India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో బాలికపై <<14301232>>అత్యాచార<<>> ఘటనపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సేఫ్ హ్యాండ్ ఎక్కడ పవన్ కళ్యాణ్? అని నిలదీసింది. ‘పిఠాపురంలో దళిత బాలికపై టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త దుర్గాడ జాన్ అత్యాచారం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డల మానప్రాణాలకు రక్షణ కరవైంది. హోంమంత్రిగా నీ చేతగానితనాన్ని చూసి సిగ్గుపడు అనిత’ అని రాసుకొచ్చింది.
హరియాణా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఆధిక్యాలు క్షణక్షణం మారుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యత కనబర్చగా, తర్వాత బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ 42, కాంగ్రెస్ 36 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. మార్జిన్స్ స్వల్పంగా ఉండటంతో ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కు పట్టం కట్టగా ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది.
AP: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వన్ టౌన్ సీఐ తల్లి స్వర్ణకుమారి కిడ్నాప్ వ్యవహారం విషాదాంతమైంది. ఆమెను కిడ్నాపర్ హత్య చేశాడు. ఎదురింట్లో ఉండే వెంకటేశ్ అనే వ్యక్తితో కలిసి SEP 29న ఓ స్వామి వద్ద మంత్రించుకునేందుకు స్వర్ణకుమారి వెళ్లారు. అయితే వీరి మధ్య వివాదం చెలరేగడంతో వెంకటేశ్ ఆమెను కిడ్నాప్ చేసి చంపేశాడు. వెంకటేశ్‌కు ఆమె నగదు ఇచ్చిందని, ఈ విషయంలో గొడవ చెలరేగి హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది.
1987 వన్డే వరల్డ్ కప్ టోర్నీ సరిగ్గా ఇదేరోజు ఇండియా-పాకిస్థాన్ ఆతిథ్యంలో మొదలైంది. ఇది అక్టోబర్ 8 నుంచి నవంబర్ 8 వరకు జరిగింది. అంతకుముందు ఇంగ్లండ్‌లోనే ఈ టోర్నీలు జరిగేవి. అయితే ఈ WC వన్డే క్రికెట్లో కీలక మార్పును తీసుకొచ్చింది. అప్పటివరకు వన్డే మ్యాచులో 60 ఓవర్లు ఉంటుండగా దానిని 50 ఓవర్లకు తగ్గించారు. అప్పటి నుంచి ఇదే కొనసాగుతోంది. ఇక ఈ WCను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
హరియాణా, జమ్మూకశ్మీర్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ జనరల్ సెక్రటరీలతో కాసేపట్లో సమావేశం అవుతారని తెలిసింది. EC ప్రకారం ప్రస్తుతం హరియాణాలో బీజేపీ ఆధిక్యాలు మ్యాజిక్ ఫిగర్ 46ను దాటేశాయి. ఒకవేళ ఇవి మారితే ఏం చేయాలన్న దానిపై చర్చిస్తారని సమాచారం. JKలో ఎలాంటి వ్యూహం అనుసరించాలో ఆలోచిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగట్ ఆధిక్యం కోల్పోయారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేశారు. కాగా ఇప్పటి వరకు ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన వినేశ్‌ను BJP అభ్యర్థి యోగేశ్ కుమార్ వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఆయన 2,039 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
AP: అన్నమయ్య జిల్లా రాజంపేటలో హృదయవిదారక ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో కొడుకు శ్యామ్(5) చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక తల్లి శిరీష తల్లడిల్లింది. ఆస్పత్రిలో మృతదేహం పక్కనే పడుకుని అతడితో మాట్లాడుతూ ఉండిపోయింది. ‘కన్నయ్యా ఎంతసేపు పడుకుంటావు.. నిద్రలే’ అంటూ కలవరించడం అందరినీ కలిచివేసింది. పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని ఆమె చెప్పడంతో తండ్రి, కుటుంబసభ్యులు విలపించారు.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఆన్లైన్ వర్చువల్ బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది. దీనికోసం భక్తులు sabarimalaonline.org వెబ్‌సైట్‌కి వెళ్లి రిజిస్టర్‌పై క్లిక్ చేసి మీ ఫొటోతో వివరాలు ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPతో ఖాతా ధ్రువీకరించి దర్శనానికి వెళ్లే రోజును ఎంచుకుని సబ్మిట్ కొడితే వర్చువల్ క్యూ టికెట్ వస్తుంది. రోజుకు 80వేల మందిని దర్శనానికి అనుమతిస్తారు.
AP: ఇంటర్ మొదటి, రెండో ఏడాది చదివే విద్యార్థులు తప్పనిసరిగా 75 శాతం హాజరు కలిగి ఉండాలని బోర్డు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హాజరు శాతం 60-65గా ఉంటే రూ.2వేలు, 65-70గా ఉంటే రూ.1,500, 70-75గా ఉంటే రూ.వెయ్యి చెల్లించాలన్నారు. 60శాతం కంటే తక్కువ ఉన్న సైన్స్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఆర్ట్స్ విద్యార్థులను ప్రైవేట్‌గా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం మోహినీ అవతారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇటు బ్రహ్మోత్సవాల్లో ఎంతో విశిష్ఠమైన గరుడ వాహన సేవ సాయంత్రం నిర్వహించనున్నారు. గరుడ వాహనంపై ఊరేగే శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు మూడున్నర లక్షల మంది వస్తారని అంచనా. నిన్నటి నుంచే కొండపైకి ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
Sorry, no posts matched your criteria.