News April 1, 2024

టోల్ ఛార్జీల పెంపు వాయిదా

image

ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన టోల్ ఛార్జీల పెంపును ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని NHAIను ఈసీ ఆదేశించింది. దీంతో పాత ఛార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు NHAI సూచించింది. ఇవాళ వసూలు చేసిన మొత్తాలను వాహనదారుల అకౌంట్లలో తిరిగి జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా నిన్న అర్ధరాత్రి నుంచి ఛార్జీలు సగటున 5 శాతం పెరిగిన విషయం తెలిసిందే.

News April 1, 2024

పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల

image

AP: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష AP PGCET-2024 నోటిఫికేషన్ విడుదలైంది. మే 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు రుసుము ఓసీ అభ్యర్థులు రూ.850, బీసీలు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.650 చెల్లించాలి. మే 31 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. జూన్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

News April 1, 2024

ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి ‘భీమా’!

image

గోపీచంద్ నటించిన భీమా సినిమా OTT హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని గతంలో వార్తలురాగా, ఒక రోజు ముందుగానే OTTలోకి రానుందని సమాచారం. 5న ఎక్కువ సినిమాల రిలీజ్ ఉండటంతో స్ట్రీమింగ్‌ తేదీని ముందుకు మార్చినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు.

News April 1, 2024

ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు.. ఎందుకంటే?

image

VVPAT స్లిప్పులను క్షుణ్ణంగా లెక్కించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంపిక చేసిన 5 EVMలలో నమోదైన ఓట్లకు సంబంధించిన VVPAT స్లిప్పులను లెక్కిస్తారు. ప్రతి EVM ఓటును VVPAT స్లిప్‌లతో పోల్చాలని పిటిషనర్ కోరారు. జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ EVM, VVPAT పనితీరులో తప్పులు జరుగుతున్నాయని సుప్రీంను ఆశ్రయించారు.

News April 1, 2024

SHOCKING: ఎక్కువ సేపు పనిచేస్తున్నారా?

image

ఇతర దేశాల్లోని ఐటీ నిపుణులతో పోల్చితే భారత ఉద్యోగులు పని పట్ల ఎంతో ప్రేమగా ఉంటారట. వీరు వారంలో జాతీయ సగటు (47.7 గంటలు) కంటే ఎక్కువగా 52.5 గంటలు పనిచేస్తున్నారు. KCCI సర్వే ప్రకారం 51% మంది భారతీయ టెక్కీలు 9-12 గంటలు పనిలో గడుపుతున్నట్లు తేలింది. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల టెక్కీలు ఎసిడిటీ, వెన్ను & మెడ నొప్పి, నిద్రలేమి, కండరాలు పట్టుకోవడం, కంటి చూపు సమస్యలు, బరువు పెరుగుతున్నారని తెలిసింది.

News April 1, 2024

‘టిల్లు స్వ్కేర్’ సీక్వల్ రాబోతోంది!

image

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే, ఈ సినిమాకు మరో సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే DJ టిల్లు, టిల్లు స్క్వేర్‌తో వచ్చిన సిద్ధూ.. ‘టిల్లు క్యూబ్’తో మరోసారి అలరించనున్నారు. ఈ మూవీలో ఓ స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తుందని సమాచారం. కామెడీ, ఎంటర్‌టైన్మెంట్ మూడు రెట్లు ఉంటుందంటున్నారు.

News April 1, 2024

అత్యధిక డకౌట్ల రికార్డు సమం

image

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగిన రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశారు. IPLలో ఎక్కువసార్లు(17) డకౌట్ అయిన ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్ సరసన చేరారు. 15 డకౌట్లతో మ్యాక్స్‌వెల్, పియూష్ చావ్లా, మన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్ రెండో స్థానంలో ఉన్నారు.

News April 1, 2024

ఇర్ఫాన్ పఠాన్ T20WC భారత టీమ్ ఇదే..

image

మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ T20WC కోసం తన అంచనాలతో భారత జట్టును ఎంపిక చేశారు. యువ ఆటగాళ్లు జితేశ్, రింకూ, బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్‌లకు ఇందులో చోటు కల్పించారు.
టీమ్: రోహిత్, గిల్, జైస్వాల్, కోహ్లి, సూర్య, రింకూ సింగ్‌, పంత్‌, కేఎల్‌ రాహుల్‌, జితేశ్ శర్మ, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, సిరాజ్‌, బుమ్రా, మొహ్సిన్ ఖాన్‌/అర్ష్‌దీప్.
ఈ జట్టుపై మీ అభిప్రాయం?

News April 1, 2024

ప్రముఖ నటిపై కేసు నమోదు

image

‘రఘువరన్ బీటెక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి శరణ్య పొన్వన్నన్. తన ఫ్యామిలీతో చెన్నై సమీపంలోని విరుగంబాక్కంలో ఉంటున్న ఆమెపై తాజాగా ఓ కేసు నమోదైంది. పొరుగింటి మహిళతో శరణ్యకు పార్కింగ్ విషయంలో గొడవ జరిగి కొట్టుకునేవరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఆమె సదరు మహిళను చంపేస్తానంటూ బెదిరించారట. దీంతో శరణ్యపై పొరుగింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

News April 1, 2024

RCB జెర్సీలో ధోనీ, SRH జెర్సీలో రోహిత్, MI జెర్సీలో కోహ్లీ..!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్న నేపథ్యంలో అభిమాన ప్లేయర్ తమకిష్టమైన జట్టులో ఉంటే బాగుండేదని అనుకుంటారు. అయితే, అలాంటి వాళ్లకోసమే తాము ఆడుతున్న జట్టు కాకుండా ఇతర జట్టు జెర్సీని ధరించినట్లు ఎడిట్ చేసిన ఫొటోలు వైరలవుతున్నాయి. SRH జెర్సీలో రోహిత్, ముంబై జెర్సీలో కోహ్లీ, RCB జెర్సీలో ధోనీ, CSK జెర్సీలో పంత్, KKR జెర్సీలో బుమ్రాను ఎడిట్ చేశారు. మరి మీ ఫేవరెట్ ప్లేయర్ ఏ జట్టులో ఆడితే బాగుంటుంది?