News March 31, 2024

సమయం లేదు మిత్రమా..

image

సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ప్లేయర్లతో జియో సినిమా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్‌ల పోస్టర్‌కు ‘అఖండ’ అని టైటిల్ ఇచ్చింది. దీనిని ‘సమయం లేదు మిత్రమా. శరణమా.. రణమా?’ అన్న క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. కాగా కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

News March 31, 2024

కొడుకు పేరును టాటూ వేయించుకున్న హీరో

image

‘12TH ఫెయిల్’ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. తన కొడుకు పేరు వర్దాన్, పుట్టిన తేదీ 7-2-2024ను చేతిపై టాటూ వేయించుకున్నారు. ‘అడిషన్ ఆర్ అడిక్షన్?.. రెండింటినీ నేను ప్రేమిస్తాను’ అని రాసుకొచ్చారు. కాగా విక్రాంత్ తన ప్రేయసి శీతల్ ఠాకూర్‌ను 2022లో పెళ్లి చేసుకున్నారు.

News March 31, 2024

నయనతారను దాటేసిన త్రిష!

image

పొన్నియన్ సెల్వన్ ముందు వరకు నెమ్మదించిన త్రిష కెరీర్ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. విజయ్ లియో సినిమాలో రూ.6 కోట్లు తీసుకున్న ఆమె, కమల్ ‘థగ్ లైఫ్‌’కు ఏకంగా రూ.12 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈక్రమంలో తోటి స్టార్ నయనతారను దాటేశారని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం అజిత్ ‘విడాముయర్చి’, మెగాస్టార్ ‘విశ్వంభర’, మోహన్‌లాల్ ‘రామ్’, నివీన్ పౌలీ ‘ఐడెంటిటీ’ సినిమాల్లో ఆమె నటిస్తున్నారు.

News March 31, 2024

మార్కెటింగ్‌లో ఇండియన్ క్రియేటివిటీకి హద్దు లేదు: ఆనంద్ మహీంద్రా

image

ఐపీఎల్‌ క్రేజ్‌ను ఇడ్లీ మార్కెటింగ్‌కు ఉపయోగించుకున్న చెన్నైలోని ఓ హోటల్‌పై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఇడ్లీ ప్రీమియర్ లీగ్(IPL) అంటూ స్పెషల్ ఆఫర్ ఉన్న ఓ పోస్టర్‌ను Xలో పోస్టు చేశారు. ‘మార్కెటింగ్‌లో భారతీయుల సృజనాత్మకతకు హద్దు లేదు. ఈ ఐపీఎల్ ఆదివారం ఉదయం మంచి రేటింగ్ పొందింది. నేను కూడా ఇడ్లీ హోమ్ డెలివరీ కోసం నా టికెట్‌ రిజర్వ్ చేసుకున్నా’ అని రాసుకొచ్చారు.

News March 31, 2024

భార్యాభర్తల మధ్య ఎన్నికల చిచ్చు

image

MPలోని బాలాఘాట్ లోక్‌సభ BSP అభ్యర్థి కంకర్ ముంజరే ఇంట్లో ఎన్నికలు చిచ్చు పెట్టాయి. అతని భార్య అనుభా ప్రస్తుతం కాంగ్రెస్ MLAగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వేర్వేరు పార్టీలకు ప్రచారం చేస్తున్న తామిద్దరం ఒకే ఇంట్లో ఉండొద్దని శంకర్ తన భార్యకు చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ఇంట్లో ఎవరైనా ఒకరే ఉండాలని, ఆమెను వేరే చోటుకు వెళ్లాలని కండిషన్ పెట్టారట. దీంతో అనుభా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. <<-se>>#Elections2024<<>>

News March 31, 2024

అమెరికా సైనిక స్థావరంలోకి చొరబడిన చైనీయుడు

image

అమెరికాలోని కాలిఫోర్నియాలో మెరైన్ కోర్ శిబిరంలోకి ఓ చైనీయుడు చొరబడటం కలకలం రేపింది. అనుమతిలేకుండా లోపలికి వచ్చిన అతడు, బయటికి వెళ్లేందుకు నిరాకరించడంతో సరిహద్దు నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి వచ్చాడని, దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. కాగా.. గత ఏడాది చైనాకు చెందిన నిఘా బుడగలు అమెరికా గగనతలంలో కనిపించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

News March 31, 2024

ఫిరాయింపుల నిరోధక చట్టంలోని అంశాలివే..

image

1985లో రాజీవ్‌గాంధీ 52వ రాజ్యాంగ సవరణతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. ఒక పార్టీ నుంచి MP, MLA, MLCగా గెలిచి మరో పార్టీలో చేరడం, విప్‌నకు వ్యతిరేకంగా సభలో ఓటు వేస్తే అనర్హతకు గురవుతారు. గెలిచిన పార్టీకి రాజీనామా చేసినప్పుడు, నామినేటెడ్ సభ్యులు పార్టీలో చేరినప్పుడూ చట్టం వర్తిస్తుంది. అయితే పార్టీ మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మరో పార్టీలో చేరినా, గ్రూపుగా ఏర్పడినా చట్టం వర్తించదు.

News March 31, 2024

అధికారం లేకపోతే క్షణం ఉండలేకపోతున్నారు

image

దేశవ్యాప్తంగా రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో తాము గెలిచి, పార్టీ ఓడితే వెంటనే అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారు. అన్ని చోట్లా ఇదే తంతు. ఒక పార్టీని మించి మరో పార్టీ వలసలను ప్రోత్సహిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన సొంత క్యాడర్‌ను నట్టేట ముంచి నాయకులు స్వలాభం చూసుకుంటున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నా.. అది అధికార పార్టీకి చుట్టంగా మారిందనే విమర్శలున్నాయి.

News March 31, 2024

సికింద్రాబాద్ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్?

image

TG: రాష్ట్ర కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ MP అభ్యర్థి దానం నాగేందర్‌ను మార్చనున్నట్లు సమాచారం. ఇటీవల హస్తం పార్టీలో చేరిన ఆయనను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం దానం ఖైరతాబాద్ MLAగా ఉన్నారు. ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆదేశించినా ఆయన లెక్కచేయడం లేదు. దీంతో ఆయన తీరుపై గుర్రుగా ఉన్న హస్తం పార్టీ దానంను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News March 31, 2024

IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన డెలివరీలు

image

☛ షాన్ టైట్ (RR) 157.71 kmph – 2011
☛ లాకీ ఫెర్గూసన్ (GT) 157.3 kmph – 2022
☛ ఉమ్రాన్ మాలిక్ (SRH) 157 kmph – 2022
☛ అన్రిచ్ నోర్ట్జే (DC) 156.22 kmph – 2020
☛ ఉమ్రాన్ మాలిక్ (SRH) 156 kmph – 2022
☛ మయాంక్ యాదవ్ (LSG) 155.8 kmph – 2024