News October 6, 2024

బీజేపీకి ఓటు వేయాలని కోరిన డేరా చీఫ్

image

అత్యాచారం కేసులో పెరోల్‌పై విడుద‌లైన డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ హ‌రియాణా ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓటు వేయాల్సిందిగా త‌న మ‌ద్ద‌తుదారుల‌ను కోర‌డం వివాదం రేపింది. సిర్సాలోని స‌త్సంగ్‌లో శ‌నివారం జ‌రిగిన స‌మావేశంలో బ‌హిరంగంగా కాకుండా స‌మూహంలో క‌లిసిపోయిన‌ త‌న అనుయాయుల ద్వారా బీజేపీకి ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల్ని కోరారు. ప్ర‌తిఒక్క‌రూ ఐదుగురిని పోలింగ్ బూత్‌కు త‌ర‌లించాల‌ని కూడా కోరిన‌ట్టు తెలిసింది.

News October 6, 2024

జానీ మాస్టర్‌‌కు నేషనల్ అవార్డు రద్దు

image

అత్యాచారం కేసులో అరెస్టై, బెయిల్‌పై బయటికొచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అవార్డుకు ఎంపికైన కొద్దిరోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. అవార్డు అందుకునేందుకు జానీకి కోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

News October 5, 2024

త్వరలో CSK ప్రతినిధులతో ధోనీ భేటీ?

image

ఈ నెలలో సీఎస్కే ప్రతినిధులతో మహేంద్ర సింగ్ ధోనీ ముంబైలో సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే సీజన్‌లో తాను ఆడేదీ లేనిదీ వారితో తేల్చి చెప్తారని తెలుస్తోంది. కాగా సీఎస్కే మాత్రం ధోనీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ల జాబితాలో రిటైన్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కనీస ధర రూ.4 కోట్లు చెల్లించి ఆయనను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

News October 5, 2024

అరుదైన రికార్డు ముంగిట హార్దిక్

image

బంగ్లాతో T20 సిరీస్ ముంగిట భారత పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఇప్పటి వరకు T20ల్లో 86 వికెట్లు తీసిన పాండ్య మరో 5 తీస్తే ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌గా నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భువనేశ్వర్(90) పేరిట ఉంది. మొత్తంగా చూసుకుంటే స్పిన్నర్ చాహల్ 96 వికెట్లతో టాప్‌లో ఉన్నారు. బుమ్రా 86 వికెట్లు తీసినప్పటికీ అతడు బంగ్లాతో సిరీస్ ఆడటం లేదు.

News October 5, 2024

ఫొటో గ్యాలరీ.. హంసవాహనంపై తిరుమలేశుడు

image

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ వేంకటేశ్వరుడు హంసవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరించారు. సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కనులపండువగా సాగిన మహోత్సవ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News October 5, 2024

బంగ్లాతో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ

image

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన రేపటి నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దూబే స్థానంలో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. త్వరలోనే తిలక్ జట్టుతో కలుస్తారని తెలుస్తోంది. కాగా రేపు రాత్రి 7.30 గంటలకు గ్వాలియర్‌లో భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది.

News October 5, 2024

సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. CBN ఆగ్రహం

image

AP: ఉచిత ఇసుకపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ గనులశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ప్రజలను తప్పుదారి పట్టించే దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కావాలనే కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు.

News October 5, 2024

శబరిమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్

image

శబరిమల దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న భక్తులకే దర్శనం కల్పిస్తామని, అది కూడా రోజుకు 80వేల మందికే అనుమతి ఉంటుందని తెలిపింది. అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే మకరవిళక్కు సీజన్ మరో నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. శబరిమల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

News October 5, 2024

రూ.10 కాయిన్లు తీసుకోండి: SBI

image

రూ.10 కాయిన్స్‌ చెల్లడం లేదనే అపోహతో చాలామంది తీసుకోవడం లేదు. ఈ అపోహ తొలగించాలనే లక్ష్యంతో SBI వరంగల్ జోనల్ కార్యాలయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సమన్వయంతో ప్రజలు, వ్యాపారుల్లో అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంకు అధికారులు వ్యాపారులకు, ప్రజలకు రూ.10 నాణేలను పంపిణీ చేశారు. ₹10 కాయిన్స్ చెల్లుతాయని అందరూ స్వీకరించాలని కోరారు.

News October 5, 2024

దేశంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం!

image

కాంగ్రెస్ పార్టీకి పూర్వ‌వైభవం ప్రారంభమైనట్టేనని హరియాణా, JK ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ అంచనాలు గనుక నిజమైతే దేశంలో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయమని పేర్కొంటున్నారు.