News November 8, 2024

సీ ప్లేన్‌లో చంద్రబాబు శ్రీశైలం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు సీ ప్లేన్‌లో శ్రీశైలం పర్యటనకు వెళ్లనున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో టేకాఫ్ తీసుకుని శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత మల్లన్న ఆలయానికి చేరుకుని భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. కాగా తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించనున్నారు.

News November 8, 2024

ఆంధ్రా కాంట్రాక్టర్‌కు గులాంగిరీ చేస్తున్నావా?: KTR

image

TG: CM రేవంత్ రెడ్డిపై KTR తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘నా అరెస్టు కోసం రేవంత్‌ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. మేఘా కృష్ణా రెడ్డిని సుంకిశాల ఘటనలో బ్లాక్‌ లిస్ట్ చేయడానికి దమ్ముందా? అరెస్ట్ చెయ్యడానికి దమ్ముందా? ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్‌’ని, తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్‌ లిఫ్ట్ ఇరిగేషన్‌ నుండి తీసివేసే దమ్ముందా? లేదా? CM అయ్యుండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా?’ అని ఆయన ప్రశ్నించారు.

News November 8, 2024

మరోసారి తండ్రయిన స్టార్ క్రికెటర్

image

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ మరోసారి తండ్రయ్యారు. అతని భార్య జెస్సికా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇతనికి హారిసన్ జార్జ్ అని పేరు పెట్టారు. భార్య, కూతురు, కొడుకుతో హెడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరికి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. IPLలో ట్రావిస్ SRHకు ఆడుతున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో అదరగొట్టిన ఇతడిని ఆ జట్టు మరోసారి రిటైన్ చేసుకుంది.

News November 8, 2024

SOCIAL MEDIA: అభిమానం.. హద్దులు దాటొద్దు

image

రాజకీయాలకు సంబంధించి విమర్శలు, ప్రతివిమర్శలకు సోషల్ మీడియా కీలకంగా మారింది. ఏ పార్టీ వారైనా కొందరు మాత్రం పెచ్చుమీరి పోస్టులు పెడుతున్నారన్నది వాస్తవం. అసభ్య పదజాలంతో ఆడవాళ్లను దూషిస్తున్న తీరు జుగుప్సాకరం. పార్టీ, నాయకుడిపై ఉన్న అభిమానం పరిధి దాటి వ్యక్తిత్వ హననానికి దారి తీస్తోంది. దీనిని కట్టడి చేయాల్సిందే. అయితే ఎవరికివారు విచక్షణతో తమ భావాలను వ్యక్తీకరించడం ఉత్తమమని గుర్తించాలి. మీరేమంటారు?

News November 8, 2024

JKAssembly: ఏమిటీ సెక్షన్ 35A?

image

జమ్మూకశ్మీర్‌లో తిరిగి ఆర్టికల్స్ 370, 35A అమలుకై నేషనల్ కాన్ఫరెన్స్ MLAలు అసెంబ్లీలో డిమాండ్ చేస్తున్నారు. A 370 JKకు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తే, 35A శాశ్వత నివాసితులను నిర్ణయించే అధికారం ఆ శాసనసభకు రాజ్యాంగం కల్పిస్తుంది. ఈ రెసిడెంట్స్‌కే ఓటు హక్కు, స్థిర, చరాస్తుల కొనుగోలు/అమ్మకం, ప్రభుత్వ ప్రయోజనాలు హక్కులుంటాయి. JK ఆడవారు మరో రాష్ట్ర పురుషుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు శాశ్వత హోదా పోతుంది.

News November 8, 2024

రేవంత్‌కు చిరంజీవి బర్త్ డే విషెస్

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజులు మీకు అద్భుతంగా ఉండాలి. సంపూర్ణ ఆరోగ్యంతో మీరు ప్రజాసేవ చేయాలి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, బండి సంజయ్ కూడా ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు.

News November 8, 2024

VIRAL: యమునా నదిలో చిన్నారికి స్నానం

image

కాలుష్య కారకాలతో యమునా నది నిండిపోయింది. నదీ జలాలు విషపు నురుగుతో నిండిపోవడంతో ఛట్ పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఓ తండ్రి తన బిడ్డతో నదిలో స్నానం చేస్తోన్న ఫొటోలు వైరలవుతున్నాయి. ఆ చిన్నారిని నురుగు కప్పేయడంతో అక్కడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుస్తోంది. ఇలాంటి నీళ్లలో స్నానం చేయడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

News November 8, 2024

మరో బిజినెస్‌లోకి ముకేశ్ ఎంట్రీ

image

₹42 వేల కోట్లకు పైగా ఉన్న భారత స్నాక్ మార్కెట్‌ను ముకేశ్ అంబానీ టార్గెట్ చేశారు. ఇందులో ఎంట్రీకి తన సాఫ్ట్ డ్రింక్ ‘క్యాంపా’ తరహా స్ట్రాటజీ అమలు చేస్తున్నారట. దీని సేల్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లకు కోకాకోలా, పెప్సికో లాంటి బ్రాండ్ల మార్జిన్ల కంటే భారీగా ఇచ్చింది. ఇలా స్నాక్స్‌లో కంపెనీలు సూపర్ స్టాకిస్టులకు 3-5%, డిస్ట్రిబ్యూటర్లకు 6-15% మార్జిన్‌ను 8, 20% మార్జిన్+ ఆఫర్లను RIL ఇవ్వనుందట.

News November 8, 2024

నేను పారిపోలేదు.. హైదరాబాద్‌లోనే ఉన్నా: కేటీఆర్

image

TG: అరెస్ట్ చేస్తారనే భయంతో తాను మలేషియా పారిపోయానంటూ వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘నేనెక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా. ఎవరైనా నా దగ్గరకు రావచ్చు. ఉస్మానియా బిస్కెట్లు, ఛాయ్‌ తాగి వెళ్లొచ్చు. ముఖ్యంగా రేవంత్ బర్త్ డే కేక్ తీసుకొచ్చినా కట్ చేస్తా. హ్యాపీ బర్త్ డే సీఎం రేవంత్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News November 8, 2024

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిన్న <<14550455>>భారీగా తగ్గగా<<>>, ఇవాళ అదేస్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.910 పెరిగి రూ.79,470కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.850 పెరగడంతో రూ.72,850గా పలుకుతోంది. సిల్వర్ రేటు రూ.1,000 పెరిగి రూ.1,03,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.