India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి! చీలిపోయిన NCPని మళ్లీ ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే జరిగితే లోక్‌సభలో NDAకు కొత్తబలం రావడం ఖాయం. ప్రస్తుతం ఈ కూటమికి 293 ఎంపీలు ఉన్నారు. INDIA కూటమిలోని NCP SPకి 8 మంది సభ్యులున్నారు. NCP కలిస్తే వారంతా అధికార పక్షం వైపు వస్తారు. దీంతో NDA బలం 301కి పెరుగుతుంది. చెరకు రైతుల సమస్యలంటూ ఈ మధ్యే మోదీతో శరద్ పవార్ ప్రత్యేకంగా భేటీ అవ్వడం గమనార్హం.

TG: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు మరి కొంత గడువు కావాలని ఈడీకి మెయిల్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలోనే మరో తేదీని వెల్లడిస్తామన్నారు.

భాగమతి ఫేమ్ ఉన్ని ముకుందన్ నటించిన మలయాళ మూవీ ‘మార్కో’ పైరసీ బారిన పడింది. థియేటర్లలో ఉండగానే మూవీ ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. దీనిపై ముకుందన్ అసహనం వ్యక్తం చేశారు. మూవీ పైరసీ కావడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి పైరసీ మూవీని చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ యాక్షన్ మూవీ కేరళలో మంచి టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో నిన్న విడుదలైంది.

మహారాష్ట్రలో కుటుంబ కథా రాజకీయ డ్రామా కొనసాగుతోంది. చీలిన NCP మళ్లీ ఒక్కటయ్యేందుకు బీజం పడ్డట్టే కనిపిస్తోంది. 2 వర్గాల MP, MLAలు ఇదే రాగం ఆలపిస్తున్నారు. శరద్ పవార్ తనకు దేవుడని, తన ఛాతీని చీలిస్తే ఆయనే కనిపిస్తారని అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ అన్నారు. మళ్లీ కుటుంబం, పార్టీ కలవాలని అజిత్ తల్లి ఆశాథాయి పండరీపురి విఠలుడిని వేడుకున్నారు. త్వరలోనే శరద్‌ను కలిసి విషయం ప్రతిపాదిస్తానని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ తిరిగి ఆ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జనవరి చివరి వారంలో శ్రీలంక వెళ్లనున్న టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఆసీస్ 2 టెస్టులు, ఒక వన్డే ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ పితృత్వ సెలవుల్లో ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. BGT సిరీస్‌లో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన స్మిత్ నిలకడగా రాణిస్తున్నారు.

AUSతో జరగనున్న 5వ టెస్టుకు IND తుది జట్టు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందులో 2,3 కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. రోహిత్ స్థానంలో గిల్, పంత్ ప్లేస్‌లో జురెల్ రావొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వెన్నునొప్పితో మ్యాచ్‌కు దూరమైన ఆకాశ్‌దీప్ స్థానంలో హర్షిత్ ఆడనున్నారు.
జట్టు: రాహుల్, జైస్వాల్, రోహిత్/గిల్, కోహ్లీ, పంత్/జురెల్, జడేజా, నితీశ్, సుందర్, హర్షిత్, బుమ్రా, సిరాజ్.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగించడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ASP తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తును తాము అడ్డుకోవాలని అనుకోవడం లేదని, తిరుపతన్న పాత్రపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

బుల్స్ పార్టీ మూడ్‌లో ఉండటంతో బెంచ్‌మార్క్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. నిఫ్టీ 24,045 (+303), సెన్సెక్స్ 79,514 (+1000) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.5L కోట్లమేర సంపదను పోగేశారు. మెరుగైన GST రాబడి, అనుకూల టెక్నికల్స్, Q3 ఫలితాలపై సానుకూల అంచనాలు, IT సెక్టార్ బూస్ట్ ఇవ్వడం, వినియోగం పెరుగుతుందన్న అంచనాలే ఇందుకు కారణాలు. AUTO, FINANCE, IT షేర్లు దుమ్మురేపుతున్నాయి. bajajfinsv 8% పెరిగింది.

మధ్యాహ్నం భోజనం తర్వాత అప్పుడప్పుడూ కొంత మొత్తంలో స్వీట్ తింటే ఫర్వాలేదు. కానీ రోజూ లేదా ఎక్కువ మోతాదులో లాగిస్తే ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు చెబుతున్నారు. అధిక మోతాదులో స్వీట్స్/డెజర్ట్స్ తిన్నాక యాక్టివ్‌గా ఉండలేము. పైగా రక్తంలో త్వరగా షుగర్ లెవల్ పెరగడం, జీర్ణ, దంత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అటు భోజనం+ కూల్‌డ్రింక్స్ కాంబినేషన్‌తో తాత్కాలిక ఉపశమనం లభించినా మంచి కంటే చెడు ఎక్కువ.

శ్రీలంకతో జరిగిన మూడు T20ల సిరీస్‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన 3వ మ్యాచ్‌లో శ్రీలంక 7 పరుగుల తేడాతో గెలుపొందినా తొలి 2 మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ కప్ దక్కించుకుంది. కాగా, 3వ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు విరుచుకుపడగా 25 సిక్సులు నమోదయ్యాయి. శ్రీలంక 218 రన్స్, న్యూజిలాండ్ 211 పరుగులు చేశాయి. శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా 44బంతుల్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.