నారు. కాగా ఏపీ ప్రభుత్వం చాగంటికి క్యాబినెట్ ర్యాంకుతో ఈ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే.
సౌతాఫ్రికాతో రెండో టీ20లో డకౌట్ అయిన సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. షార్ట్ ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ సార్లు(4) సున్నాకే వెనుదిరిగిన భారత ప్లేయర్‌గా నిలిచారు. రోహిత్ శర్మ 2018లో, విరాట్ కోహ్లీ 2024లో మూడుసార్ల చొప్పున డకౌటయ్యారు. ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక సార్లు(12) సున్నాకే ఔటైన అవాంఛిత రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది.
‘అమరన్’ సినిమాలో సాయిపల్లవి నటన సూపర్ అంటూ హీరోయిన్ జ్యోతిక ఇన్‌స్టా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై సాయి పల్లవి స్పందిస్తూ మీకు సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉందని బదులిచ్చారు. ‘సాయి.. నువ్వు గొప్ప నటివి. నీ నటన నాకు నచ్చుతుంది. నువ్వు ఎంచుకున్న పాత్రకు న్యాయం చేస్తావు. అందుకే నువ్వు నాకు స్పెషల్’ అని పల్లవికి జ్యోతిక రిప్లై ఇచ్చారు.
MPకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డా.PN.మిశ్రా అదిరిపోయే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. రాబోయే మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా అంచనా వేస్తే రూ.కోటి బహుమతి ఇస్తానని ప్రకటించారు. సరిగ్గా అంచనా వేయలేకపోయినవారు బహిరంగ క్షమాపణ చెప్పాలని షరతు పెట్టారు. కొందరు శాస్త్రీయ ఆధారాలు లేకుండా అంచనాలు వేస్తూ, మూఢనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారని అంటున్నారు.
AP: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పీకలదాకా మద్యం తాగిన జగదీశ్ అనే సీనియర్ విద్యార్థి పది మంది జూనియర్లను ర్యాగింగ్ చేశాడు. కారిడార్‌లోకి తీసుకొచ్చి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నరకం చూపించాడు. ఎదురుతిరిగిన ముగ్గురిని కొట్టాడు. దీంతో వారు తల్లిదండ్రులతో కలిసి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.