India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశంలో 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగితే 1.72 లక్షల మంది మరణించగా, 4.62 లక్షల మంది గాయపడ్డారని కేంద్ర నివేదిక వెల్లడించింది. 2022తో పోలిస్తే ప్రమాదాలు 4.1%, మరణాలు 2.61% పెరిగాయని పేర్కొంది. రాష్ట్రాల వారీగా రోడ్డు ప్రమాదాల్లో ఏపీ(8,276), TG(8,103) ఏడు, ఎనిమిది స్థానాల్లో, మరణాల్లో AP(3,806), తెలంగాణ(3,508) 8, 9 స్థానాల్లో ఉన్నాయి. మరణాల్లో అత్యధికం 35-45 ఏళ్ల వారే ఉన్నారని తెలిపింది.

AP: తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో నంది అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. విశాఖలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. గిడుగు రామమూర్తి, గురజాడ, కందుకూరి కృషి ఫలితంగానే తెలుగు భాషకు మహోన్నత స్థానం లభించిందని చెప్పారు. ఈ క్రమంలో రామమూర్తి అవార్డు గ్రహీతలను సత్కరించి, అవార్డులు, నగదు అందజేశారు.

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మెన్స్ డబుల్స్ ద్వయం సాకేత్-చిరాగ్ విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నం.2 జోడీ ఆరోన్, సో వూయ్పై 21-12, 21-19 తేడాతో నెగ్గారు. దీంతో కాంస్యం ఖరారు చేసుకున్నారు. మరోవైపు ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు నిరాశపరిచారు. ఇండోనేషియా ప్లేయర్ వర్ధనీ చేతిలో 21-14, 13-21, 21-16 పాయింట్ల తేడాతో ఓడారు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్-తనీశా జోడీ ఇంటి దారి పట్టింది.

TG: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు ప్రభుత్వం ఈ సెషన్ నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చర్చలో ధీటుగా బదులిచ్చేందుకు బీఆర్ఎస్ నేతలకు చీఫ్ KCR దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ చర్చలకు <<17553800>>ఆయన<<>> హాజరయ్యే విషయమై అంతా ఆసక్తి నెలకొంది. అటు అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరగకుండా చూడాలని స్పీకర్ పోలీసులకు సూచించారు.

సినీ నటి పూర్ణ మరోసారి తల్లి కానున్నారు. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన పూర్ణ 2022లో దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. 2023లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 2026లో రెండో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు పూర్ణ తెలిపారు. అఖండ, దసరా, సుందరి, సీమ టపాకాయ్, అవును తదితర చిత్రాల్లో ఆమె నటించారు.

AP: పబ్లిక్ సెక్టార్ పరిధిలోని కంపెనీలు/కార్పోరేషన్లు/సొసైటీలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రచారంలో ఉన్న GO ఫేక్ అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వాస్తవ జీవోలో పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉందని క్లారిటీ ఇచ్చింది. దురుద్దేశంతో కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

TG: భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 2.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కామారెడ్డిలో 77వేల ఎకరాలు, మెదక్‌లో 23వేలు, ADBలో 21 వేలు, NZBలో 18వేలు, ఆసిఫాబాద్‌లో 15వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు వెల్లడించారు. ఇందులో 1.09 ఎకరాల్లో వరి, 60,080 ఎకరాల్లో పత్తి, 6,751 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.

1871: భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం
1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం
1936: సినీ నటి జమున జననం (ఫొటోలో)
1949: స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ మరణం
1980: తెలుగు, హిందీ నటి రిచా పల్లాడ్ జననం
1994: సినీ హీరోయిన్ నందిత రాజ్ జననం

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్-5 మిషన్‌ను జపాన్‌తో కలిసి ప్రయోగిస్తామని PM మోదీ ప్రకటించారు. ఇరు దేశాల అంతరిక్ష సంస్థలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఈ భాగస్వామ్యం జపాన్ అత్యాధునిక సాంకేతికతను, పరిశోధనా పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు దోహదపడనుంది. ఈ మిషన్‌లో ల్యాండర్‌ను భారత్, రోవర్‌ను జపాన్ నిర్మించనుంది. 2027లో చంద్రయాన్-4 మిషన్ చేపట్టాక దీనిని జపాన్ నుంచి ప్రయోగిస్తారు.
Sorry, no posts matched your criteria.