India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విరాట్ కాస్త ఓపిగ్గా ఆడితే మంచి ప్రదర్శన చేస్తాడని, అతడి ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. దేశం కోసం ఆడేటప్పుడు మ్యాచ్‌లు గెలవడమే ఏ ఆటగాడికైనా స్ఫూర్తి అని చెప్పారు. భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన కోహ్లీకి అది తెలుసని భావిస్తున్నానన్నారు. అసలు సమరం సూపర్-8, సెమీస్, ఫైనల్ రూపంలో ముందుందని చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లో గత 4రోజులుగా నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ తాజాగా ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. అక్కడి భద్రతా ఏర్పాట్ల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఉగ్ర ముప్పును తుద ముట్టించేలా పూర్తిస్థాయిలో బలగాల్ని మోహరించాలని PM వారికి తేల్చిచెప్పినట్లు సమాచారం. రియాసీ జిల్లాలో హిందూ భక్తులపై ఈ నెల 9న ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా మరో నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు. కాగా ఈ కేసుల్లో ఆయనను జూన్ 20 వరకు అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా లివర్ దెబ్బతింటుంది. మరి ఆ ప్రమాదాన్ని తగ్గించేలా ఓ మందు తయారు చేస్తే.. ఇదే ఆలోచనతో స్విట్జర్లాండ్ సైంటిస్టులు ఓ ప్రొటీన్ జెల్‌ను సృష్టించారు. ఇది రక్తంలోకి ఆల్కహల్ ప్రవేశించే ముందే దానిని హాని కలిగించని ఎసిటిక్ యాసిడ్‌గా మారుస్తుందట. ఆల్కహాల్ విచ్ఛిన్నత ప్రక్రియను లివర్‌లో కాకుండా జీర్ణవ్యవస్థలో జరిగేలా చేస్తుందట. దీనిపై మరిన్ని పరీక్షలు చేస్తున్నారు.
AP: సీఎం చంద్రబాబు సచివాలయానికి బయల్దేరారు. భారీ హోర్డింగ్‌లు, గజమాలలతో ఆయనకు దారిపొడవునా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నినాదాలతో హోరెత్తించారు. సీఎం మార్గమధ్యలో తన కాన్వాయ్‌ని ఆపి వారితో మాట్లాడారు. చంద్రబాబు సరిగ్గా సా.4.41 నిమిషాలకు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
TG: మాజీ సీఎం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై కాసేపటి క్రితమే ఈడీ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు, వెంకట్రామి రెడ్డిలకు ముందు ముసళ్ల పండగేనని అన్నారు.
ధనిక దేశాల కూటమి ‘G7’లో సభ్యత్వం లేకున్నా ప్రధాని మోదీ సదస్సులో పాల్గొంటున్నారు. జూన్ 13-15 మధ్య జరిగే ఈ సదస్సు కోసం ఇప్పటికే ఇటలీ వెళ్లారు. దీనికి ఆతిథ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు మోదీ ఇందులో పాల్గొంటున్నారు. తాజా సదస్సులో గాజా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. కాగా ‘G7’లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, USA సభ్య దేశాలుగా ఉన్నాయి.
NEET-2024లో కొందరికి కలిపిన <<13431802>>గ్రేస్ మార్కు<<>>లను కేంద్రం రద్దు చేసింది. కొన్ని కేంద్రాల్లో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైందని, ఆ కారణంగా సమయం కోల్పోయిన 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల తెలిపింది. గతంలో కామన్ లా అడ్మిషన్ టెస్టు సందర్భంగా సమయం కోల్పోయిన వారి విషయంలో సుప్రీం సూచించిన ఫార్ములానే ఇప్పుడు వర్తింపజేసినట్లు పేర్కొంది.
AP: రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు చెప్పారు. ‘అంకితభావంతో, నిస్వార్థంగా అండగా ఉన్న జనసైనికులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సమన్వయ ప్రయత్నాలను అర్థం చేసుకొని మద్దతుగా నిలిచిన టీడీపీ, బీజేపీ సభ్యులకూ కృతజ్ఞతలు. తెనాలి ప్రజల అభిమానానికి ఎప్పుడూ రుణపడి ఉంటా. రాష్ట్ర భవిష్యత్తు కోసం సమష్టిగా కృషి చేద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.
సినీరంగంతో పోలిస్తే రాజకీయాలు కష్టమని ఎంపీ కంగనా రనౌత్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఒకప్పుడు మా ముత్తాత ఎమ్మెల్యేగా చేశారు. రాజకీయాల్లోకి రావాలంటూ నాకూ ఆఫర్లు వచ్చాయి. సరైన సమయం కోసం ఆగాను. నటుల జీవితం ఒత్తిడిలేనిది. కానీ రాజకీయాల్లో ఎంతోమంది సమస్యలతో వస్తుంటారు. వాటిని జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. హిమాచల్‌లోని మండి నుంచి ఆమె బీజేపీ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.