India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వచ్చే ఏడాది మలేషియాలో జరగనున్న ICC U19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ కోసం USA జట్టును ప్రకటించగా SMలో జోక్స్ పేలుతున్నాయి. 15మంది మెయిన్, రిజర్వ్ ప్లేయర్లందరూ ఇండో-అమెరికన్ సంతతి కావడం విశేషం. ఈ జట్టుకు అనికా కోలన్ సారథిగా వ్యవహరించనున్నారు. అయితే ఇది ఇండియా ఉమెన్స్ B టీమ్ అని కొందరు, ‘H1B స్క్వాడ్’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ జట్టులోని ప్లేయర్ల ఎంపికపై కొందరు సంతోషం వ్యక్తం చేశారు.

APలో పెన్షన్ల పంపిణీ ఉదయం నుంచి కొనసాగుతోంది. 63.77 లక్షల మందికి గానూ ఇప్పటివరకు 53.22 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు అందించారు. ఉదయం 10 గంటల వరకు 83.45శాతం పెన్షన్ల పంపిణీ పూర్తైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. జియో ట్యాగింగ్ ద్వారా ఇళ్ల వద్దే ఇస్తున్నారా? లేదా? అనేది ప్రభుత్వం పరిశీలిస్తోంది. అటు 2-3 నెలలుగా పెన్షన్లు తీసుకోని 50 వేల మందికి ఇవాళే పెన్షన్లు ఇస్తోంది.

శబరిమల ఆలయం నిన్న తిరిగి తెరుచుకోగా భక్తుల రద్దీ కనిపించింది. పంబ వరకు భక్తుల క్యూలైన్ కొనసాగగా, దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ స్పాట్ బుకింగ్ సెంటర్ వద్ద 5గంటలకు పైగా నిరీక్షించి స్పాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చిందని పలువురు చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను నియంత్రించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కౌంటర్ల సంఖ్యను పెంచకపోవడంతో నిరీక్షణ తప్పలేదని భక్తులు వాపోయారు.

TG: రాష్ట్రంలో ఏడాది కాలంలో క్రైమ్ రేట్ పెరిగిందని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అత్యాచారాలు ఏడాదిలోనే 28.94శాతం పెరిగాయని పేర్కొంది. సంఘటనలపై పోలీస్ రెస్పాన్స్ టైమ్ తగ్గిందని తెలిపింది. రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నాడా? అని ప్రశ్నించింది. డబ్బు సంచుల కోసం మూసీ ప్రాజెక్టుపై సమీక్ష చేసే సీఎం రేవంత్‌కు ఆడబిడ్డలపై పెరిగిన నేరాలపై సమీక్షలు చేయట్లేదని దుయ్యబట్టింది.

BGT సిరీస్ అనంతరం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయించుకున్నారా? BCCI వర్గాల సమాచారం ప్రకారం.. భారత్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరకపోతే సిడ్నీ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో కెరీర్‌కు తెరదించాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సెలక్టర్లకు చెప్పారని సమాచారం. అదే జరిగితే ఆయన స్థానంలో టెస్టు కెప్టెన్‌గా బుమ్రాను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.

వృద్ధులు సైబర్ మోసాల బారిన పడటానికి ఓ రకంగా వారి పిల్లలే కారణమని టీజీఆర్టీసీ MD సజ్జనార్ ట్వీట్ చేశారు. వృద్ధాప్యంలో వారిని సరిగా పట్టించుకోకపోవడం సైబర్ నేరగాళ్లకు అనుకూలంగా మారుతోందని తెలిపారు. సైబర్ నేరాల బాధితుల్లో వీరి సంఖ్యే ఎక్కువని పేర్కొన్నారు. వారి కదలికలపై పిల్లలు నిఘా పెట్టాలని సూచించారు. HYDలో వృద్ధుడైన ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.9.50లక్షలను కేటుగాళ్లు కాజేసిన వార్తను ఆయన షేర్ చేశారు.

TG: ఖమ్మం(D) మధిర మండలంలోని కిష్టాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్ నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి స్నేహితులు తెలిపారు. అతడి స్వస్థలం ముదిగొండ. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

భారత్‌కు రాకపోకలు సాగించే అన్ని ఎయిర్‌లైన్స్‌కు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ విమానాల్లో ప్రయాణించిన విదేశీ ప్రయాణికుల వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలని ఆదేశించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ పాటించకపోతే ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఫ్లైట్ బయల్దేరే 24 గంటల ముందు ప్రయాణికుల మొబైల్, పేమెంట్ విధానం, ప్రయాణ వివరాలు, ఈ-మెయిల్, బ్యాగేజీ సమాచారం పంచుకోవాలంది.

2024లో చివరి ట్రేడింగ్ సెషన్‌ను బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో ఆరంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 463 పాయింట్ల నష్టంతో 77,784 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు కోల్పోయి 23,542 వద్ద కదులుతున్నాయి. ఐటీ షేర్లు అత్యధికంగా 2% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. కీలకమైన బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ONGC, BEL గ్రీన్‌లో ఉన్నాయి. India Vix 14.29గా ఉంది.

ఎన్నో ఆశలు, ఆశయాలతో మనం స్వాగతం పలికిన 2024 మరికొన్ని గంటల్లో మనల్ని విడిచి వెళ్లిపోనుంది. 366(లీప్ ఇయర్) రోజులుగా మనతోనే ఉంటూ, కొందరికి తీపి జ్ఞాపకాలను, మరికొందరికి చేదు గుళికలను మిగిల్చింది. బుల్లెట్ కంటే స్పీడ్‌గా, రాకెట్ కంటే వేగంగా 2024 అప్పుడే అయిపోయిందా? అనేలా మనందరికీ సైన్ ఆఫ్ చెప్పేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది మీకు ఎలాంటి మెమొరీస్ అందించిందో కామెంట్ చేయండి. GOOD BYE 2024
Sorry, no posts matched your criteria.