India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ వెస్టిండీస్‌కు కొరకరాని కొయ్యగా మారారు. ఆ జట్టుపై ఆడిన 5 టీ20ల్లోనే ఏకంగా 3 సెంచరీలు బాదారు. అలాగే ఓ ఫిఫ్టీ కూడా సాధించారు. ఐదు మ్యాచుల్లో కలిపి సాల్ట్ 456 పరుగులు చేశారు. కాగా సాల్ట్ గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడారు. ప్రస్తుతం అతడిని ఆ జట్టు మెగా వేలానికి వదిలేసింది. వేలంలో అతడు ఎంతకు అమ్ముడుపోవచ్చో కామెంట్ చేయండి.
TG: విజయ డెయిరీకి పాలు విక్రయించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఓ నెల పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం రూ.50.65 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించింది. మరో నెల బకాయిలనూ త్వరలోనే చెల్లిస్తామని తెలిపింది. పాడి రైతుల నుంచి రోజూ 4.40లక్షల లీటర్లను విజయ డెయిరీ కొనుగోలు చేస్తోంది. నిధుల కొరత కారణంగా కొన్ని నెలలుగా చెల్లింపుల్లో ఇబ్బందులు వస్తున్నాయి.
ఉద్యోగులను ఆఫీస్‌కు రప్పించేందుకు TCS బోనస్‌తో లింక్ పెట్టింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కార్యాలయ హాజరు 85 శాతం పైన ఉన్నవారికి పూర్తి వేరియబుల్ పే అందుతుందని ప్రకటించింది. హాజరు 60-75 శాతం ఉంటే 50%, 75-85 శాతం ఉంటే 75% బోనస్ ఇస్తామని తెలిపింది. అదేసమయంలో సీనియర్ ఉద్యోగులు కొందరికి బోనస్‌లో 20-40%, మరికొందరికి 100% కోత విధించినట్లు సమాచారం.
AP: శాసనసభ సమావేశాల అనంతరం కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. తొలిసారి జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. శాఖల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఇప్పటికే సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. కాగా రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్స్ 11 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
AP: వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్‌తో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే ఓ కేసులో వర్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
AP: ఎన్నికల హామీ మేరకు తమను కొనసాగించడంతోపాటు రూ.10వేలకు జీతం పెంచాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. హామీ నెరవేర్చకపోతే అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ అనుబంధ AIYF హెచ్చరించింది. ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్లు లేరని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ విషయంపై త్వరలో సీఎం చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు.
TG: ఎండీ ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో మొదటి దశ ప్రవేశాలకు కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లకు ఇవాళ్టి నుంచి రేపు సా.4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. అలాగే మెడికల్ పీజీ, డిప్లొమా కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in/
ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్(80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన తన ఇంట్లోనే అర్ధరాత్రి మృతి చెందారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా గణేశ్ 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇండియన్2, కాంచన3, అభిమన్యుడు వంటి అనేక సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులనూ అలరించారు.
5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20ఓవర్లలో 182/9 స్కోర్ చేసింది. చేధనకు దిగిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 54 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 రన్స్‌తో మెరుపు శతకం బాదారు. జాకబ్ బెథెల్(58)రాణించారు.
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఇవాంక, కుష్నర్ వైట్‌హౌస్‌లో పని చేశారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు అడ్మినిస్ట్రేషన్‌లో పాలుపంచుకునేలా కనిపించడం లేదు. వాళ్లిద్దరూ ట్రంప్ రాజకీయ ప్రచారాల్లోనూ పాల్గొనలేదు.
Sorry, no posts matched your criteria.