India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ‘1070’ను అందుబాటులో తీసుకొచ్చినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే వెంటనే ఈ నంబర్‌కు సమాచారాన్ని అందించవచ్చని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, చెట్లు నేలకూలడం, వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినా హైడ్రా సేవల కోసం సంప్రదించవచ్చని పేర్కొన్నారు. దీంతో పాటు మరో 3 నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు.

AP: విశాఖపట్నంలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మారీటైమ్ రంగంలోని బ్లర్గ్స్ ఏఐ, డాకర్ విజన్, ఓల్టియో మారిటైమ్, ఆటోమాక్సిస్, ఈజీ లేన్, ఎయిమ్ లొకేట్ తదితర స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. పలు కంపెనీల సీీఈవోలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

TG: BRS నుంచి కవితను సస్పెండ్ చేయడాన్ని ఆమె అభిమానులు, జాగృతి నేతలు తప్పుబట్టారు. కవిత వ్యాఖ్యలపై వివరణ తీసుకోకుండా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. సస్పెన్షన్ వ్యవహారం ఏకపక్షంగా ఉందని మండిపడ్డారు. ఆమెకు మద్దతు తెలియజేసేందుకు HYDలోని జాగృతి కార్యాలయానికి వారు చేరుకుంటున్నారు. హరీశ్ రావు, జగదీశ్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

శనగలను ఉడికించి/వేయించుకుని తింటే మహిళల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. వీటిలోని ఇనుము, ఫోలేట్ రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఎనీమియాను తగ్గిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌లు ఎముకల సత్తువను పెంచుతాయి. శనగల్లోని ఫైటోఈస్ట్రోజన్స్ హార్మోన్ లెవెన్స్‌ను క్రమబద్ధీకరిస్తాయి. గర్భిణులు వీటిని తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ తగినంత ఉత్పత్తయి శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

చర్మ సౌందర్యాన్ని పెంచడంలో మందార పువ్వులు ప్రధానపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ముఖాన్ని మెరిపిస్తాయి. తాజా మందార పూలను తీసుకుని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో టేబుల్ స్పూన్ మందార పొడి, తేనె, పాలు వేసి మిశ్రమం కలుపుకోవాలి. దాన్ని చర్మానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే ముఖం వికసిస్తుంది.

TG: కవిత వర్సెస్ హరీశ్ ఎపిసోడ్లో గులాబీ బాస్ KCR.. హరీశ్ వైపే నిలబడ్డారు. ఆరోపణలు చేసి 24 గంటలు గడవకముందే కవితను సస్పెండ్ చేశారు. కన్న కూతురైనా పార్టీ తర్వాతే అనే స్పష్టమైన సంకేతాలు కేడర్‌కు పంపారు. పార్టీకి హరీశ్ వెన్నుపోటు పొడుస్తారని గతంలో ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. కానీ అవేమీ లెక్కచేయని ఆయన.. కేసీఆరే తన అధినేత అని కుండబద్దలు కొట్టారు. అదే విధేయత ఇప్పుడు అధినేత తనవైపు నిలబడేలా చేసింది.

TG: వర్షాలు, వరదలతో నష్టపోయిన పంట వివరాలపై 5 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అటు నిన్న ఒక్కరోజే 9వేల మెట్రిక్ టన్నుల(MT) యూరియా రాష్ట్రానికి వచ్చిందని తెలిపారు. ఇవాళ మరో 5వేల MTలు, వారం రోజుల్లో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా డిమాండ్‌కు తగ్గట్లుగా యూరియా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా
విశ్వదాభిరామ వినురవేమ
—–
భావం: చెప్పులో రాయి ఉంటే నడకలో, చెవి చుట్టూ ఈగ శబ్దం చేస్తుంటే ఇబ్బందులు తప్పదు. కంట్లో నలుసు, కాలి ముల్లు మనకు గుచ్చుతూనే ఉంటాయి. అలాగే ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా మన ఇంట్లో పోరుతో మనకు బాధ ఎక్కువ.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీనుతో ‘సరైనోడు-2’ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అల్లు అరవింద్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. బాలకృష్ణతో బోయపాటి తీస్తున్న ‘అఖండ-2’ హిట్ అయితే బన్నీ-బోయపాటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ పడుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

BRS తనను సస్పెండ్ చేయడంతో ఆ పార్టీతో సంబంధాలను పూర్తిగా తెంచుకోవడంపై జాగృతి నేతలతో కవిత చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీతో ఉన్న ఏకైక రిలేషన్ MLC పదవి నుంచి తప్పుకుంటారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో BRS తరఫున 2022లో MLCగా ఎన్నికైన కవిత పదవీకాలం 2028సం. వరకు ఉంది. కానీ ఇప్పుడు పార్టీ ఇచ్చిన పదవిలో ఉంటే విమర్శలు వస్తాయని ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు.
Sorry, no posts matched your criteria.