India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వాళ్లను విచారించాల్సి ఉందని, బెయిల్ ఇవ్వొద్దన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. వారి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం వారు చంచల్గూడ జైలులో ఉన్నారు.
AP CMగా చంద్రబాబు, మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వేదికపై మోదీ-చిరంజీవి-పవన్ అభివాదం, మోదీ-చంద్రబాబు-పవన్ సంభాషణ, మోదీని చంద్రబాబు ఆత్మీయంగా హత్తుకోవడం, సోదరుడు పవన్ను చూసి చిరంజీవి ఆనందంతో ఉప్పొంగడం, అమిత్షా-బాలయ్య-రజనీకాంత్ ముచ్చట్లు, చిరంజీవి-బాలకృష్ణ స్టేజ్పై కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇవాళ జరిగే మ్యాచ్ ఓ రకంగా భావోద్వేగంతో కూడుకున్నదేనని మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ అన్నారు. USA-టీమ్ ఇండియా మ్యాచును ఇండియా vs మినీ ఇండియాగా వర్ణించారు. అమెరికా జట్టులో భారత సంతతి క్రికెటర్లు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. కాగా భారత్తో మ్యాచులో మెరుగైన ప్రదర్శన చేస్తే USA ఆటగాళ్లపై ప్రశంసలు వెల్లువెత్తుతాయని బాలాజీ చెప్పారు. అమెరికాలో క్రికెట్ వ్యాప్తికి ఇది ఉపయోగపడుతుందన్నారు.
నిన్నటి ఫుట్బాల్ మ్యాచులో ఖతర్ చేసిన వివాదాస్పద <<13424003>>గోల్<<>>పై ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్(AIFF) చీఫ్ కళ్యాణ్ చౌబే అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పరిశీలన చేయాలని కోరుతూ FIFA, AFCకి ఫిర్యాదు చేశారు. అనవసరంగా గోల్ ఇచ్చిన రిఫరీ కిమ్ వూ సూంగ్(ద.కొరియా)పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ మ్యాచులో ఓటమితో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మూడో రౌండ్ చేరాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి.
ఎర్రకోటపై దాడి ఘటనలో దోషిగా తేలిన ఉగ్రవాది మహమ్మద్ అరీఫ్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. 24 ఏళ్ల క్రితం ఎర్రకోటపై లష్కరే తోయిబా ఉగ్రసంస్థ చేసిన దాడిలో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. ఈ దాడిలో దోషిగా తేలిన మహ్మద్ అరీఫ్కు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ఉరిశిక్ష నుంచి మినహాయింపు(క్షమాభిక్ష) ఇవ్వాలని అరీఫ్ ముర్మును ఆశ్రయించారు.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X(ట్విటర్) తమ యూజర్ల కోసం మరో ప్రైవసీ ఆప్షన్ను తీసుకురానుంది. ప్రైవేట్ లైక్స్ ఆప్షన్ను అందుబాటులోకి తేనున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీని ద్వారా పోస్ట్ పెట్టిన వ్యక్తికి తప్ప ఇతరులకు ఎవరు లైక్ కొట్టారనేది కనిపించదు. ఈ వారంలోనే ఈ ఫీచర్ను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. కాగా ఈ ఫీచర్ ఇప్పటికే ప్రీమియర్ సబ్స్క్రైబర్లకు అందుబాటులో ఉంది.
ఈ నెల 24న 18వ లోక్సభ కొలువుదీరనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. జులై 3వరకు జరిగే సమావేశాల్లో నూతన సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం, ముఖ్య అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. 264వ రాజ్యసభ సెషన్ ఈ నెల 27న ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అదే రోజున రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు.
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను TGPSC విడుదల చేసింది. జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించగా, అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు HYDలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయని తెలిపింది. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షల షెడ్యూల్ పైనున్న ఫొటోల్లో చూడవచ్చు.
సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రేపు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9:45 గంటలకు తెలంగాణ భవన్లో అంబేడ్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత బంగ్లాసాహిబ్ను సందర్శిస్తారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఆయనకు కేటాయించిన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు.
భారత పేసర్ శార్దూల్ ఠాకూర్కు సర్జరీ జరిగింది. చీలమండ గాయానికి లండన్లో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని శార్దూల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. 2019 ఐపీఎల్ సమయంలో ఈ గాయం అవగా ప్రస్తుతం సర్జరీ అనివార్యం కావడంతో చేయించుకున్నారు. శార్దూల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
Sorry, no posts matched your criteria.