News December 31, 2024

రైతులకు షాక్.. DAP ధర పెంపు

image

దేశంలో DAP(డై అమ్మోనియం ఫాస్పేట్) ధర రేపటి నుంచి 50KGల బస్తాపై కనీసం ₹200 పెరగనుంది. DAP దిగుమతులకు కేంద్రం ఇప్పటివరకు అందించిన ప్రత్యేక ప్రోత్సాహకాల గడువు నేటితో ముగియనుంది. దీని పొడిగింపుపై ఎలాంటి ప్రకటన లేకపోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ మరింత పెరగడంతో DAP ధర పెరగక తప్పదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. యూరియా తర్వాత రైతులు అత్యధికంగా DAP వినియోగిస్తారు. ప్రస్తుతం 50KGల బ్యాగ్ ధర ₹1350 ఉంది.

News December 31, 2024

ఒంట్లో సగటు ఉష్ణోగ్రత 98.6F డిగ్రీలు కాదు: స్టడీ

image

థర్మా మీటర్లో 98.6F డిగ్రీల వేడి దాటేసిందంటే జ్వరమొచ్చిందని భావిస్తాం. నిజానికి మనమంతా అనుకుంటున్న ఈ సగటు ఉష్ణోగ్రత కరెక్టు కాదని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు అంటున్నారు. 2008-17 మధ్య వేర్వేరు వయసు, ఎత్తు, బరువు, లింగభేదం, BMI ఉన్న 6.18L మందిని Dr జూలీ పర్సోనెంట్ బృందం పరిశీలించింది. వారిలో సాధారణ టెంపరేచర్ 97.3 – 98.2°F మధ్యే ఉన్నట్టు గుర్తించింది. మారిన పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది.

News December 31, 2024

31st నైట్: ఆగకుండా తింటూ తాగేస్తారా..!

image

ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కలిసి 31st నైట్‌ను సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అకేషన్ దొరికింది కదాని కొందరు అదే పనిగా మద్యం సేవిస్తుంటారు. మరికొందరేమో కూల్‌డ్రింక్స్‌ను తాగుతారు. తోడుగా వెజ్, నాన్‌వెజ్, ఫ్రైస్‌ను లాగించేస్తారు. గ్యాప్ లేకుండా తింటూ తాగడం వల్ల ఒబెసిటీ, హెడేక్స్, డయాబెటిస్, గ్యాస్ట్రో, పెయిన్, లివర్, మెదడు, నరాల రోగాలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నియంత్రణ అవసరమంటున్నారు.

News December 31, 2024

సీత వేషం వేసినందుకు నాన్న బెల్ట్‌తో చావబాదారు: రవికిషన్

image

చిన్నతనంలో ఎదుర్కొన్న భయానక అనుభవాలను సినీ నటుడు రవికిషన్ పంచుకున్నారు. స్థానికంగా ఓ నాటకంలో తన తల్లి చీరను ధరించి సీత వేషం వేసినందుకు తన తండ్రి బెల్ట్‌తో చావబాదినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రూ.500 ఇచ్చి రైలెక్కి వెళ్లిపొమ్మన్నారని లేకపోతే చంపేస్తా అని బెదిరించినట్లు వెల్లడించారు. దాంతో చిన్న వయసులోనే ముంబైకి వచ్చినట్లు పేర్కొన్నారు. రవికిషన్ తెలుగులో రేసు గుర్రం సినిమాలో నటించారు.

News December 31, 2024

2024: క్రీడా భారతం

image

ఈ ఏడాది భారత్‌కు క్రీడల్లో కీలక విజయాలు దక్కాయి. క్రికెట్‌లో రోహిత్ సారథ్యంలో భారత పురుషుల జట్టు T20 WC గెలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు రాగా పారా ఒలింపిక్స్‌లో 29 పతకాలతో చరిత్ర సృష్టించింది. మరోవైపు చెస్‌ ఒలింపియాడ్‌లో గుకేశ్ బృందం, హారిక బృందం విజేతలుగా నిలిచింది. UFCలో మార్షల్ ఆర్టిస్ట్ పూజా తోమర్ గెలవగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ విజేతగా రోహన్ బోపన్న నిలిచారు.

News December 31, 2024

వైసీపీ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారు: CBN

image

AP: వైసీపీ పాలనలో ప్రజలు కనీసం నవ్వలేకపోయారని సీఎం చంద్రబాబు అన్నారు. యల్లమంద గ్రామస్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే తాను వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నదే తన తపన అని చెప్పారు. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తానని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగును చూడాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.

News December 31, 2024

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

TG: ఫార్ములా-ఈ రేసులో తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణను హైకోర్టు మ.2.30 గంటలకు వాయిదా వేసింది. కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు ముగించారు. మ.2.30కి ప్రభుత్వం తన వాదనలు వినిపించనుంది.

News December 31, 2024

కరోనా వైరస్ తొలికేసుకు ఐదేళ్లు

image

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తొలి కేసును ఇదేరోజున 2019లో చైనాలోని వుహాన్‌లో గుర్తించారు. జనవరి తొలి వారంలో దీనిని నావెల్ కరోనా వైరస్‌గా ప్రకటించారు. 2020 మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు వ్యాపించింది. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ వైరస్ లక్షల మంది ప్రాణాలు తీసుకోవడంతో పాటు వేలాది మందిని అనాథలుగా మార్చేసింది.

News December 31, 2024

రేపటి నుంచి జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు శుభవార్త. వారికి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపింది. 475 జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి దీనిని ప్రారంభించాలంటూ రూ.115 కోట్లు కేటాయించింది.

News December 31, 2024

రష్మిక పెళ్లి చేసుకునేది ఎవరినంటే?

image

నేషనల్ క్రష్ రష్మిక తెలుగు ఇండస్ట్రీ హీరోనే పెళ్లి చేసుకుంటుందని నిర్మాత నాగవంశీ చెప్పారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ఆమె ఇంకా రివీల్ చేయలేదని తెలిపారు. గత కొన్నేళ్లుగా రష్మిక ఓ యంగ్ హీరోతో రిలేషన్‌లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారానికి రష్మికనే ఎండ్ కార్డు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు గర్ల్ ఫ్రెండ్, సికందర్ సినిమాల్లో నటిస్తున్నారు.