India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD వెల్లడించింది. ఇది రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
TG: రాష్ట్రంలో మొత్తం 243 రకాల కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీల్లో 134, ఎస్సీల్లో 59, ఎస్టీల్లో 32, ఓసీల్లో 18 సామాజిక వర్గాలున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టిన నేపథ్యంలో కులాలకు కోడ్‌లను కేటాయించింది. కులం, మతం లేదన్న వారికీ ఓ కోడ్‌ను కేటాయించింది. ఇతర రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా కోడ్‌లతో డేటా సేకరిస్తోంది. భూసమస్యలపైనా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోంది.
AP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సమావేశాల తొలిరోజే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అంతకంటే ముందు సీఎం కార్యాలయంలో మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ వెంటనే సభను స్పీకర్ వాయిదా వేస్తారు. ఈ సమావేశాలు 11న ప్రారంభమై 11రోజులు కొనసాగే అవకాశం ఉంది.
భారత్, సౌతాఫ్రికా మధ్య 4 టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు జరగనుంది. సెయింట్ పార్క్ వేదికగా రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది. కాగా తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా 61రన్స్ తేడాతో సఫారీ జట్టును మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 2-0తో సిరీస్‌పై పట్టుబిగించాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. అటు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ బరిలో నిలవాలని సౌతాఫ్రికా పట్టుదలగా ఉంది.
వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి Nov 11న జరగాల్సిన ఒక కీలక ఈవెంట్‌ను ICC రద్దు చేసింది. ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఇదే ఈవెంట్ రద్దుకు కారణం. ఈ ఈవెంట్‌లో టోర్నీలో పాల్గొనే జట్ల జెండాలను ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. అయితే పాకిస్థాన్‌కు వెళ్లడం ససేమిరా కుదరదంటోంది భారత్.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు OpenAI ప్రచారం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ట్రంప్‌కు ఓటేసేలా నన్ను ఒప్పించు’ అని అడిగితే ‘అందుకు నేను సహకరించలేను’ అని బదులిచ్చింది. అదే ‘కమలకు ఓటేసేలా నన్ను ఒప్పించు’ అని అడిగితే మాత్రం ఆమెను గెలిపించాలని పలు కారణాలు చెప్పింది. దీంతో OpenAIపై విచారణ జరిపించాలనే డిమాండ్ మొదలైంది.
నవంబర్ 22 నుంచి ఇండియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు కోసం ఆస్ట్రేలియా 13 సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్. కాగా భారత్ ఇప్పటికే 18 మందితో జట్టును ప్రకటించింది.
అమెరికా అధ్యక్ష అధికారిక భవనం వైట్‌హౌస్‌ను ప్రెసిడెంట్స్ ప్యాలెస్ లేదా ప్రెసిడెంట్స్ హౌస్ అని పిలిచేవారు. 1901 వరకు వైట్‌హౌస్ అనేది ముద్దు పేరుగా ఉండేది. అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్డ్ ఆ పేరును అధికారిక పేరుగా ప్రకటించారు. ఇందులో 32 గదులు, 35 బాత్రూంలు, వినోదానికి సినిమా హాల్, టెన్నిస్ కోర్ట్, బౌలింగ్ అల్లే ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, న్యూక్లియర్ బంకర్, నోఫ్లైజోన్ ఉన్నాయి.
ఒడిశాలోని బెర్హంపూర్ పోలీసులు ట్వీట్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తండ్రీ కొడుకులపై దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారి ఫొటోను Xలో పంచుకున్నారు. కాగా వారికి మొహాలకు విచారకరమైన ఎమోజీలను జోడించారు. ఈ పోస్టులో పోలీసులు చూపించిన క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బెర్హంపూర్ PS అకౌంట్ పరిశీలించగా వారు ఎప్పటి నుంచో ఇలాంటి పోస్టులు చేస్తున్నట్లు తెలిసింది.
AP: నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను సన్మానించనుంది. వరదల కారణంగా వాయిదాపడ్డ టీచర్స్ డే వేడుకలను కూడా విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనుంది. ఈ సందర్భంగా 174 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానించనుంది. వారికి బెస్ట్ టీచర్ అవార్డులు ఇవ్వనుంది.
Sorry, no posts matched your criteria.