News June 12, 2024

మస్క్ మహిళా ఉద్యోగులను వేధించారు: WSJ

image

స్పేస్ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్‌ మహిళా ఉద్యోగులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. తనతో పిల్లల్ని కనాలని ఓ ఉద్యోగిని వేధించారని, కాదన్నందుకు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొంది. వేధింపులు తట్టుకోలేక వారు రాజీనామా చేసినట్లు తెలిపింది. 48 మందిని ఇంటర్వ్యూ చేసి కథనాన్ని ప్రచురించినట్లు WSJ వెల్లడించింది. కాగా మస్క్‌పై ఆఫీసులో డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

News June 12, 2024

న్యూయార్క్ స్టేడియం కూల్చివేస్తారా?

image

భారత్-యూఎస్ఏ మధ్య జరిగే మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు స్టేడియానికి చివరిదిగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ అనంతరం స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు సమాచారం. కాగా టీ20 వరల్డ్ కప్ కోసమే ఈ స్టేడియాన్ని నిర్మించారు. రూ.240 కోట్లతో మూడు నెలల్లోనే దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్‌లు ఏర్పాటు చేశారు. టోర్నీలో ఈ మైదానంలో అన్ని మ్యాచ్‌లూ లోయెస్ట్ టోటల్‌తోనే ముగిశాయి.

News June 12, 2024

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా

image

జనసేనాని మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వేళ ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను…’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను డైరెక్టర్ హరీశ్ శంకర్ అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో ‘సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే..’ అని రాసి ఉంది.

News June 12, 2024

గోపీచంద్ ‘విశ్వం’ నుంచి పోస్టర్ రిలీజ్

image

గోపీచంద్ తొట్టెంపూడి హీరోగా నటిస్తున్న ‘విశ్వం’ మూవీ నుంచి పోస్టర్ విడుదలైంది. గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో గోపీచంద్ మేకోవర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

News June 12, 2024

Breaking: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

image

TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు 2,36,487 మంది హాజరయ్యారు. డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

News June 12, 2024

నేను డైలమాలో ఉన్నా: రాహుల్ గాంధీ

image

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేశామని రాహుల్ గాంధీ అన్నారు. కేరళలో రోడ్ షోలో మాట్లాడుతూ వయనాడ్ నుంచి తనను రెండో సారి ఎంపీగా గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను వయనాడ్ ఎంపీగా కొనసాగాలా లేక రాయ్‌బరేలీ ఎంపీగా ఉండాలా అనే విషయంలో డైలమాలో ఉన్నానని చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు

News June 12, 2024

చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ అభినందనలు

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడికి ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. ‘మీ దార్శనికతతో కూడిన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని కచ్చితంగా నమ్ముతున్నా. మీ అందరికి విజయం చేకూరాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 12, 2024

నిర్మల 2.0లో సెన్సెక్స్ టార్గెట్ లక్ష!

image

కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 మే 31న నిర్మల తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సెన్సెక్స్ 39,700 వద్ద ఉంది. అది కాస్త 93% పెరిగి 77వేల మార్క్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రెండో టర్మ్‌లోనూ మార్కెట్లు దూసుకెళ్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. FY28కు లక్ష మార్క్ దాటుతుందని జోస్యం చెబుతున్నారు.

News June 12, 2024

మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రాజకీయ నేపథ్యం

image

* 2003లో రాజకీయ ప్రస్థానం మొదలు
* 2024లో తొలిసారి ఎమ్మెల్యేగా రాయచోటి నుంచి ఎన్నిక
* రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం
* తండ్రి మండిపల్లి నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే.. రాయచోటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1985, 1989లో గెలుపు
* సోదరుడు నారాయణ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే (1993, 1994)

News June 12, 2024

పయ్యావుల కేశవ్ పొలిటికల్ ప్రొఫైల్

image

*1994లో ఎన్టీఆర్ పిలుపుతో తొలి సారి ఉరవకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
*1994, 2004, 2009, 2019, 2024లో విజయాలు. 1999, 2014లో అపజయాలు.
*2015-19 వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ.
*1999 మినహా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గెలవలేదు. దీంతో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కలేదు.
*మంచి సబ్జెక్టు, వాగ్ధాటితో కీలక నేతగా గుర్తింపు