India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దసరా పండుగకు ముందు రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 18వ విడత నిధులను ప్రధాని మోదీ నేడు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. మొత్తం రూ.20వేల కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో జమ చేయనున్నారు. ఈ స్కీం కింద ప్రతి 4 నెలలకు ఓసారి రూ.2వేల చొప్పున మొత్తం 3 విడతల్లో రూ.6వేలను అన్నదాతల అకౌంట్లలో డిపాజిట్ చేస్తారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా లీడర్ హషీమ్ సఫీద్దీన్ హతమైనట్లు తెలుస్తోంది. ఇటీవల హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా హతమయ్యాక అతడి దగ్గరి బంధువు అయిన హషీమ్ వారం క్రితమే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం అతడు హెజ్బొల్లా సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. లెబనాన్ రాజధాని బీరుట్‌లో హషీమ్ తన అనుచరులతో సమావేశమయ్యారనే సమాచారంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసి అతడిని మట్టుబెట్టినట్లు సమాచారం.
నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గద్దె గాయత్రి(38) గుండెపోటుతో మరణించారు. నిన్న కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో HYDలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. CRPF, BSF, కోబ్రా, STF విభాగాలకు చెందిన 1500 మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని బస్తర్ IG పేర్కొన్నారు. 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టంచేశారు.
AP: ధాన్యం సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు తమకు ఇష్టమైన మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రవాణా వాహనాలు, గోనె సంచులు సమకూర్చాలని, లేబర్ ఛార్జీలను చెల్లించాలని అధికారులకు సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, రవాణా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలన్నారు.
యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-Aలో భాగంగా మ.3.30కి ఆస్ట్రేలియాతో శ్రీలంక, గ్రూప్-Bలో భాగంగా రా.7.30కి ఇంగ్లండ్‌తో బంగ్లాదేశ్ తలపడతాయి. నిన్న జరిగిన మ్యాచుల్లో ఇండియాపై న్యూజిలాండ్, వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే.
TG: రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఖమ్మం మార్కెట్‌లో నిన్న కొత్త పత్తి క్వింటాల్‌కు గరిష్ఠంగా ₹7,111, మోడల్ ధర ₹6,500, కనిష్ఠంగా ₹4,500 పలికింది. పాత పత్తికి గరిష్ఠంగా ₹7550, కనిష్ఠ ధర ₹4,500గా ఉంది. వరంగల్ మార్కెట్‌లో గరిష్ఠంగా ₹7,600, మోడల్ ₹6,600, కనిష్ఠ ధర ₹5,500 వరకు పలికిందని, కొత్త పత్తి ₹7,600కు పైగానే పలుకుతోందని వ్యాపారులు తెలిపారు.
సోడాలు, కాఫీలు ఎక్కువగా తాగేవారికి పక్షవాతం ముప్పు ఉందంటూ గాల్వే వర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. వాటి వలన డయాబెటిస్, బీపీ పెరుగుతాయని వివరించారు. ఇక కంపెనీలు తయారు చేసే జ్యూస్‌లలో కృత్రిమ షుగర్లు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని, పెరాలసిస్ స్ట్రోక్ ముప్పును పెంచుతాయని హెచ్చరించారు. వాటి బదులు సహజమైన పళ్లరసాలు శ్రేయస్కరమని సూచించారు. ఏం తిన్నా, ఏం తినకపోయినా సమస్యే అన్నట్లుగా తయారైంది నేటి పరిస్థితి.
దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరాఖండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. కానీ టీమ్ ఇండియా ఎంట్రీ మాత్రం ఆయనకు అందని ద్రాక్షగా మారిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇరానీ ట్రోఫీలోనూ 191 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారు. 166 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలతో 7,506 పరుగులు చేశారు. 29 ఏళ్ల అభిమన్యును బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సెలక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సినీ హీరో అక్కినేని నాగార్జునపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువు కబ్జాచేసి N-కన్వెన్షన్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.