India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మె స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిందని KTR ట్వీట్ చేశారు. ‘ఈ ఉద్యమానికి నేటితో 14 ఏళ్లు నిండాయి. ఇందులో పాల్గొన్న వారికి ధన్యవాదాలు. 2011, SEP 12న కరీంనగర్ జనగర్జనలో KCR పిలుపు మేరకు యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయ్యింది. ఔర్ ఏక్ ధక్కా.. తెలంగాణ పక్కా అంటూ నినదించింది. నిరసన తెలిపి తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసింది’ అని పేర్కొన్నారు.

ఈస్టర్న్ రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే(SEP 13) చివరితేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, పెయింటర్, లైన్మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ విభాగాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, ఇంటర్, ఉద్యోగాన్ని బట్టి ఐటీఐలో పాసవ్వాలి. వయసు 15-24ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్సైట్: <

ముఖంపై ముడతలు తగ్గాలని చాలామంది ఖరీదైన బొటాక్స్ ట్రీట్మెంట్ల వైపు వెళ్తుంటే మరికొందరు ఫేస్ టేపింగ్ చేసుకుంటారు. దీనివల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫేస్ టేపింగ్ ఎక్కువగా చేసుకుంటే ముఖంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా స్కిన్ కేర్‌పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే చర్మం అందంగా, యవ్వనంగా మెరుస్తుందని సూచిస్తున్నారు.

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన <<17691512>>సుశీల<<>> కర్కీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌లో సోదర, సోదరీమణుల శాంతి, అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అక్కడ Gen-G యువత ఇటీవల హింసాత్మక ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేసి నిరసనకారుల ప్రతిపాదన మేరకు సుశీలను ప్రధానిగా నియమించారు.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. HYD బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,900 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 పెరిగి రూ.1,43,000గా ఉంది. రెండు రోజుల్లో కేజీ సిల్వర్‌పై రూ.3వేలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

2006 ముంబై పేలుళ్ల కేసులో అరెస్టయి 2015లో నిర్దోషిగా విడుదలైన అబ్దుల్ వాహిద్ షేక్ పరిహారం కోరుతూ NHRCని ఆశ్రయించాడు. కస్టోడియల్ టార్చర్ వల్ల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయని, రూ.9CR ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. 2015లో ఈ కేసులో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించగా, మిగిలిన 12 మంది నిందితులను ఈ ఏడాది జులైలో కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో 180+ మంది మరణించారు.

AP: విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 6 లైన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలో వేగవంతమైన రోడ్డుతో అనుసంధానించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమిలి-భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించారు. ఆ మార్గం స్థానిక రాజకీయ నాయకుల స్థలాలకు అనుకూలంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు బీసీసీఐలో కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయనను యాన్యువల్ జనరల్ మీటింగ్(ఏజీఎం)లో తమ ప్రతినిధిగా పంజాబ్ నామినేట్ చేసింది. ఈమేరకు ఆయన ఈనెల 28న జరగనున్న ఏజీఎం మీటింగ్‌కు హాజరుకానున్నారు. అందులో బీసీసీఐ ప్రెసిడెంట్‌తో పాటు ఇతర పోస్టులకు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. మరి భజ్జీని ఏ పదవి వరిస్తుందో చూడాలి.

AP: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై సీఎం CBN కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని, ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతోందని చెప్పారు. SMలో మహిళలపై వ్యక్తిత్వ హననం ఎక్కువవుతోందని వాపోయారు.

TG: ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. మెదక్(D) శభాష్‌పల్లికి చెందిన మమతకు భాస్కర్‌తో వివాహం కాగా పిల్లలు చరణ్(4), తనుశ్రీ(2) ఉన్నారు. భాస్కర్‌తో కలిసి ఉండలేనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమెకు ఫయాజ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. అదేరోజు తనుశ్రీని గొంతునులిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది.
Sorry, no posts matched your criteria.