India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 3 కంపార్ట్‌మెంట్లలో స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వర స్వామిని 69,630 మంది దర్శించుకోగా, 18,965 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది.

AP: ప్రధాని మోదీ ఈనెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇదే వేదికగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో NTPC నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌కు శంకుస్థాపన, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు ఈనెల 4న నిర్వహించనున్న నేవీ డే పరేడ్, 8న PM సభలోనూ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ‘పుష్ప-2’ నిర్మాతలు రవిశంకర్, నవీన్‌కు ఊరట లభించింది. వారిని అరెస్ట్ చేయరాదంటూ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు థియేటర్ వద్ద లాఠీఛార్జ్ ఘటనపై పోలీసులకు NHRC నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అమెరికాలో ఉగ్రవాది ట్రక్కుతో ఢీ కొట్టి కాల్పులు జరిపిన ఘటన మరువక ముందే ఈసారి ఐరోపాలో తుపాకీ గర్జించింది. మాంటినెగ్రోలో ఓ సాయుధ దుండగుడు కాల్పులకు తెగబడి 10మందిని హత్య చేశాడు. వారిలో అతడి కుటుంబీకులు కూడా ఉండటం గమనార్హం. నిందితుడిని కో మార్టినోవిక్(45)గా గుర్తించామని, అతడి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. బార్‌లో చోటుచేసుకున్న ఘర్షణ కాల్పులకు దారి తీసిందని వెల్లడించారు.

TG: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆఖరి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేల కోట్ల రుణాన్ని సమీకరించనుంది. ఇప్పటికే సర్కారు వద్ద రూ.10వేల కోట్లుండగా.. ఎఫ్ఆర్‌బీఎం కింద జనవరి, ఫిబ్రవరి, మార్చిలో నెలకు రూ.10వేల కోట్ల చొప్పున రుణం తీసుకోనుంది. ఈ మొత్తాన్ని రైతు భరోసా, సర్పంచుల బిల్లుల చెల్లింపు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

AP: గోదాముల వ్యవహారాల గురించి తనకు అసలు తెలియదని పేర్ని నాని సతీమణి జయసుధ పోలీసులు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వ్యవహారాలన్నీ తమ మేనేజర్ మానస తేజ చూసుకునేవారని ఆమె అన్నట్లు సమాచారం. గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయమైన కేసులో ఆమె ఏ-1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదుల సమక్షంలో సుమారు రెండున్నర గంటల పాటు ఆమెను పోలీసులు విచారించారు.

TG: CMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ <<15041575>>కేసులో<<>> కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు హాస్టల్ సిబ్బందికి చెందిన 12 ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవి SMలో లీక్ అయితే MLA మల్లారెడ్డే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు.

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షలు నేడు ప్రారంభమై ఈనెల 20 వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే పరీక్షలకు 17 జిల్లాల్లో 92 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1కు 94వేల మంది, పేపర్-2కు 1.81 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

AP: విజయవాడ MG రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేడు 35వ పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది. సాయంత్రం 6గంటలకు Dy.CM పవన్ ప్రారంభించనున్నారు. 290కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. పుస్తకావిష్కరణ వేదికకు రామోజీరావు, చిన్నారుల కార్యక్రమాలు నిర్వహించే వేదికకు రతన్ టాటా పేరు పెట్టారు. ఇవాళ్టి నుంచి 12వ తేదీ వరకు రోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుంది.

వ్యవసాయంపై కేంద్ర క్యాబినెట్ నిన్న <<15038464>>చర్చించిన<<>> విషయం తెలిసిందే. ఈక్రమంలోనే PM కిసాన్ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్లు ప్రచారం జరిగింది. అయితే క్యాబినెట్‌లో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. FEB 1న ప్రవేశపెట్టే బడ్జెట్ నాటికి సాయం పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతల్లో ఏటా రూ.6వేలు ఇస్తుండగా దీన్ని రూ.10వేలకు పెంచాలనే డిమాండ్ ఉంది.
Sorry, no posts matched your criteria.