News June 10, 2024

పాక్ ఓటమి.. ఆ దేశ ప్రధానిపై ట్రోల్స్

image

నిన్న తొలి ఇన్నింగ్స్‌లో INDను 119 రన్స్‌కే PAK కట్టడి చేయడంతో ఆ దేశ PM షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. ‘పాక్ టీమ్ గ్రేట్ బౌలింగ్. టోర్నీలో ఇది గొప్ప మ్యాచ్‌ అవుతుందని ఆశిస్తున్నా. ఛేజింగ్‌కు దిగే అబ్బాయిలకు ఆల్ ది బెస్ట్’ అని రాసుకొచ్చారు. అయితే పాక్ మ్యాచ్ ఓడిపోవడంతో ఆయన మళ్లీ ఎలాంటి ట్వీట్ చేయలేదు. దీంతో ‘గుర్తుపెట్టుకోండి.. ఎప్పుడూ ముందే సంబరాలు చేసుకోవద్దు’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

News June 10, 2024

గుర్‌ప్రీత్‌సింగ్ గురించి తెలుసా?

image

భారత ఫుట్‌బాల్ జట్టు <<13411799>>కెప్టెన్‌గా<<>> నియమితులైన గుర్‌ప్రీత్‌సింగ్ మొహాలీలో జన్మించారు. 9వ ఏటనే ఫుట్‌బాల్ ఆడటం మొదలెట్టారు. చండీగఢ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2011 నుంచి ఇప్పటివరకు IND తరఫున 72 మ్యాచులు ఆడారు. IND U19, IND U13 జట్లకూ ప్రాతినిధ్యం వహించారు. UEFA యూరోప్ లీగ్‌లో ఆడిన తొలి భారత ప్లేయర్‌గా, ఐరోపాలో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడిన ఐదో IND ఆటగాడిగా నిలిచారు. ISLలో బెంగళూరు టీమ్‌కు ఆడుతున్నారు.

News June 10, 2024

GET READY: సా.6 గంటలకు ‘కల్కి’ ట్రైలర్

image

ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898AD’ మూవీ ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది. సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు థియేటర్లలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించారు.

News June 10, 2024

మోదీ 3.0.. నేడు తొలి కేబినెట్ సమావేశం!

image

ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర వర్గాల సమాచారం. ఈ మీటింగ్‌లో పీఎం ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) కింద 2 కోట్ల ఇళ్లను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. PMAY-G లబ్ధిదారులకు ఆర్థికసాయాన్ని మరో 50% పెంచొచ్చని పేర్కొన్నాయి. ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉంది.

News June 10, 2024

ట్రెండింగ్‌లో ‘ALL EYES ON REASI’

image

జమ్మూకశ్మీర్ రియాసిలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘ALL EYES ON REASI’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే రఫాపై ఇజ్రాయెల్ దాడి సమయంలో ‘ALL EYES ON RAFAH’ అని పోస్టులు పెట్టిన సినీ సెలబ్రిటీలకు రియాసి ఉగ్రదాడి కనిపించడం లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

News June 10, 2024

ఐపీఎల్‌లో ఆడకపోవడమే మంచిదైంది: జంపా

image

IPL ఆడకపోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయమని ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సందర్భంగా అతడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘IPL సమయంలో అలసటతో ఉన్నా. చిన్నచిన్న గాయాలు కూడా వేధించాయి. టోర్నీలో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నా. WC వరకు ఫిట్‌నెస్‌ సాధించా’ అని జంపా వివరించారు. ప్రస్తుతం అతడు RR టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News June 10, 2024

మోదీ సర్కార్: ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రిపదవులో తెలుసా?

image

మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్ (5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తమిళనాడు (3), హరియాణా (3) ఉన్నాయి. తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, కేరళ, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు దక్కాయి. ఇక ఢిల్లీ, హిమాచల్, అరుణాచల్, గోవా, J&Kలకు ఒక్కోటి చొప్పున పదవులు కేటాయించారు.

News June 10, 2024

సరికొత్త గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 77వేల మార్క్ తాకగా, నిఫ్టీ 23,411 పాయింట్లకు చేరి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. అయితే ఐటీ, మెటల్ రంగాల షేర్లు నష్టాలు నమోదు చేయడంతో సూచీలు జోరును కొనసాగించలేకపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 140కిపైగా పాయింట్ల నష్టంతో 76,550 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయి 23,267 వద్ద కొనసాగుతోంది.

News June 10, 2024

స్టార్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్?

image

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ ఈనెల 23న పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ముంబైలో అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల మధ్య వీరి వివాహం జరగనున్నట్లు తెలిపాయి. ఇప్పటికే పలువురికి ఆహ్వాన పత్రికలు అందినట్లు సమాచారం. కాగా సోనాక్షి చివరగా ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో నటించారు. జహీర్ నోట్‌బుక్, డబుల్ XL వంటి సినిమాలు చేశారు.

News June 10, 2024

శ్రీశైలానికి మొదలైన ఇన్‌ఫ్లో

image

AP: శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం మొదలైంది. ఎగువ భాగంలోని సుంకేసుల జలాశయం నుంచి 4వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలకు సుంకేసులకు భారీ ప్రవాహం వస్తుండటంతో.. అక్కడి నుంచి శ్రీశైలానికి వదులుతున్నారు. అటు జూరాలకు 3వేల క్యూసెక్కులు, తుంగభద్ర జలాశయానికి 4వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.