India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ ఏడాది టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా(65 వికెట్లు)కు ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీల్లో చోటు దక్కింది. మొత్తం నలుగురు ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్(1556 రన్స్), హ్యారీ బ్రూక్(1100 రన్స్), శ్రీలంక నుంచి కమిందు మెండిస్(1049 రన్స్) ఈ రేసులో నిలిచారు. విజేతను నిర్ణయించే మీ ఓటు వేసేందుకు ఇక్కడ <

AP: అల్లు అర్జున్ అంశంపై పవన్ కళ్యాణ్ <<15019011>>స్పందించడంపై <<>>మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో రెస్పాండ్ అయ్యారు. ‘సంఘటన జరిగిన 27 రోజుల తర్వాత నోరు మెదిపి మీ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నందుకు సంతోషం’ అంటూ Xలో పవన్ను ట్యాగ్ చేశారు.

బెంచ్మార్క్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఒకానొక దశలో 850 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం 464 పాయింట్ల నష్టంతో 78,222 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 153 Pts తగ్గి 23,657 వద్ద చలిస్తోంది. FIIల అమ్మకాలు, రూపాయి పతనం, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడమే ఇందుకు కారణాలు. దీంతో మదుపరులు రూ.4లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.

హిందీలో ‘పుష్ప-2’ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. సినిమా విడుదలైన 25 రోజుల్లోనే రూ.770.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద నం.1 చిత్రమిదేనని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.1,800 కోట్ల వసూళ్లకు చేరువైంది.

ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అనుసరిస్తున్న వ్యూహాలు వివాదాస్పదం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చాక చేపట్టే స్కీములకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆరంభిస్తుండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. గెలిచాకే వివరాలు సేకరించొచ్చు కదా అంటున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ వచ్చాక ఓటర్లకు ఆశచూపుతూ పేర్లు, వివరాలు తీసుకోవడం లంచం కిందకు వస్తుంది. కోడ్ వచ్చే ముందు డేటా తీసుకోవడాన్ని BJP, INC వ్యతిరేకిస్తున్నాయి.

బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు ఓ దశలో మెరుగ్గా ఉన్నా వెనువెంటనే వికెట్లు కోల్పోయి అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. తొలి ఇన్నింగ్సులో నితీశ్ సెంచరీతో భారత్కు హోప్స్ ఇచ్చారు. రెండో ఇన్నింగ్సులో స్టార్ బౌలర్ బుమ్రా 5 వికెట్ల ప్రదర్శనతో తక్కువ రన్స్కే కట్టడి చేశారు. అయితే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్టార్ బ్యాటర్లు చేతులెత్తేశారు. డ్రా కోసం ఆడినట్లే కనిపించినా వికెట్లను కాపాడుకోలేక పరాజయం పాలైంది.

AP: మచిలీపట్నంలో పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం మాయం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ‘బియ్యం మాయమైంది నిజం. డబ్బులు కట్టింది వాస్తవం. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గోదాము పెట్టిందెవరు? చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను మీరు తిట్టలేదా? మేము ఆడవాళ్లను ఈ కేసులో ఇరికించలేదే? పేర్ని నాని తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయి. అప్పుడు బూతులు తిట్టి, ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా?’ అని ప్రశ్నించారు.

TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సీఎం రేవంత్ ప్రతిపాదనకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ఇక తీర్మానాన్ని కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లనుంది. మరోవైపు అసెంబ్లీలో సభ్యులు సింగ్కు ఘనంగా నివాళి అర్పించారు.

AP: ముందు ఎమ్మెల్సీ అయ్యాకే క్యాబినెట్లోకి నాగబాబు వస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆయన పార్టీలో చేసిన త్యాగానికి రాజ్యసభ ఇద్దామని అనుకున్నా కుదర్లేదని తెలిపారు. తమ పార్టీ మంత్రుల ఎంపికలో కులం చూసి కాకుండా పనితీరును ప్రామాణికంగా తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే నెల నుంచి 15 రోజుల చొప్పున జిల్లాల్లో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.

‘పుష్ప-2’లో అల్లు అర్జున్ పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పేందుకు చాలా కష్టపడ్డట్లు బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే చెప్పారు. సినిమాలో AA ఎమోషన్స్, ఆటిట్యూడ్ను మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాన్ తింటున్న, డ్రింక్ చేస్తున్న సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎగ్జైట్ అయినట్లు పేర్కొన్నారు. కాగా ఈ సినిమా హిందీలో రూ.700 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.
Sorry, no posts matched your criteria.