News January 2, 2025

రోహిత్ పోరాడాల్సిన సమయం ఇది: పఠాన్

image

BGT చివరి టెస్టుకు రోహిత్ శర్మ దూరమవుతారని వస్తోన్న వార్తలపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. ‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ ఈ దశలో పోరాడాలి. అతను బయటకు రావాలని కోరుకోవట్లేదు. భారత క్రికెట్‌కు రోహిత్ ఎంతో చేశారు. ఈ పరిస్థితులను తిప్పికొట్టే సామర్థ్యం ఆయనకు ఉంది. ఇది సిరీస్‌లో కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సిరీస్ తర్వాతే బయటకు రావాలి’ అని ఆయన సూచించారు.

News January 2, 2025

జ్యోతి యర్రాజీ నేపథ్యమిదే..

image

పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటిన జ్యోతి యర్రాజీకి కేంద్రం <<15045760>>అర్జున<<>> అవార్డు ప్రకటించింది. వైజాగ్‌కు చెందిన ఈ పరుగుల రాణి 1999 ఆగస్ట్ 28న జన్మించారు. స్థానికంగానే విద్యాభ్యాసం చేశారు. 25 ఏళ్లకే అనేక జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు. 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు(12.78 సెకన్లు) ఇంకా ఆమె పేరిటే ఉంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో రజతం, WUGలో కాంస్యం సాధించారు.

News January 2, 2025

ఈ చిన్న మార్పులు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి!

image

మారిన జీవనశైలి వల్ల వచ్చే 42% క్యాన్సర్లను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మద్యపానం & ధూమపానం మానుకుంటే, వీటివల్ల వచ్చే 19% క్యాన్సర్లు నివారించవచ్చు. అధిక బరువు ఉంటే తగ్గించుకోండి. శారీరకంగా చురుకుగా ఉండండి. పోషక ఆహారాన్ని తీసుకోండి. అధిక సూర్యరశ్మి వల్ల అనేక చర్మ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ధూమపానం చేసేవారిని స్క్రీనింగ్ చేయడం ద్వారా లంగ్ క్యాన్సర్‌ను ముందే గుర్తించి చికిత్స చేయొచ్చు.

News January 2, 2025

శుభ్‌మన్ గిల్‌కు CID నోటీసులు

image

గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, మోహిత్ శర్మ, రాహుల్ తెవాటియాకు గుజరాత్ CID నోటీసులు అందించింది. పొంజి స్కీమ్‌లో జరిగిన రూ.450 కోట్ల అవకతవకలపై వీరికి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరందరిని CID అధికారులు ప్రశ్నిస్తారని సమాచారం. వీరందరూ ఈ చిట్ ఫండ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు నిర్థారించారు. గిల్ రూ.1.95 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు గుర్తించారు.

News January 2, 2025

తెలుగు తేజాలకు అర్జున పురస్కారాలు

image

కేంద్రం ప్రకటించిన క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాలు ఇద్దరు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిలకు అర్జున అవార్డులు ఇవ్వనున్నట్లు కేంద్ర క్రీడల శాఖ కాసేపటి క్రితం పేర్కొంది. దీప్తిది ఉమ్మడి వరంగల్ జిల్లా కాగా.. జ్యోతి విశాఖ వాసి.

News January 2, 2025

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’?

image

AP: ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రివర్గం చర్చించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ స్కీం అమలు చేయాలని చర్చించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయనున్నారు. కాగా ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికీ ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు అందించనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో తెలిపింది.

News January 2, 2025

మనూ భాకర్, గుకేశ్‌లకు ఖేల్ రత్న

image

ఊహాగాల‌నాల‌కు తెర‌దించుతూ స్టార్ షూట‌ర్ మ‌నూభాక‌ర్‌కు కేంద్ర ప్ర‌భుత్వ ఖేల్ ర‌త్న అవార్డు ప్ర‌క‌టించింది. అవార్డుకు ద‌ర‌ఖాస్తు విషయమై మనూ భాకర్‌కు అవార్డుల కమిటీకి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వ‌ర‌ల్డ్‌ చెస్ ఛాంపియ‌న్ గుకేశ్ దొమ్మరాజు, పారా అథ్లెట్ ప్ర‌వీణ్ కుమార్‌, హాకీ ప్లేయ‌ర్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్‌ల‌కూ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. ఈ నెల 17న ప్రదానం చేయనున్నారు.

News January 2, 2025

BREAKING: మరోసారి భూప్రకంపనలు

image

AP: ప్రకాశంలో మరోసారి భూప్రకంపనలు కలకలం రేపాయి. ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో సెకన్ పాటు భూమి కంపించింది. భయాందోళనలకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

News January 2, 2025

తొక్కిసలాట ఘటనపై బాలీవుడ్ నిర్మాత ఏమన్నారంటే?

image

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ను నిందించాల్సిన అవసరం లేదని నిర్మాత బోనీ కపూర్ అన్నారు. జనాలు ఎక్కువ మంది రావడంతోనే ఈ ఘటన జరిగిందని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో ప్రేక్షకులకు హీరోలపై అభిమానం ఎక్కువని తెలిపారు. రజినీ కాంత్, చిరంజీవి, మహేశ్ బాబు వంటి స్టార్ల సినిమాలకు అభిమానులు ఇలానే వస్తారన్నారు. కాగా తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదలయ్యారు.

News January 2, 2025

ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

image

AP: చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు, అమరావతిలో రూ.2,733 కోట్ల పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు భవన నిర్మాణాలు, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో 19 పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచడం, పత్తిపాడులో 100 పడకల ఈఎస్ఐ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.