News November 8, 2024

పదో తరగతి పరీక్షల ఫీజు తేదీల ప్రకటన

image

TG: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18 వరకు గడువు ఇచ్చింది. రూ.50 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో DEC 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 వరకు చెల్లించవచ్చని పేర్కొంది.

News November 8, 2024

త్వరలోనే సినిమా చూపిస్తాం: రేవంత్

image

TG: బీఆర్ఎస్ నేతలకు ఇవాళ ట్రైలర్ మాత్రమే చూపించామని, త్వరలోనే సినిమా చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. హరీశ్, కేటీఆర్ దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. 30 రోజుల్లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ డిజైన్లు ఖరారవుతాయని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు ఎవరైనా అడ్డొస్తే చరిత్ర హీనులుగా మారతారని అన్నారు.

News November 8, 2024

పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని పీసీబీకి బీసీసీఐ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల రీత్యా అక్కడికి రాలేమని తెలిపినట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు భారత్ తమ దేశానికి వస్తుందని పాక్ ఊహల్లో విహరించింది. దీనిపై బీసీసీఐ స్పష్టతనివ్వడంతో దుబాయ్‌లో హైబ్రిడ్ విధానంలో మ్యాచులు నిర్వహించాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

News November 8, 2024

బీఆర్ఎస్‌కు ప్రజల్ని దోచుకోవడమే తెలుసు: రేవంత్

image

TG: అణుబాంబులతో జపాన్‌లోని నగరాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయో మూసీతో హైదరాబాద్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్‌‌కు ప్రజలను దోచుకోవడమే తెలుసని మండిపడ్డారు. దగాపడ్డ తెలంగాణను బాగు చేసుకునే బాధ్యత తనపై ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు.

News November 8, 2024

Stock Market: నష్టాలతో వారాంతం ముగింపు

image

నిఫ్టీలో 24,000 వ‌ద్ద ఉన్న కీల‌క స‌పోర్ట్ వ‌ల్ల శుక్రవారం Index క‌న్సాలిడేట్ అయ్యింది. చివరికి 51 పాయింట్లు న‌ష్ట‌పోయి 24,148 వ‌ద్ద స్థిర‌ప‌డింది. Day Chartలో Bearish Spinning Top క్యాండిల్ ఫాం అవ్వడంతో తదుపరి ట్రెండ్‌పై అయోమయం నెలకొంది. సెన్సెక్స్ 79,486 (-55) వ‌ద్ద చ‌లించింది. రియ‌ల్టీ, మీడియా, బ్యాంకు రంగాలు న‌ష్ట‌పోయాయి. M&M, Titan, TechM టాప్ గెయిన్స్. Trent, Coal India, Asian Paint లూజర్స్.

News November 8, 2024

ధోనీ నుంచి నేను నేర్చుకున్నది అదే: రచిన్ రవీంద్ర

image

CSK దిగ్గజ బ్యాటర్ ధోనీపై ఆ జట్టు మాజీ ఆటగాడు రచిన్ రవీంద్ర ప్రశంసలు కురిపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధోనీ ప్రశాంతంగా ఉంటారని కొనియాడారు. ‘ప్రపంచంలో కోట్లాది మంది ధోనీని అనుసరిస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా తన పేరును జపిస్తుంటారు. కానీ ఆయన మాత్రం ఎలాంటి ఒత్తిడినీ తీసుకోరు. ధోనీది పదునైన బుర్ర. ఎప్పుడూ కూల్‌గా ఎలా ఉండాలన్నది ఆయన్నుంచి నేర్చుకున్నాను’ అని తెలిపారు.

News November 8, 2024

కేటీఆర్ వ్యాఖ్యలు వింటే నవ్వొస్తుంది: మంత్రి కోమటిరెడ్డి

image

TG: ఏ యాత్ర చేసినా కేటీఆర్‌ను ప్రజలు నమ్మరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారం ఇచ్చినా మూసీ బాగు చేయలేని వాళ్లది ఓ బతుకేనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైలుకెళ్లి యోగా చేసి పాదయాత్ర చేస్తానన్న KTR వ్యాఖ్యలు వింటే నవ్వొస్తుందన్నారు. కేసీఆర్ బయటకు వచ్చి మూసీ శుద్ధీకరణ వద్దంటే ప్రజలు ముక్కలు చేస్తారన్నారు. ఇకపై అయినా బీఆర్ఎస్ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

News November 8, 2024

వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్

image

AP: YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని కడప పీఎస్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. YCP అధికారంలో ఉండగా చంద్రబాబు, పవన్, వంగలపూడి అనితపై రవీంద్ర అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఇటీవల పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చి వదిలేయడంపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. కడప ఎస్పీపై బదిలీ వేటు వేసింది.

News November 8, 2024

8శాతం పెరిగిన ట్రంప్ మీడియా షేర్లు

image

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందడంతో ఆయన మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ షేర్లు 8శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీంతో ట్రంప్ ఆస్తి విలువ 300 మిలియన్ డాలర్ల (రూ. 2500 కోట్లకు పైమాటే) మేర పెరిగింది. దీంతో సంస్థలో ట్రంప్ వాటా విలువ మొత్తం 4.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇంత పెరిగినప్పటికీ మూడో త్రైమాసికంలో 19.2 మిలియన్ డాలర్ల నష్టాన్ని ట్రంప్ మీడియా నమోదు చేయడం గమనార్హం.

News November 8, 2024

తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

image

భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, ఆయన సతీమణి అతియా శెట్టి త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు. 2025లో తాము బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఈ స్టార్ కపుల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2023 జనవరిలో వీరికి వివాహమైంది. అతియా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అనే విషయం తెలిసిందే.