India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: వచ్చే ఏడాది(2025)కి గానూ రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ఖరారు చేసింది. 27 సాధారణ సెలవులు (జనరల్ హాలిడేస్), 23 ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) ఉండనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు జీవో జారీ చేసింది. సెలవుల వివరాలకు పైన ఫొటోలో చూడండి.
AP: ప్రవచనకర్త, వివాదరహితుడు చాగంటి కోటేశ్వరరావుకు ప్రభుత్వం ‘స్టూడెంట్స్-నైతిక విలువల’ <<14567991>>సలహాదారుగా<<>> క్యాబినెట్ ర్యాంకు పదవి ఇచ్చింది. అయితే ఆయన దాన్ని తీసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2016లో టీడీపీ ప్రభుత్వం క్యాబినెట్ హోదాతో, 2023లో వైసీపీ ప్రభుత్వం టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటిని నియమించింది. అయితే వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించారు.
AP: మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే గంజాయి విశాఖ నడిబొడ్డుకు చేరింది. కింగ్జార్జ్ హాస్పిటల్(KGH) కొండ ప్రాంతంలోని లేడీస్ హాస్టల్ వెనుక దుండగులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని పండించి విద్యార్థులకు అమ్ముతున్నారు. వైజాగ్ నేవీ కంట్రోల్లో ఉండే ఈ చోట గంజాయి సాగు కొనసాగుతుండటంతో పోలీసులు షాకయ్యారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: తాడేపల్లి ప్యాలెస్లో పెన్, పేపర్ల కోసం మాజీ సీఎం జగన్ రూ.9.84 కోట్లు ఖర్చు పెట్టారని మంత్రి నారా లోకేశ్ Xలో వెల్లడించారు. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. ‘ఏపీ విద్యార్థులకు నాదొక ప్రశ్న.. మీ పెన్ ఖరీదు ఎంత? జగన్ ఏం రాసి ఉంటారని మీరు అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కోచ్గా జావెలిన్ లెజెండ్ జాన్ జెలెజ్నీ నియమితులయ్యారు. నీరజ్ టెక్నిక్, పెర్ఫార్మెన్స్ను మెరుగుపరిచేందుకు ఆయన ట్రైనింగ్ ఇవ్వనున్నారు. చెక్ రిపబ్లిక్కు చెందిన జెలెజ్నీ ఒలింపిక్స్లో మూడు గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ సాధించారు. మూడు సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు. జావెలిన్ను అత్యధిక దూరం(98.48మీ) విసిరిన రికార్డు ఆయన పేరిటే ఉంది.
TG: సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమైనా పాకిస్థానా? అని ప్రశ్నించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చివేతలను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సన్న వడ్లకే బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలేదని విమర్శించారు.
TG: సాధారణంగా ఒక గ్రామంలో ఒకే పేరుగల వ్యక్తులు మహా అయితే 10 మంది ఉంటారేమో. కానీ ఆ ఊరిలో ఒకే పేరుతో 200మంది ఉన్నారు. అదే జనగామ(D) లింగాలఘణపురం. త్రేతాయుగం నుంచే ఇక్కడ శ్రీరామచంద్రస్వామి ఆలయం ఉంది. దీంతో గ్రామస్థుల్లో చాలామంది ‘రాములు’ అనే పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఆ ఊరిలో ఏకంగా 200 మంది ఒకే పేరు పెట్టుకోవడం విశేషం. ఈ తరం పిల్లలకు రాములు అని కాకుండా ‘ర’ అక్షరంతో పేర్లు పెడుతున్నారు.
అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2 మూవీ రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. USA ప్రీమియర్స్కు అత్యంత వేగంగా 20K+ టికెట్లు అమ్ముడుపోయిన భారతీయ చిత్రంగా ఘనత సాధించినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా, USలో ఓ రోజు ముందే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంలో చిన్న కొడుకు బ్యారన్ ట్రంప్ కీలకంగా వ్యవహరించారు. 18 ఏళ్ల ఈ సైలెంట్ స్ట్రాటజిస్ట్ యంగ్, న్యూ ఓటర్లను ఆకర్షించేలా క్యాంపెయిన్ వ్యూహలు అమలు చేశారని సమాచారం. జో రోగన్, లోగన్ పాల్ షోల్లో పాల్గొనేలా చేశారు. అమెరికన్ యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే నెల్క్ బాయ్స్, హాట్ గయ్స్ వంటి పాడ్కాస్టుల్లో మాట్లాడించారు. డెమోక్రాట్లను వాళ్ల ఆటలోనే ఓడించారు.
కిరణ్ నేగి అనే మహిళ నోయిడా(UP)లోని ఆసుపత్రిలో గర్భాశయంలో కణితి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నారు. తర్వాత ఆమెకు కడుపునొప్పి మొదలైంది. వైద్యులను సంప్రదించినా సరిగా స్పందించలేదు. గతేడాది మరో ఆసుపత్రికి వెళ్లగా కడుపులో 9 అంగుళాల ప్లాస్టిక్ పైపు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు దాన్ని తొలగించారు. తొలుత చేసిన సర్జరీ వైద్యులు తన కడుపులో ప్లాస్టిక్ బ్యాగ్ పైపు వదిలేశారని కిరణ్ వాపోయారు. వారిపై కేసు వేశారు.
Sorry, no posts matched your criteria.